ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణలో నైపుణ్య పరీక్షలతో పాటు, క్రెడిట్ బేస్ అసెస్ మెంటు పరీక్షలను మరికొన్ని అంశాలను జోడించి ప్రభుత్వం మెలికపెట్టినట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల 5 సచివాలయాల్లో సుమారు లక్షా 18వేల మంది ఉద్యోగులకు అక్టోబరు 2. 2021నాటికి సర్వీసులు రెగ్యులర్ కావాల్సి వుంది. అయితే గత ఆరు నెలల క్రితం ప్రభుత్వం డిపార్ట్ మెంటల్ టెస్టులు పాసైన వారి జాబితాలనే తొలుత జిల్లాల వారీగా జాబితాలు సేకరిస్తోంది. ఇంకా చాలా మంది ఉద్యోగులు డిపార్ట్ మెంటల్ పరీక్షలు రాయాల్సి వుంది.. మరికొందరు రాసి తప్పిన వారున్నారు. మరోవైపు మరికొంత మంది మహిళా పోలీసులకు సైతం కరోనా నేపథ్యంలో శాఖపరమైన శిక్షణ కూడా పూర్తి కాలేదు. చాలా మందికి శిక్షణలో పెట్టే పరీక్షలు పూర్తి కాలేదు దీనితో వారికి హుటాహుటీన 15 రోజుల పాటు ఆన్ లైన్ శిక్షణతోపాటు మండల కేంద్రాల్లోని కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో క్షేత్ర స్థాయి శిక్షణ కూడా ఇచ్చారు. ఆ తరువాత వీరితో పాటు మిగిలిన శాఖల ఉద్యోగులకు సెప్టెంబరు నెల 17లోపు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే 2019 అక్టోబరు నుంచి 2020 జనవరి వరకూ విడదల వారీగా సచివాలయ విధుల్లోకి చేరిన వారిని దఫ దఫాలుగా రెండేళ్ల ప్రొబిషన్ కాలాన్ని లెక్కగట్టి వారి సర్వీసులు రెగ్యులర్ చేయాల్సి వుంది. కాగా ఇపుడు వీరి ఉద్యోగాలు రెగ్యులర్ పై ప్రభుత్వం నుంచి సరైన క్లారిటీ రాలేదు. దీనితో ఇటీవలే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్రనాయకులు సీఎంను కలిసి తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కూడా వినతి పత్రం అందజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు పంచాయతీ సర్పంచ్ లు, కార్యదర్శిల అధికారాలు వీఆర్వోలకు బదలాయిస్తు ప్రభుత్వం జారీచేసిన జీఓనెంబరు 2 ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్ లో వుంది. దానికి నాలుగు వారాల్లో గడువు వుంది. మరోవైపు డిపార్టమెంటల్ పరీక్షలు పాసైన వారి జాబితాను జిల్లాల వారీగా సిద్దం చేస్తున్న తరుణంలో డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసైన వారంతా తమ సర్వీసులు రెగ్యులర్ అవుతాయనే ధీమాతో ఉండగా.. అవి రాయని వారికి భయం పట్టుకుంది. అందులోనూ సచివాలయ ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేస్తే ప్రభుత్వ ఖజానాపై భారీగా ఆర్ధిక భారం పడుతంది. ఉన్న నిధులన్నీ సంక్షేమ పథకాలకే ప్రభుత్వం వెచ్చిస్తుండటం, రెండు దఫాలు కరోనాకి ప్రభుత్వం అత్యధిక మొత్తంలో నిధులు ఖర్చుచేయడంతో ఇపుడు గ్రామ, వార్డుసచివాలయ ఉద్యోగులకు తమ సర్వీసులు రెగ్యులర్ అవుతాయా లేదా అనే భయం వెంటాడుతోంది. ఇదే సమయంలో జీఓనెంబరు 2 అంశం హైకోర్టులో వాదనలు జరిగినపుడు రాష్ట్రంలో పంచాయతీలు ఉండగా ఎందుకు దానికి సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారనే మాటను వాడింది హైకోర్టు బెంచ్.. ఆపై ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కేసుల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడం, ఇటు కార్యదర్శిలు, వీఆర్వోల ఉద్యోగ సంఘాల మధ్య అధికారానికి(డిడిఓ) సంబంధించిన వాదలను అధికమవడంతో ఆ ప్రభావం సచివాలయ ఉద్యోగులపై పడుతందనే భయంకూడా వీరిని వెంటాడుతోంది. అన్నింటి కంటే ముఖ్యంగా కరోనా నేపథ్యంలో మరో ఏడాది సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ అంశాన్ని పొడిగిస్తారనే ప్రచారం కూడా అధికంగా ప్రాచుర్యంలోకి రావంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో ఇదే అంశానికి సంబంధించి నిత్యం భారీ స్థాయిలో చర్చలు కూడా నడుస్తున్నాయి. కాగా ప్రభుత్వం నుంచి మాత్రం ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ విషయమై సానుకూలంగానే పవనాలు వీస్తుండటం కాస్త వీరికి ఊరట నిస్తున్నా.. లోలోన ఆందోళన మాత్రం వీరిని వీడటం లేదు. ఓపక్క ప్రభుత్వంలోని రాష్ట్ర అధికారులు ఉద్యోగులు డిపార్ట్ మెంటల్ టెస్టులు పాసైతే వారంతా పదోన్నతి( ప్రమోషన్) జాబితాలో రోస్టర్ విధానంలో ముందుంటారని చెబుతున్నారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రాష్ట్రప్రభుత్వం 2015 పీఆర్సీ పేస్కేలుకి లోబడి వారికి నియామకాలు చేపట్టింది. అటు ప్రభుత్వ పరంగా చూసుకున్నా.. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులతోపాటు వీరికి కూడా పీఆర్సీ అమలు చేయాల్సి వస్తుంది. అదే జరిగితే ప్రభుత్వంపై మరింత భారం పడుతుంది. అక్టోబరు 2 నాటికి ప్రభుత్వం అధికారంలో వచ్చి రమారమీ రెండున్నరేళ్లు గడుస్తుంది. అప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకిచ్చిన పీఆర్సీ, 8 డిఏల బాకాయిల చెల్లింపు అమలు చేయాలి. ఇవన్నీ ప్రభుత్వం ముందు వున్న భారీ నగదు పథకాలు..వాటిని అమలుచేస్తూ... సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేస్తే ఆ భారం రెండింతలు అవుతుంది. దీనితో ఉద్యోగుల సర్వీసు విషయంలో బయో మెట్రిక్, శాఖ పరమైన శిక్షణ, ఉద్యోగుల చేతివాటం, వివిధ కేసులు, కోరానా విపత్తు భారం అన్ని అంశాలను ఏకం చేసి ఏదైనా మెలిక పెట్టి మరో ఏడాది కాలయాపన చేస్తుందానే అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా అక్టోబరు నెల నుంచి వచ్చే ఏడాది జనవరి వరకూ నాలుగు విడతలుగా సచివాలయ ఉద్యోగుల సర్వీసు ప్రభుత్వం రెగ్యులర్ చేయాల్సి వుంది.. చూడాలి ప్రభుత్వం ఏదైనా మెలిక పెడుతోందో..ఉన్న మెలికలుల తీసేస్తుందో.. సర్వీసు కాలాన్ని పొడిగిస్తుందో.. డిపార్ట్ మెంటల్ టెస్టులను, వాటితోపాటు క్రెడిట్ బేస్ అసెస్ మెంట్ పరీక్షలను అడ్డుపెడుతుందో.. పీఆర్సీని బూచిగా చూపిస్తుందో.. కోర్టు కేసులను ఉద్యోగుల ముందుంచుతుందో..ఆర్ధిక భారాన్ని నెపంగా తెరమీదికి తెస్తుందో.. అవన్నీ కాదని ఇచ్చిన మాటకి కట్టుబడి 2022 జనవరి నాటికి సచివాలయ ఉద్యోగులందరి సర్వీసులను రెగ్యులర్ చేస్తుందో..తేలాల్సి వుంది..!