మాస్క్ లేకపోతే రూ.100 ఫైన్..
Ens Balu
3
Tadepalle
2021-07-12 16:52:22
కోవిడ్ నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం చేపట్టిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాస్క్ ధరించకపోతే రూ.100ల జరిమానా కచ్చితంగా అమలు చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారులకు వరకూ మాస్క్‌లు ధరించాల్సిందే. ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానాలతో పాటు అవసరమైతే 2–3 రోజులు దుకాణాలు మూసివేతకు ప్రభుత్వం ఆదేశించింది. ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఎవరైనా ఫొటో తీసి పంపినా జరిమానాలు విధించే విధంగా దీని కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ కఠినంగా అమలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలెవ్వరూ గుమిగూడకుండా కఠిన ఆంక్షలతో పాటు మార్కెట్లు, తదితర చోట్ల కూడా మాస్క్‌లు ధరించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కెట్ కమిటీలు మాస్క్‌లు ధరించేలా చూడాలంటూ ప్రభుత్వం ఆదేశించింది.