ENSకథనాలపై స్పందించిన సీఎం జగన్..


Ens Balu
11
Tadepalle
2021-07-17 16:02:21

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మానసపుత్రిక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని లోపాలు, అధికారుల అనాలోచిత నిర్ణయాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తున్న ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్, ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net కథనాలకు(న్యూస్ కార్డ్) జిల్లా కలెక్టర్లు స్పందించక పోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తున్న తీరు ప్రజల నుంచి విశేషంగా మన్ననలు అందుకుంటోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో అభివ్రుద్ధి, లోపాలు, అధికారుల అనాలోచిత నిర్ణయాల వలన ప్రజలకు ఏవిధంగా సేవలు అందించలేకపోతుందనే విషయాన్ని ఈఎన్ఎస్ లైవ్ ద్వారా ఎప్పటికప్పుడు కథనాలు అందిస్తున్నాం. ముఖ్యంగా సచివాలయ స్పందనకు కరోనా మోలకాడ్డు శీర్షికన వచ్చిన కథనంపై నేరుగా సీఎం వైఎస్ జగన్ స్పందించి, జిల్లా కలెక్టర్లకు హెచ్చరికలు జారీచేసిన తీరు ఒక్కసారిగా 16 ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శిలను కదిలించేలా చేసింది. ముఖ్యంగా మండల అధికారులు సచివాలయ సిబ్బందిలో కీలక భూమిక వహించే డిజిటల్ అసిస్టెంట్లను కరోనా వేక్సినేషన్ క్యాంపులకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు పంపడం, సచివాలయ కార్యదర్శిలకు ఒకటి రెండు అదనపు సచివాలయాలు డిప్యుటేషన్ వేయడం తదితర విషయాలను ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అందించాం. సరిగ్గా ఇవే కారణాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి ప్రతీ ముఖ్యమైన సమాచారాన్ని, ప్రభుత్వం విడుదల చేసి జీఓ నెంబర్లు, అందులో ప్రస్తావించిన ముఖ్యమైన విషయాలను  ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా ప్రత్యేకంగా కధనాలు అందిస్తున్నాం. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు స్పందించినా చర్యలు తీసుకోకపోవడం, రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీఓలు కరోనా వేక్సినేషన్ లో తామంతా తెగ కష్టపడిపోతున్నామని జిల్లా కలెక్టర్ల వద్ద రంగు పులుముకోవడానికి సచివాలయ సిబ్బంది అదనపు విధుల కోసం రెండవ శనివారాలు, ఆదివారాలు అనే తేడా లేకుండా కరోనా వేక్సినేషన్ కు, మండల కార్యాలయంలోని పనులకు వినియోగించుకున్న విషయాన్ని బయటకు తీసుకు వచ్చింది ఈఎన్ఎస్. అయితే మొదట్లో చాలా లైట్ తీసుకున్న జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, జెడ్పీసీఈఓలు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన వీడియో కాన్ఫరెన్సులో ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్ ద్వారా ప్రస్తావించిన కధనాల్లో విషయాలపై తలంటడంతో ఒక్కసారిగా అధికారులంతా కంగారు పడ్డారు. ముఖ్యంగా డిజిటల్ అసిస్టెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మండల అధికారులు సచివాలయాల నుంచి కదపడానికి వీల్లేదని చేసిన ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తూ ఈఎన్ఎస్ కార్యాలయానికి ఫోన్లు చేసి తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ విధులకు ఆటంకం కలిగించ వద్దని ప్రత్యేకంగా జీఓ జారీచేసినా జిల్లా అధికారుల ఆదేశాలతో మండల అధికారులు అదనపు విధులు అప్పగించడంతోపాటు  కార్యాలయ విధులకు వినియోగించుకునేవారని, ఈఎన్ఎస్ కధనాలతో ప్రభుత్వంలో చలనం వచ్చి నేరుగా విషయం ముఖ్యమంత్రి ద్రుష్టికీ తీసుకెళ్లారంటూ ఆనందాన్ని పంచుకున్నారు. సీఎం ఆదేశాలతో తమకు విముక్తి లభించినట్టు అయ్యిందని అభిప్రాయపడుతున్నారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి తోపాటు సుమారు 16 ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శిలు, పోలీస్ డీజీపి కూడా సచివాలయ ఉద్యోగులకు అదనపు విధులు కేటాయించడానికి వీల్లేదని, డిప్యుటేషన్లు అసలు వేయవద్దని.. ఒకవేళ వేసి వుంటే తక్షణమే రద్దు చేయాలని ఆదేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు జిల్లా అధికారులకు టెలీకాన్ఫరెన్సుల ద్వారా ఆదేశాలు జారీచేస్తున్నారు. వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది సోమవారం నుంచి సచివాలయాలకే పరిమితం కావాలని కలెక్టర్లు గట్టిగా ఆదేశాలు జారీచేశారు. తప్పనిసరిగా బయోమెట్రిక్ నూటికి నూరుశాతం పడేలా చేయాలని చెప్పడం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. దీనితో ఈఎన్ఎస్ కధనాలు రాష్ట్రప్రభుత్వాన్ని చైతన్య పరచడంలో కీలక భూమిక వహించినట్టైంది. ఇపుడే కాకుండా ముఖ్యమంత్రి మానసపుత్రిక గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా జరిగే అభివ్రుద్ధి, అందే సేవలపై రానున్న రోజుల్లోనూ మంచి మంచి కధనాలు అందిస్తామని కూడా ఈఎన్ఎస్ లైవ్ యాప్ మరోసారి తెలియజేస్తుంది. ఈ విషయంలో ఎలాంటి బెదిరింపులు వచ్చినా, ఒత్తిడిలు వచ్చినా ఎక్కడా వెనుకడుగు వేసేది లేదని కూడా ప్రకటిస్తున్నాం. వైఎస్.జగన్మోహనరెడ్డి భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థ దేశంలోనే ఆదర్శమైందనే విషయాన్ని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడంలో ఎల్లప్పుడూ ముందుంటామని కూడా చెబుతున్నాం. అదే సమయంలో సచివాలయ వ్యవస్థలోని లోపాలను, అధికారుల ఏకపక్ష నిర్ణయాలు, మండల అధికారుల అనాలోచిత చర్యలను కూడా ఎప్పటికప్పుడు ఎండగడతామని, అదే సమయంలో ఉన్నతంగా పనిచేసిన అధికారులపై కూడా ప్రత్యేక చైతన్య, ఆదర్శవంతమైన కధనాలు(న్యూస్ కార్డ్) అందిస్తామని కూడా స్పష్టం చేస్తున్నాం. ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించే సేవలను అన్ని మీడియాల కంటే ముందుగా తెలియజేస్తామని కూడా మాట ఇస్తున్నాం. సచివాలయాల సేవల్లో ఈఎన్ఎస్ లైవ్ యాప్ కూడా భాగస్వామ్యం అవుతుందని తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పర్యటనలు, సూచనలు, సలహాలు కూడా ప్రజలకు కధనాల ద్వారా తెలియజేస్తామని ప్రకటిస్తున్నాం..!