GoNo-2ను సస్పెండ్ చేసిన హైకోర్టు..


Ens Balu
2
Tadepalle
2021-07-12 16:40:52

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో జీఓనెంబరు2 విషయంలో మరోసారి చుక్కెదురైంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీఓను సోమవారం ఆంధ్రప్రదేశ్  హైకోర్టు సస్పెండ్‌ చేసింది. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్‌వోలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసింది. అయితే దీనిని సవాల్‌ చేస్తూ గుంటూరు జిల్లా తోకలవారిపాలెం సర్పంచ్‌ కృష్ణమోహన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషనర్‌ తరపున వాదనలు న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ ఈ జీఓ కార్యదర్శిలు, సర్పంచ్ ల అధికారాలు హరించేలా వుందని తమ వాదలను వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73 సవరణకు, ఏపీ పంచాయతీరాజ్ చట్టానికి ఇది విరుద్ధంగా ఉందని కోర్టుకి విన్నవించారు. దీనితో పంచాయతీ సర్పంచ్‌ అధికారాలు వీఆర్‌వోలకు ఎలా ఇస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటివరకూ సర్పంచులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగిన పాలనను వీఆర్‌వోలకు అప్పగించడమేంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. అయితే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి వీఆర్వోలకు ఈ అధికారాలు ఇస్తూ జీఓ జారీచేసినట్టు ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకి తెలియజేశారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేస్తు్న్నట్లు హైకోర్టు ప్రకటించింది. అయితే ఇదే కేసు విషయంపై గతంలో గ్రామ పంచాయతీలు ఉండగా దానికి సమాంతరంగా ఎందుకు గ్రామసచివాలయాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించింది కూడా ఇపుడు జీఓనెం-2ను సస్పెండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైకోర్టు తీర్పుని పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బుచ్చిరాజు స్వాగతించారు. డిడిఓ అధికారాలు కార్యదర్శిలకే ఉండాలన్నారు. పంచాయతీ కార్యకాలపాలపై వీఆర్వోలకు ఎలాంటి అవగాహన కూడా లేదని పేర్కొన్నారు. నిరంతరం పనిచేసే కార్యదర్శిలకు అధికారాలు ఉండటం వలన ప్రజలకు మంచి సేవలు అందించడానికి వీలుపడుతుందన్నారు. కాగా ఇదే విషయమై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరువాత ఎదురైన అంశాలన్నీ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా కూడా ప్రత్యేక కధనాలు అందించింది. ముఖ్యంగా ఈఎన్ఎస్ లైవ్ ప్రస్తావించిన ఆర్టికల్ 73 విషయంలో కోర్టు ఆ జీఓను సస్పెండ్ చేయడం చర్చనీయాంశమవుతోంది..