గ్రేడ్-5 కార్యదర్శిల చూపు గ్రూప్-2 వైపు..


Ens Balu
59
Guntur
2021-07-19 02:15:22

ఒక్క నిర్ణయం జీవితాలను మార్చేస్తుందనే నానుడి ఎపుడైనా విన్నారా.. దానికి నిలువెత్తు నిదర్శనం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకున్న గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయంతో లక్షా 20వేల మంది జీవితాల్లో వెలుగునిండాయి. కానీ ఆ ఆనందం సచివాలయాల్లో విధులు నిర్వహించే గ్రేడ్-5 కార్యదర్శిల్లో లేదు. దానికి కారణం ప్రభుత్వం ఒక్క నిర్ణయంతో ఉద్యోగ కల్పన అయితే చేసిందిగానీ.. ప్రభుత్వమే విడుదల చేసిన జీఓనెంబరు 149ని అమలు చేయకపోవడంతో ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా వున్న సుమారు 6వేలకు పైగా వున్న గ్రేడ-5 కార్యదర్శిలు కూడా ఓ నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారట. అతి తక్కువ జీతం(2ఏళ్లుగా రూ.15వేలే).. సాధారణ ప్రభుత్వ శాఖల ఉద్యోగాల కంటే అనదంగా మూడు గంటల పని.. మరీ ముఖ్యంగా చేతిలో కనీసం అధికారంలేని ఉద్యోగం.. ఏ చిన్న పనికైనా పంచాయతీ గ్రేడ్-1 కార్యదర్శిని జోలిపట్ట అడుక్కోవడం..ఇలాలంటి ఉద్యోగం  చేసే కన్నా.. ఈ ఉద్యోగానికి సలాంకొట్టి ప్రభుత్వం కొత్తగా తీయబోయే జాబ్ కేలండర్ కి పోటీ పడితే ఏదో ఒక పోస్టు కొట్టి మన జీవితాలను మార్చుకోవచ్చు అనే నిర్ణయానికి వచ్చారట వీరంతా.. తమకు జీఓనెంబరు 149 ద్వారా అధికార బదలాయింపులు గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల నుంచి వాటి పరిధిలోని సచివాలయాలకు మార్పుచేయాలని ఎంపీడీఓలు, డీపీఓలు, ఎమ్మెల్యేలు, ఆఖరికి పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి ద్విదేది, కమిషనర్ గిరిజా శంఖర్ కు వినతి పత్రాలు ఇచ్చినా నేటికీ ఫలితం మాత్రం రాలేదు. దీనితో వారి వారి ఆలోచనలను సామాజిక మాద్యమాల్లో షేర్ చేసుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు.. కాకపోతే అవి ఎందకూ పనిచేయలేదని ఆవేదన చెందతున్నారు. తామేమీ కొత్తగా తమకోసం జీఓలు తెమ్మని కోరడం లేదని.. ఉన్నజీఓలనే అమలు చేయమని డిమాండ్ చేస్తున్నామంటూ మీడియా ముందు గొల్లుమంటున్నారు. రాష్ట్రప్రభుత్వంలో ఏ ప్రభుత్వశాఖ ఉద్యోగికి కైనా ఒక నిర్ధిష్ట డ్యూటీ  వుంటుందని.. కానీ విచిత్రంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలో మాత్రమే అటు ప్రభుత్వానికి గానీ, ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలకు గానీ క్లారిటీ లేదని.. అధికారాలు, దస్త్రాలు లేని ఉద్యోగులుగా తామే గుర్తించబడ్డామనేది వీరి ఆవేదన. అంతేకాకుండా అటు ప్రభుత్వం కూడా ఒక్కోసారి ఒక్కోవిధంగా వ్యవహరిస్తూ జీఓలు విడుదల చేస్తుందని పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన జాబ్ కేలండర్ లో పెంచుతున్న ఉద్యోగాల్లో  డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉన్న మనమంతా భవిష్యత్తు చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చి ఆదిశగా ప్రయత్నాలు, కొత్త ఉద్యోగాల కోసం పోటీ పడాలని వాట్సప్, టెలీగ్రామ్, ఫోన్లు ద్వారా తమ తమ ఆలోచనలను పంచుకోవడం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అదే జరిగితే ప్రభుత్వం ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖ నుంచే వేలల్లో ఉద్యోగులను కోల్పోవాల్సి వస్తుంది. అపుడు మళ్లీ ఉద్యోగ ప్రకటన ద్వారా ప్రభుత్వం మరోసారి ఉద్యోగ నియామకాలు, శిక్షణ చేపట్టాల్సి వస్తుంది. కొరివితో తలగోక్కున్నట్టు జీఓనెంబరు 149ని అమలు చేస్తే చాలా మంది ఉద్యోగులు తమ తమ ఉద్యోగాల్లో ఉండటానికి కూడా అవకాశం వుంటుంది. లేదంటే ప్రస్తుతం ఉద్యోగాల్లో వున్న 80శాతం యువత వేర్వేరు ఉద్యోగాలకు వెళ్లిపోవడానికి సిద్దంగా వున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అసలు ప్రభుత్వమే విడుదల చేసిన జీఓనెంబరు 149ని ఎందుకు అమలు చేయడం లేదో నేటికీ దానిని విడుదల చేసిన రాష్ట్ర అధికారులకు గానీ.. జిల్లా కలెక్టర్లకుగా గానీ అంతు చిక్కడం లేదు. అలాగని రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలకు ఉద్యోగ కాలం కూడా ఎంతో కాలం లేదు. వారంతా సుమారు ఐదు నుంచి ఏడేళ్లలో ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తుంది. అపుడు ఆ స్థానికి వెళ్లిన వారి నుంచి కూడా ఇదే స్థాయిలో ప్రతిఘటన ఎదురైతే.. జీఓ నెంబరు 149 అమలు కాకపోతే ప్రభుత్వానికి తలనొప్పులు తప్పవు.. ఆ స్థానంలోకి వచ్చే గ్రేడ్-5 కార్యదర్శిలు కూడా ఇదే ఇబ్బందులు ఎదుక్కొటారు. వాస్తవానికి గ్రామసచివాలయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలని రాష్ట్రంలో ఒక వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోందని కూడా పలు కేసులు కోర్టులకు చేరిన విషయం కూడా రుజువు చేస్తుంది. ఈ సమయంలోనే ఆ జీఓ-2పై హైకోర్టుకి వెళ్లడంతో అక్కడ కోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రామపంచాయతీలు ఉండగా ఎందుకు గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారనే చాలా పెద్ద పదం వాడింది. అంతేకాకుండా పంచాయతీరాజ్ చట్టాన్ని మదించి, రాజ్యాంగంలోని 73వ అధికరణానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీఓనెంబరు 2పై కోర్టులు కీలకంగా వ్యాఖ్యానించినా ప్రభుత్వంలో గానీ.. ప్రభుత్వశాఖల కార్యర్శిల్లో గానీ మార్పు రాలేదు. ఈ పరిణామాలన్నీ క్షుణ్ణంగా గమనిస్తున్న సచివాలయ ఉద్యోగులు, ముఖ్యంగా గ్రేడ్-5 కార్యదర్శిలు ఈ ఉద్యోగాల్లో ఉంటే ఎలాంటి అధికారం లేకుండా.. కనీసం ప్రజలకు సేవ చేసే అవకాశం కూడా రాదని.. ఇలా అయితే ఉద్యోగాలు చేసి అనవసరమనే భావనకు వచ్చారు. విశేషమేమిటంటే అటెండరు నుంచి ఐఏఎస్ వరకూ అన్ని ఉద్యోగాల్లోనూ అధికారాలను కట్టబెట్టిన రాష్ట్రప్రభుత్వం  ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగుల జాబ్ చార్ట్ విషయంలో సరైన క్లారిటీ ఇవ్వకపోగా.. ఒక్క అధికారమూ కట్టబెట్టలేదు. పైగా ప్రభుత్వమే విడుదల చేసిన జీఓనెంబరు 149ని అమలు చేయకుండా గ్రేడ్-1 కార్యదర్శిల చేతిలోనే అధికారాలన్నీ ఉంచి గ్రేడ్-5 కార్యదర్శిలను ప్రతీ చిన్నపనికీ వీరందరిన పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేలా ప్రభుత్వ అధికారులే చేస్తున్నారు. దీనితో పేరుకి గ్రేడ్-5 కార్యదర్శిలుగా వున్న వీరంతా ఏ పనికావాలన్నా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల చుట్టూ దండలుకట్టుకొని తిరగాల్సి వస్తుంది. వాళ్లైనా పంచాయతీల్లో తిన్నగా వుంటున్నారా అంటే ఒక్కో కార్యదర్శికి రెండు నుంచి మూడు పంచాయతీలు ఇన్చార్జిలు అప్పగించారు జిల్లా అధికారులు. ఈ తరుణంలో గ్రామంలో కనీసం చెత్త ఊడ్చాలాన్నా పంచాయతీ నుంచి శానిటేషన్ సిబ్బందిని తీసుకెళ్లే అధికారం గానీ.. వీధుల్లో బ్లీచింగ్, ఫినాయిల్ చల్లించే అధికారం వీరి చేతుల్లో లేకుండా పోయింది. గ్రామసచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు వారు విధుల్లో చేరిన నాటి నుంచి నేటి వరకూ ఎలాంటి అధికారం లేకుండా పనిచేస్తూ వచ్చారు. విసుగుచెందిన వీరంతా ఇక లాభం లేదనుకొని ఈ ఉద్యోగంలో ఉంటూ మరో కొత్త ఉద్యోగం వస్తే జంప్ అయిపోవాలని నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పటికే చాలా మంది సచివాలయ ఉద్యోగులు విధుల్లోచేరిన తరువాత మంచి ప్యాకేజీతో ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు వస్తే సచివాలయ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోయారు అలా వెళ్లిపోయిన ఉద్యోగాలే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3వేలకు పైగా ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పటికైనా ప్రభుత్వం జీఓనెంబరు 149ని అమలు చేస్తుందా..లేదంటే తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్టుగా ఎలాంటి అధికారం ఇవ్వకుండానే  గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలను విధులు నిర్వహించమంటుందా అనేది తేలాల్సి వుంది..!