ఆంధ్రప్రదేశ్ ఓ ప్రాధమిక, గ్రామీణ వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం వడి వడిగా అడుగులు వేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 539 అంబులెన్సు వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిని అన్ని పీహెచ్సీలకు 104గా కేటాయించనున్నారు. దీనికోసం రూ.89.27 కోట్లతో 539 అంబులెన్సులు కొనుగోలు చేసి పీహెచ్సీలకు అందించనుంది. ఇప్పటికే 104 అంబులెన్సులు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 539 అంబులెన్సులపై ఏటా రూ.75.82 కోట్ల మేర వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. పీహెచ్సీ పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ వీటి ద్వారా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. కొత్త అంబులెన్సుల కొనుగోలుతో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పన కూడా జరగనుంది.