కోర్టు ఆదేశాలను అమలు చేయని IAS లు..


Ens Balu
13
అమరావతి
2021-07-18 05:20:28

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలోని ఉన్నతాధికారులకు కోర్టు కష్టాలు తప్పడం లేదు.. కాదు కాదు కోర్టు ఆదేశాలను అమలు చేయక కావాలనే సీనియర్ ఐఏఎస్ లు కష్టాలు కోరి తెచ్చుకుంటున్నారు.. తాజాగా హైకోర్టు ఆగ్రహానికి గురైన పంచాయతీరాజ్ శాఖ అధికారులకు మరోసారి హైకోర్టు మెట్లెక్కారు. ప్రభుత్వం శాఖల్లోని అత్యధిక సంఖ్యలో కోర్టు వ్యవహారాల చుట్టూ తిరుగుతున్నశాఖగా కూడా పంచాయతీరాజ్ శాఖ వార్తల్లో నానుతూనే వుంది. వివరాలు తెలుసుకుంటే తన నియామకం నాటి నుంచి బిల్ కలెక్టర్ గా సర్వీసుని క్రమబద్దీకరించాలని తూర్పుగోదావరి జిల్లా చెందిన భైరవమూర్తి 2019లో హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడే హైకోర్టు ఆయన సర్వీనుకి క్రమబద్దీకరించాలని అధికారులను ఆదేశించింది. అయితే ఎప్పటిమాదిరిగానే హైకోర్టు ఆదేశాలను పంచాయతీరాజ్ శాఖ అధికారులు అమలు చేయకుండా ఉండిపోయారు. దీనితో బైరవమూర్తి మళ్లీ 2020లో హైకోర్టులోనే కోర్టు ధిక్కరణ వాజ్యం వేశారు. అందులో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, తూర్పోగోదావరి జిల్లా కలెక్టర్ జి.మురళీధరరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ఎస్వీనాగేశ్వర నాయక్ ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. దీనితో కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు మళ్లీ హైకోర్టులో సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ శాఖల్లోనే హైకోర్టు ఆదేశాలే కాదు.. ప్రభుత్వం ఇచ్చిన జీఓలనే అమలు చేయని శాఖగా కూడా గుర్తింపు తెచ్చున్న ఈ శాఖ అధికారులు ఇటీవల హైకోర్టు ఆగ్రహానికి గురై వింత శిక్షను కూడా అనుభవించారు.  అయినప్పటికీ ఈ శాఖ అధికారుల తీరులో మాత్రం మార్పురాలేదు. వాస్తవానికి శాఖాపరంగా చేసిన తప్పులపై ఉద్యోగులు కోర్టుకి వెళ్లిన సమయంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వంలోని సదరు శాఖ ముఖ్యకార్యదర్శి అమలు చేయాల్సి వుంది. విచిత్రంగా పంచాయతీరాజ్ శాఖలో మాత్రం ఆవిధంగా జరగడంలేదు. ఫలితంగా అధికారుల తీరువలన ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుంది. అలాగని ఏ విషయంలో అయితే ఉద్యోగులు కోర్టుకెళ్లారో దానికి సంబంధించిన కౌంటర్ ను కూడా ప్రభుత్వశాఖ పరంగా కోర్టు ముందుంచలేకపోతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను భేఖాతరు చేస్తూ సంజాయిషిలు ఇస్తున్నారు తప్పితే న్యాయస్థానం ఆదేశాలను మాత్రం అమలు చేయకపోతున్నారనే విషయం కోర్టులు ఇచ్చే దిక్కరణన నోటీసులు, అధికారులకు కోర్టులు వేసే శిక్షలే రుజువు చేస్తున్నాయి. అసలు హైకోర్టు పలు కేసుల విషయంలో రాష్ట్ర ఉన్నతాధికారులను తీవ్రంగా హెచ్చరించడం, శిక్షలు వేయడాన్ని ప్రభుత్వంలోని ముఖ్యకార్యదర్శి సుమోటాగా స్వీకరించి ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలుసుకోవాల్సి వుంది. లేదంటే ఒక్క ప్రభుత్వశాఖ చేసిన తప్పుకు ప్రతీసారి అధికారులు కోర్టుకు హాజరవుతున్నారంటే.. దానికి కారణం ప్రభుత్వంలో పరిపాలన సక్రమంగా లేదని, అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. కోర్టు ప్రభుత్వశాఖల అధికారులను హెచ్చరించినా.. అధికారులకు శిక్షలు వేసినా అవి అధికారలకే అన్నట్టు బావిస్తుందా... లేదంటే ప్రభుత్వానికి వేస్తున్నట్టు బావిస్తోందో అర్ధం కాని పరిస్థి ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖలో నెలకొని వుందనే విమర్శలు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తున్నాయి.. ఇప్పటికైనా ప్రభుత్వం ఆయా ప్రభుత్వశాఖల కార్యదర్శిలకి నిర్ధిష్ట ఆదేశాలిస్తే తప్పా రాజున్న రోజుల్లో మరిన్ని వ్యవహారాలు, కేసుల విషయంలో హైకోర్టుతోపాటు, ఇతర కోర్టుల ఆగ్రహానికి గురికాక తప్పని పరిస్థితులే కనిపిస్తున్నాయి.