సీఎం చీఫ్ సెక్రటరీగా ఆర్.ముత్యాలరాజు..


Ens Balu
3
Tadepalle
2021-07-13 13:17:41

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా విభాగం(జీఏడి, పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి బాధ్యతల నుంచి ప్రవీణ్‌ ప్రకాశ్‌ మంగళవారం రిలీవ్‌ అయ్యారు. ఆయన స్థానంలో జీఏడీ (పొలిటికల్‌) బాధ్యతలను రేవు ముత్యాలరాజుకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ సీఎస్ ఉద్యోగ విరమణ చేస్తున్న సమయంలో ఈ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ప్రభుత్వం కాబోయే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమిస్తుందనే విషయంలో అపుడే ప్రాధాన్యత క్రమాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.