సేవలు బారేడు.. అనుసంధానం మూరెడు..
Ens Balu
4
Tadepalle
2021-07-09 01:47:27
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు గ్రామ/వార్డుల్లోనే అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని ఆంధ్రప్రదేశ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకి ఇంకా బాలారిష్టాలు తీరలేదు. ఇబ్బడి ముబ్బడిగా సేవలు ప్రకటించేసిన ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లను చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో నేటికీ అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అనుసంధానం పూర్తికాలేదు. కేవలం రాష్ట్వ్యాప్తంగా కొన్ని సచివాలయాలకు మాత్రమేమే సిఎస్సీ(కామన్ సర్వీస్ సెంటర్) విధానాన్ని తీసుకొచ్చింది. అన్ని జిల్లాల్లో ఉన్న సచివాలయాల్లో పైలట్ ప్రాజెక్టు క్రింద 50శాతం మాత్రమే వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనితో ప్రభుత్వం ప్రకటించిన 745 సేవలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిస్థాయిలో అందే పరిస్థితి కనిపించడం లేదు. వీటికి తోడు సచివాలయాలకు ఇంటర్నెట్ ప్రధాన సమస్యగా మారుతోంది. అన్ని గ్రామ సచివాలయాలకు ఇంటర్నెట్ స్పీడ్ రాకపోవడంతో చాలా కార్యకలాపాలు ఆదిలోనే నిలిచిపోతున్నాయి. వీరికి ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ అందించింది. అయితే అది సాధారణంగా గ్రుహ అవసరాలకు ఇచ్చే ప్యాకేజీతో అందించడం వలనే స్పీడ్ రాక ఇబ్బందులు తలెత్తుతున్నాయని సచివాయాల్లో డిజిటల్ అసిస్టెంట్లు చెబుతున్నారు. వారంలో మూడు రోజులు ఇంటర్నెట్ స్పీడ్ సమస్యను సచివాలయాలు ఎదుర్కొంటున్నాయి. వీటికిత తోడు ప్రభుత్వం సాధారణ కంప్యూటర్లు, ప్రింటర్లు మాత్రమే సచివాలయాలకు అందించింది. అపుడే చాలచోట్ల కంప్యూటర్లకు రిపేర్లు వచ్చాయి. ప్రింటర్లు పనిచేయకపోవడంతో డిజిటల్ అసిస్టెంట్లే తమ సొంత నిధులతో వాటిని బాగు చేయిస్తున్నారు. ఒక్కో సచివాలయానికి ప్రభుత్వం రెండు కంప్యూటర్లును మంజూరు చేసింది. 14 మంది సిబ్బంది ఒక సిస్టమ్ ను మాత్రమే దశల వారీగా వినియోగించుకోవాల్సి వస్తుంది. చాలా మంది ఉద్యోగులు ఆ ఇబ్బందులు పడలేక సొంతంగా ల్యాప్ ట్యాప్ లు సొంతంగా తీసుకెళ్లి పనిచేసుకోవాల్సివస్తుంది. మరికొంత మందికి ల్యాప్ టాప్ లు అందుబాటులోల లేని చోట్ల చాలా పనులు పెండింగ్ లోనే ఉండిపోతున్నాయి. ప్రభుత్వం సేవలు పెంచిన తరువాత కామన్ సర్వీస్ సెంటర్ విధానాన్ని గ్రామసచివాలయాలకు అనుసంధానం చేస్తే ఇటు రాష్ట్రప్రభుత్వ శాఖలతోపాటు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన అనుమతులు కూడా గ్రామ స్థాయిలోని సచివాలయాల నుంచే ఇవ్వడానికి ఆస్కారం వుంటుంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖాలాలు ఎక్కడా కనిపించడం లేదు. పైగా కొత్తగా చేర్చిన సేవలపై సిబ్బందికి ఎలాంటి శిక్షణ కూడా లేకపోవడంతో మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అంతేకాదు ఆ సేవల వివరాలు ఏంటో ఇప్పటికీ సచివాలయ సిబ్బందికే తెలియని పరిస్థితి నెలకొంది. కనీసం గ్రామ, వార్డు స్థాయిల్లోని సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం అందించేసేవలపై అవగాహన ఉంటే వారు వాలంటీర్లకు తెలియజేసి.. ప్రజలకు ఆ సేవలను చేరువ చేస్తారు. కానీ అలా ప్రోటోకాల్ స్థాయిలో ప్రభుత్వం ఇక్కడ అందించే సేవలపై ప్రజలకు గానీ, సిబ్బందికి గానీ అవగాహన కల్పించలేదు. దీనితో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైంది రాష్ట్రంలోని గ్రామసచివాలయాల సేవల పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే సేవలపై సచివాలయాల్లో ప్రత్యేక డిస్ప్లే చార్టులు ఏర్పాటు చేయడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్ల సెల్ ఫోన్లలకైనా సచివాలయాల్లో అందే సేవలపై ప్రత్యేక ప్రచారం, అవగాహన కల్పించాల్సిన సమయం ఆశన్న మైంది. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు అవసరం ఉండటం, అందులో చాలా లోపాలు ఉండటంతో వాటిని గ్రామ స్థాయిలో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దానికోసం చాలా మంది అవగాహన లేనివారం మేసేవా కేంద్రాలను, బ్యాంకుల్లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలకు వెళుతున్నారు. ప్రభుత్వానికి వచ్చే అత్యధిక ఆదాయం వీటిద్వారానే పోతుంది. వచ్చే ఆ కొద్దిపాటి ఆదాయం కూడా గ్రామస సచివాలయాలు కోల్పోతే..ఇక్కడ ఎన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినా ప్రజలకు ఉపయోగ పడవనే గుర్తించాలి.. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుని సచివాలయాల్లో అందించే సేవల విషయంలో ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి..!