ప్రభుత్వ జీఓలకు కోర్టులో శృంగభంగం..


Ens Balu
9
Tadepalle
2021-07-13 02:17:04

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచనలకు, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ను సవరించకుండా ఇచ్చిన ప్రత్యేక జీఓలకు హైకోర్టులో శృంగభంగం తప్పడం లేదు. భారత దేశంలోనే గ్రామ వ్యవస్థ ఒక నూతన అధ్యాయం. అలాంటి సచివాలయ వ్యవస్థకు ఆదిలోనే చరమగీతం పాడాలని అనుకుంటున్నారో.. ఏమో తెలీదుగానీ.. ప్రభుత్వంలోని కొందరు ఐఏఎస్ అధికారులు తీసుకుంటున్న ఏ నిర్ణయమైనా సచివాలయ ఉద్యోగులకు వ్యతిరేకంగానే నిలుస్తున్నది. గ్రామాభివ్రుద్ధి కోసం అమలు చేయాల్సిన జీఓనెంబరు 149 లాంటి వాటిని ఖచ్చితంగా అమలు చేయకుండా.. వున్న అధికారాలన్నీ కనీసం డిగ్రీ అర్హత కూడా లేని వీఆర్వోల చేతిలో పెట్టాలంటూ ఇచ్చిన జీఓనెంబరు 2 ప్రభుత్వ ప్రతిష్టకు హైకోర్టు సాక్షిగా భంగం వాటిల్లుతోంది. జిల్లా స్థాయిలో అన్ని ప్రభుత్వంశాఖలకు చైర్మన్ గా వుండే జిల్లా కలెక్టర్ మాదిరిగా.. గ్రామాల్లో కూడా సుమారు 14శాఖలకు అధిపతిగా సచివాలయాకు పంచాయతీ కార్యదర్శిలను అధిపతులుగా ప్రభుత్వమే ఒక మంచి వ్యవస్తను ఏర్పాటు చేసింది. అంతాబాగానే వుందనుకున్న సమయంలో ఈ వ్యవస్థ కూడా రెవిన్యూ చేతిలోనే ఉండాలనుకుని భావించిన ప్రభుత్వం పంచాయతీ సర్పంచ్ లు, సచివాలయాల సిబ్బందికి అందరూ వీఆర్వో కిందనే ఉండాలంటూ వారిని డిడిఓలుగా చేస్తూ జీఓనెంబరు 2 జారీచేసింది. దీనిని సవాల్‌ చేస్తూ గుంటూరు జిల్లా తోకలవారిపాలెం సర్పంచ్‌ కృష్ణమోహన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషనర్‌ తరపున వాదనలు న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ ఈ జీఓ కార్యదర్శిలు, సర్పంచ్ ల అధికారాలు హరించేలా వుందని తమ వాదలను వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73 సవరణకు, ఏపీ పంచాయతీరాజ్ చట్టానికి ఇది విరుద్ధంగా ఉందని కోర్టుకి విన్నవించారు. దీనితో పంచాయతీ సర్పంచ్‌ అధికారాలు వీఆర్‌వోలకు ఎలా ఇస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటివరకూ సర్పంచులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగిన పాలనను వీఆర్‌వోలకు అప్పగించడమేంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. అయితే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి వీఆర్వోలకు ఈ అధికారాలు ఇస్తూ జీఓ జారీచేసినట్టు ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకి తెలియజేశారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేస్తు్న్నట్లు హైకోర్టు ప్రకటించింది. అయితే ఇదే కేసు విషయంపై గతంలో గ్రామ పంచాయతీలు ఉండగా దానికి సమాంతరంగా ఎందుకు గ్రామసచివాలయాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటూ హైకోర్టు ప్రశ్నించింది కూడా.. ఇపుడు ఆ జీఓనెం-2ను సస్పెండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వరుసగా ప్రభుత్వ జీఓలన్నింటికీ కోర్టుల్లో మొట్టికాయలు పడుతున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ద్వారా అధికార బదలాయింపు చేపట్టకపోతే.. కోర్టుకు వెళితే పనిజరుగుతుందనే నిర్ణయంలో కార్యదర్శిలంతా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అనవసర జీఓలను తెరమీదకు తెచ్చి.. అధికార వికేంద్రకరణ చేపట్టే జీఓనెంబరు 149 లాంటి వాటిని మండల స్థాయిలో ఎంపీడీఓలు, జిల్లా స్థాయిలో డీపీఓలు, కలెక్టర్లు, రాష్ట్రస్థాయిలో కమిషనర్లు తొక్కిపెడుతున్నట్టు సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు భావిస్తున్నారు. తమకు న్యాయం జరగాలన్నా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల కబందహస్తాల్లో వున్న అధికారాలు.. సచివాలయాల వారీగా బదిలీకావాలన్నా హైకోర్టు ఒక్కటే శరణ్యమనే ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఎవరి నుంచి అనుకూలంగా హామీలు కూడా రాలేదని చెబుతున్నారు. తాము ఉద్యోగాల్లోకి నవంబరు నెల వస్తే రెండేళ్లు పూర్తవుతాయని..ఇప్పటికి కూడా తమకు ఎలాంటి అధికారాలు ఇవ్వకుండానే ప్రభుత్వం తమో పనిచేయిస్తుందని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పంచాయతీ కార్యదర్శిలకు మాత్రం ఒక్కొక్కరికీ రెండు మూడు గ్రామ పంచాయతీలను అదనపు బాధ్యతలు అప్పగిస్తుంది గానీ..తమకు మాత్రం ప్రభుత్వమే ఇచ్చిన జీఓ ద్వారా మాత్రం అధికారాలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. ప్రత్యేక జీఓలను అమలు చేయడం ఇష్టంట లేని ప్రభుత్వం ఎందుకు జీఓనెంబరు149 విడుదల చేయాలని.. లేదంటే దానిని అధికారికంగా రద్దు చేయాలని గ్రేడ్-5  పంచాయతీ కార్యదర్శిలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమకు అధికారాలు ఇచ్చే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో.. గ్రామసచివాలయ పరిధిలో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్నా..కనీసం బ్లీచింగ్ చల్లించాలన్నా.. అత్యవసరంగా ఏపనిచేయించాలన్నా పరుగు పరుగున గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శి దగ్గరకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమకు సంక్రమించాల్సిన అధికారాలు తమకు బదలాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలా చేయకపోయినా.. మరో ఐఏళ్లలో పాత గ్రేడ్1 పంచాయతీ కార్యదర్శిలంతా 80శాతం  ఉద్యోగ విరమణ చేస్తారని, అపుడైనా ఆ అధికారాలు తమకు వస్తాయని.. దానికంటే ముందు ప్రభుత్వమే జీఓనెంబరు 149 అమలు చేసి రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ సచివాలయ కార్యదర్శిదర్శిలకు సచివాలయాల వారీగా అధికార బదలాయింపు చేస్తే ప్రభుత్వ లక్ష్యం..గ్రామాల అభివ్రుద్ధి..ప్రజలకు సేవలు పూర్తిస్థాయిలో అందుతాయని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే జాబ్ కేలండర్ విషయంలో ప్రభుత్వ తీరుపై గుర్రుగా వున్న నిరుద్యోగుల మాదిరిగానే..సచివాలయ ఉద్యోగులు కూడా తమ డిమాండ్ ను పరిష్కరించకపోతే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేలా కనిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వున్న మంచి అభిప్రాయం కోల్పోవడమే కాకుండా..గ్రామస్థాయిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే సచివాలయాల్లో అధికారాలు తమకు బదలాయింలేదనే బాధతో చాలా చోట్ల గ్రేడ్-5 కార్యదర్శిలు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా జరగుతుంది. ఈ తరుణంలో రాబోయో పరిణామాలు ఏ విధమైన మలుపుతిరుగుతాయో చూడాల్సి వుంది..!