డిజిపికి మహిళా పోలీసుల కృతజ్ఞతలు..
Ens Balu
5
Tadepalle
2021-07-13 14:48:35
ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రత, రక్షణకు పెద్దపీటవేస్తూ వారికి తోడుగా ఉండేందుకు మహిళా పోలీసులకు సముచిత స్థానం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కల్పించాలరని మహిళా పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం మహిళా పోలీసులు డిజిపి గౌతం సవాంగ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయల్లోని 15000 మంది మహిళ సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తిస్తూ జీవో నెంబర్ 59ని జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం డిజిపి గౌతం సవాంగ్ మాట్లాడుతూ, సీఎం ఎంతో ఉన్నత లక్ష్యంతో మహిళా పోలీసులను సాధారణ పోలీసులుగా గుర్తించారని.. తద్వారా గ్రామాల్లోని మహిళలకు ఎంతో రక్షణ ఏర్పడుతుందన్నారు. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ సేవలను మహిళలకు చైతన్యం కల్పించే బాధ్యత మహిళా పోలీసులదేనన్నారు. చక్కగా పనిచేసి..మహిళల కష్టాలకు అంగా ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా మహిళా పోలీసులు పనిచేయాలని సూచించారు. పోలీసు శాఖలో అంతర్భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పోలీస్ శాఖ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తామని మహిళా పోలీసులు డిజిపి బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ సర్వీసెస్ డిఐజి జి.పాలరాజు తదితరులు పాల్గొన్నారు.