ENSకధనాలకు CMజగన్ కార్యరూపం..


Ens Balu
2
Tadepalle
2021-07-06 17:28:42

మరో సారి సగర్వంగా ప్రకటిస్తున్నాం.. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ , www.enslive.net ద్వారా ఇప్పటి వరకూ  గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందే సేవలు, అందించడంలో ఎదురయ్యే లోపాలను, సమస్యలను, ప్రజలకు చేరువ చేసే విషయంలో అధికారులు ప్రదర్శించిన తీరుపై  అందించిన కధనాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదిలిందనే అనుకుంటున్నాం. అంతేకాదు గ్రామస్థాయిలో లోపాలను అధికారులు వెళ్లి తెలుసుకుంటేనే మరింత సేవలు అందించవచ్చునని.. దానికోసం తాను వారానికి రెండు రోజులు గ్రామ సచివాలయాలను సందర్శిస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. దానికి కారణం ఒక్కటే  గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి చాలా మీడియా సంస్థలు భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థపై పనిగట్టుకొని బురదచల్లాలని చూశాయి.. అంతేకాదు ఒకా నొక దశలో విషయం చిమ్మి, ఈ వ్యవస్థను కుప్పకూల్చాలని మాష్టర్ ప్లానే వేశాయి.. ఒక్క ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మాత్రం.. తమ నెట్వర్క్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ శాఖ ద్వారా  జరగుతున్న అభివ్రద్ధి.. ప్రజలకు సేవలు ఏవిధంగా అందుతున్నాయ్.. ఏ లోపంతో అందలేదు.. సమస్యలు, ఉద్యోగుల డిమాండ్లు ఇలా అన్ని రకాల కోణాల్లోనూ ప్రత్యేక కధనాలు అందించింది. అందిస్తోంది.. వాటిని వివిధ సామాజిక మాద్యమాల ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి, ప్రజా ప్రతినిధుల వరకూ తీసుకెళ్లేలా కూడా చేసింది. అందుకేనేమో ఏపీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు,  గ్రామవార్డు సచివాలయశాఖ జెసిలు వారంలో రెండు రోజులు సచివాలయాలను సందర్శిస్తే అక్కడ ప్రజలకు ఏ విధంగా సేవలు అందుతున్నాయి..లోపాలు, అభివ్రుద్ధి చేయడానికి మార్గాలను కనుగొనవచ్చుననే సూచనను నేరుగా ఇవ్వడం ఒక శుభపరిణామంగా చెప్పుకోవాలి. వాస్తవానికి ఒక వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి అది అభివ్రుద్ధి చెందాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చాలి. ఆ సమయంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వుండే మీడియా రక రకాల కధనాలు అందరి కళ్లముందుంచుతుంది. వాటిని కొందరు అధికారులు ఛాలెంజ్ గా తీసుకుంటే మరికొందరు అధికారులు కక్ష గట్టి రాస్తున్నారనే కోణంలో ఆలోచిస్తారు. మరికొందర అధికారులు ప్రభుత్వంలో ఇది మామూలే కదా అన్నట్టు లెక్క గడతారు. కానీ ఏపీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రికను దేశంలోనే ఒక ప్రత్యేక మైన ప్రజాసేవ వ్యవస్థగా తీర్చిదిద్దడం కోసం నేరుగా సమస్యలను, లోపాలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి వారంలో రెండు రోజులు సచివాలయానికి వస్తానని చెప్పిన మాట మా(ఈఎన్ఎస్ మీడియా హౌస్)కు ఎంతో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది. దానికి కారణం కూడా లేకపోలేదు.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయిలో మంత్రలు, రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ద్రుష్టి సారిస్తే ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు గుమ్మం ముందే సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడానికి ఎంతో సమయం పట్టదు. పైగా ఈ విషయంలో ఎదురయ్యే సమస్యలు, లోపాలను నేరుగా అధికారులే గుర్తించడానికి ఆస్కారం వుంటుంది. నాటి నుంచి నేటి వరకూ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, క్షేత్రస్థాయిలోని లోపాలు, సిబ్బంది విధులు, ప్రత్యేక జీఓలు, వాటి అమలు విషయంలో ఆది నుంచి ఏ ఒరవడితో అయితే పనిచేస్తున్నామో.. ఇదే ఉత్సాహాన్ని మరిన్ని వాస్తవాలు, ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజల ముందుకి తీసుకెళ్లడానికి శక్తివంచన లేకుండా శ్రమిస్తామని ప్రకటిస్తున్నాం. గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్యం ప్రజలంతా ప్రభుత్వ సేవల ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చూడాలని ఆశిస్తున్నాం. ఎప్పటిలాగే మంచి, చెడు, సమస్యలు, డిమాండ్లు, ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రజా సమస్యలపై ప్రత్యేక కధనాలు అందిస్తామని ప్రకటిస్తున్నాం.. గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యం..!