ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో నియమించిన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు రెండేళ్లు పూర్తి కావొస్తున్నా అధికార బదలాయింపులు గ్రేడ్-1,2,3,4 పంచాతీ కార్యదర్శిల నుంచి వేరుచేయలేదు. ఒక్క అధికారం, ఒక్క దస్త్రం కూడా లేకుండా.. కాదు కాదు ఇవ్వకుండా 2'సంవత్సరాలపాటు సచివాలయ కార్యదర్శిలతో ప్రభుత్వం గ్రామాల్లో సేవలు చేయించింది. ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శితోపాటు కమిషనర్ కూడా ఇక్కడే తప్పుచేశారు. ప్రభుత్వమే జారీచేసిన జీఓనెంబరు 149 అమలు చేయకుండా తాత్సారం చేయడం వలన ప్రస్తుతం ప్రభుత్వానికి ఏ స్థాయిలో రాష్ట్రంలో నష్టం వచ్చిందో.. ఒక్కసారి గ్రామసచివాలయాల సర్వీసు రిక్వెస్టులు ద్వారా వచ్చిన ఆదాయం.. మీ-సేవా కేంద్రాలు పూర్తిచేసిన సర్వీసు రిక్వెస్టులు ద్వారా వచ్చిన ఆదాయం పరిశీలిస్తే ప్రభుత్వానికే కాదు.. ఈ జీఓని అమలు చేయకుండా ఉండిపోయిన అధికారులకు కళ్లు బైర్లు కమ్ముతాయి. ఇందులో మాయలేదూ మంత్రం లేదు. కేవలం రాష్ట్రప్రభుత్వం గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు ఇవ్వకపోవడం, జీఓ 149అమలు చేయకపోవడం వలన ఇప్పటి వరకూ వారి చేతుల్లో ఎలాంటి అధికారాలు లేకుండా గ్రామాల్లో చెత్త ఎత్తించడం ఇంటిపన్నులు వసూలు చేయడం, కరోనా వేక్సిన్లు వేయించడం వంటి పనులు చేస్తూ ఉత్తుత్తి కార్యదర్శిలుగా యాక్టింగ్ చేస్తూ వస్తున్నారు..
గ్రామ సచివాలయాల ద్వారా సుమారు 745 సర్వీలు అందుబాటులోకి వచ్చినా వాటి ద్వారా ప్రభుత్వానికి కేవలం వారి చేతుల్లో అధికారాలు లేకనే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ఆదాయాన్ని ఆర్జించి పెట్టలేకపోయారు. దీనితో ప్రభుత్వం కోట్ల రూపాయాల్లో ఆదాయం కోల్పోయింది(ఉదాహరణకు ఒక్కో సచివాలయం నుంచి అన్ని సర్వీసులు, ఇంటిపన్నులు కలుపుకొని ఏవరేజ్ న నెలకు ఒక్కో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శి పనిచేసే గ్రామ సచివాలయంలో నెలకు రూ.20వేలు ఆదాయం వస్తుందను కుంటే.. రాష్ట్రవ్యాప్తంగీ 5879 మంది గ్రేడ్-5 కార్యదర్శిలు ఉన్నారు. ఆలెక్కన చూసుకున్నా సుమారుగా రూ.1 కోటి 17లక్షలు ఆదాయం నెలకు కోల్పోయింది ప్రభుత్వం. ఇక ప్రభుత్వం 745 సర్వీసులను గ్రామసచివాలయాల్లో అందిస్తే.. వాటి ద్వారా ఒక్కోగ గ్రామసచివాలయం నుంచి ఎంతెంత ఆదాయం వస్తుందో అధికారులే లెక్కలు గట్టుకోవాల్సివుంది) అలాగని ప్రస్తుతం అధికారాలు, రికార్డులు, కనీసం సానిటేషన్ సిబ్బందిని కూడా ఇవ్వకుండా వారి దగ్గరే అన్ని అధికారాలు రికార్డులు ఉంచుకున్న గ్రేడ్-1, 2,3,4 పంచాయతీ కార్యదర్శిలైనా ఆదాయాన్ని ప్రభుత్వానికి తెచ్చిపెట్టారా అంటే అదీలేదు. పైగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సొమ్ము మొత్తం వారి బంధువుల ఖాతాలకు, చేయని పనులకు బిల్లులు పెట్టి నిధులన్నీ భారీ స్థాయిలో కొందరు తేడా కార్యదర్శిలు దారి మళ్లించుకున్నారు. అలా చేతివాటం ప్రదర్శించిన జిల్లాల్లో తూర్పోగోదావరి మొదటి స్థానంలో ఉండగా, విశాఖజిల్లా రెండవ స్థానం, పశ్చిమ గోదావరి మూడవ స్థానం, అనంతపురం, కడప, కర్నూలు ఇలా అన్ని జిల్లాల్లోని తేడా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలు శక్తి వంచన లేకుండా వారిజేబులు నింపుకోవడానికి శక్తివంచన లేకుండా కష్టపడ్డారు..నేటికీ పడుతూ ప్రభుత్వ ఖజానికి పేద్ద రంధ్రం చేశారు. ఈ విషయంలోనే కొంత మంది సస్పెండ్ లు అయ్యి ఇంటి దగ్గరే కూర్చొని సగం జీతాలు తీసుకుంటూ ఎలాంటి చర్యలు ప్రభుత్వం నుంచి తీసుకోకుండానే దర్జాగా వున్నారు.
ఇక్కడ మీకు ఒక్క అనుమానం రావాలి.. గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ద్వారా ఆదాయం రాకపోతే ప్రభుత్వానికి ఏవిధంగా నష్టం వాటిల్లిందీ అని. అక్కడ చిన్న అవకాశాన్నే రాష్ట్రవ్యాప్తంగా మీసే-వ కేంద్రాలు జాక్ పాట్ లా వినియోగించుకున్నాయి. అదెలాగో చూడండి. తూర్పుగోదావరి జిల్లాలో ఓ మండలంలో మీసేవా కేంద్రాలు 2019 నుంచి ఇప్పటి వరకూ ఒక్క రెవిన్యూశాఖలోని 68 రకాల సర్వీసుల నుంచి అత్యధికంగా 60వేలు దరఖాస్తులకు ద్రువీకరణ పత్రాలు అందిస్తే.. అదే మండంలోని 14 గ్రామ పంచాయతీల్లో, 16 గ్రామ సచివాలయాల ద్వారా మొత్తం పరిక్షరించిన రెవిన్యూ శాఖ ద్వారా కేవలం 18వేల సర్వీసు రిక్వెస్టులకు ద్రువకరణలు పూర్తిచేయగలిగారు. అంటే ఒక్క మండలంలోనే మూడింతలకి పైగా ఆదాయం సచివాలయాలున్నా మీ-సేవా కేంద్రాలు తన్నుకు పోయాయి(ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలోని ఒక్క మండలాన్నే ఎందుకు ప్రస్తావించామంటే.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15 వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రభుత్వం ఎంత మేరకు ఆదాయం ఇప్పటి వరకూ కోల్పోయిందో తెలిస్తే ఒకేసారి ప్రజులు, ఉద్యోగుల ద్రుష్టిలో ప్రభుత్వం పరువు పోతుందని కేవలం జిల్లాలోని ఒక్క మండాలంలోని లెక్కలు మాత్రమే బయటపెట్టాం.. ప్రభుత్వం అన్ని జిల్లా సమాచారం జిల్లా కలెక్టర్ల ద్వారా తెప్పించుకుంటే తప్పు ఏస్థాయిలో జరిగి..అంతకంటే నష్టం మరింత స్థాయిలో జరిగిందో అర్ధం కావాలని).
వాస్తవానికి ఆ ఆదాయం మొత్తం గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వానికి రావాలి..ఇక్కడే అన్ని రకాల సేవలు అందిస్తున్న విషయం ప్రజలకు మరింత చేరువ కావాలి. ఇలా ఎందుకు జరగలేదనే విషయం పరిశీలిస్తే.. ఎలాంటి అధికారాలు లేని తాము ఏ మొహం పెట్టుకొని ప్రజలను చైతన్య పరుస్తామని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలంతా గొల్లుమంటున్నారు. కనీసం కాలువల దగ్గర బ్లీచింగ్ చల్లించాలన్నా.. ఫినాయిల్ వేయాలన్నా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శి దగ్గరకు వెళ్లి సాధారణ ప్రజలు మాదిరిగా చేతులు కట్టుకొని అడుక్కోవాల్సి వస్తుందని.. అది తాము వెళ్లిన సమయానికి అక్కడ కార్యదర్శి వుంటే(ఉద్యోగం ఇక్కడైనా డెప్యుటేషన్లు, ఇన్చార్జిల బాధ్యతలు వీరికే అప్పగించడంతో ఏ ఒక్క పంచాయతీలోనూ వీరు సక్రమంగా సమాయానికి దొరకడం లేదు). ఒక్క మండలంలోనే సచివాలయాలకు రావాల్సిన సర్వీసు రిక్వెస్టులు మీసేవాలు తన్నుకుపోతుంటే..జిల్లా వ్యాప్తంగా ఎన్ని లక్షల సర్వీసులు తన్నుకుపోయారో.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కోట్ల సర్వీసులు తన్నుకుపోయారో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య అధికారులే చెప్పాల్సి వుంటుంది. అదీ కేవలం రెవిన్యూ ద్వారా వచ్చే సర్వీసులే.. మరి ఇతర శాఖల సర్వీసులు ఇక్కడ లెక్కల్లోకి రాలేదు. అదంతా నాణానికి ఒకవైపే.
ఇపుడు నాణానికి రెండో వైపు చూద్దాం.. అధికారాలన్నీ గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల దగ్గరే వుంచేసిన రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, జిల్లాల్లో జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు వారికే మేజర్ పంచాయతీల్లో ఖాళీ అయిన స్థానాలను ఇన్చార్జి బాధ్యతలు చేయాలంటూ వారికే డిప్యుటేషన్లు కూడా పనిగట్టుకొని వేస్తున్నారు. రెగ్యులర్ పంచాయతీల్లోనే పనిచేయకుండా ఆదాయం కోల్పోయేలా చేసిన వీరికే ప్రభుత్వం అదనపు పనులు అప్పగించి ఇన్చార్జి పంచాయతీల్లో కూడా ఆదాయారం రాకుండా చేయడంలో అధికారులే ముఖ్యంగా కనపిస్తున్నారు. ఇన్చార్జి బాధ్యతలపై గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలు పంచాయతీల్లో ఇన్చార్జిల పేరుతో తిరుగుతుంటే గ్రామాల్లో వసూలు కావాల్సిన పన్నలున్నీ భారీగా పేరుకు పోతున్నాయి. గ్రేడ్-5 కార్యదర్శిలుగా వున్నవారు అధికారాలు లేకపోయినప్పటికీ వారి పరిధిలో వారు కాస్తో కూస్తో వసూలు చేస్తున్నా.. ఆ సేవ మొత్తం అధికారాలు, రికార్డులు వారి వద్దే ఉంచుకొని, పన్నులన్నీ కట్టించుకుని కాగితాలపై లెక్కలు చూపిస్తూ గ్రేడ్-5 కార్యదర్శిలు చేసిన పనంతా తామే చేసినట్టుగా అధికారుల ముందు తెగ కష్టపడిపోయినట్టు చూపిస్తున్నారు వీరంతా. దీంతో విషయాన్ని పసిగట్టిన చాలా మంది సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు అధికారం లేకుండా ప్రజల వద్దకి వెళ్లినా.. రికార్డులు లేకుండా ఇంటి పన్నుల వసూలుకి వెళ్లినా జనం కూడా వీరిపై తిరగబడటంతో వీరు సచివాలయాల్లో పారిశుధ్యం, ఇతర సేవలను మాత్రమే చూసుకుంటూ కాలం గడిపేస్తూ వస్తున్నారు.
వారికి అధికారాలు లేవని.. అక్కడ సర్వీసు రిక్వెస్టులు పెడితే పనులు జరవగవని తెలుసున్న ప్రజలు కూడా తమ అత్యవసర పనులన్నీ చేయించుకోవడానికి మీ-సేవ కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారు. ఇక ఆఖరిగా ప్రభుత్వం ఇపుడు ఇంటిపన్నులు సవరణ చేసి కొత్త పన్నులు వేస్తున్న తరుణంలో కూడా గ్రేడ్-5 కార్యదర్శిలకు రికార్డులు ఇవ్వకుండా పంచాయతీ గ్రేడ్-1 కార్యదర్శిల దగ్గరే రికార్డులన్నీ ఉంచుకున్నారు. దీనితో కొత్తగా వేయాల్సిన పన్నులు కూడా పడకేశాయి. ఇదే పరిస్థికి కొనసాగితే గ్రామ సచివాలయాల్లో ప్రస్తుతం వున్న 745 సర్వీసుల కంటే అధికంగా సేవలు పెట్టినా ప్రజల వద్దకు అవి చేరే పరిస్థితి కనిపించడం లేదు. పాత బకాయిలు వసూలయ్యే అవకాశం అంతకంటే లేదు.. అలాగని గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు ఇవ్వకపోతే మేజర్ పంచాయతీల్లో మూడు సచివాలయాలను కట్టి అక్కడ సిబ్బందిని ఉంచినా కరెంటు, ఇంటర్నెట్ బిల్లు, కార్యాలయ మెయింటినెన్సు బిల్లులు ప్రభుత్వానికి భారం తప్పా మరొక ఆదాయ వనరు అస్సలు కనిపించలేదు. అయితే ఈ విషయం మొత్తం పంచాయతీరాజ్ అధికారులకు తెలిసినా ఏమీ పట్టనట్టు వ్యవరిస్తుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 40శాతానికి పైగా కొత్త సచివాలయ భవనాలు ప్రారంభం అయ్యాయి. అదే రాష్ట్రవ్యాప్తంగా కొత్త సచివాలయ భవనాలు ప్రారంభం అయితే ప్రభుత్వానికి ఆర్దిక భారం మరింతగా పెరిగిపోతుంది. అపుడు ప్రభుత్వం సచివాలయాల వారీగా రికార్డులు, అధికారాలు, ఆదాయ వ్యవయాల పెత్తనాలు గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓ నెంబరు 149 ద్వారా బదలాయించకపోతే రాష్ట్రప్రభుత్వం భారీ మొత్తంలో ఆదాయం కోల్పోవలసి వస్తుంది. అంతేకాదు సచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శిలకు కూర్చోబెట్టి మాత్రమే జీతాలు ఇచ్చే పరిస్థితే కనిపిస్తుంది.
మరోవైపు తమకు అధికారాలు ఇవ్వనంత సేపు తాము ఎలా ప్రజలకుసేవలు చేస్తామని సచివాలయ నూతన కార్యదర్శిలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈ శాఖలోని అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తూ.. ప్రభుత్వానికి చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.esnlive.net ద్వారా కధనాలు అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల చేతిల్లోనే ఉంచేసిన అధికారాలు జీఓనెంబరు 149 ద్వారా గ్రేడ్-5 కార్యదర్శిలకు బదలాయించకపోవడం వలన వచ్చే వచ్చిన ఆర్దిక నష్టాలను రాష్ట్రవ్యాప్తంగా ఈఎన్ఎస్ కార్యాలయానికి ఫోన్లు చేసి మరీ తెలియజేస్తున్నారు చాలా మంది అధికారులు. రాబోయే నష్టాలను వివరిస్తే..రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవా కేంద్రాలు ఏ స్థాయిలో ఆదాయాన్ని తన్నుకుపోతున్నాయో.. గ్రామ సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా వాటికి ఆదాయం ఎందుకు రావడం లేదో అనే విషయంపై పరిశోధనాత్మక వార్తలు అందిస్తే పంచాయతీరాజ్ శాఖ ముఖ్య అధికారులు ఆలోచించే అవకాశం వుంటుందనే విషయాన్ని వాస్తవ కధనాల రూపంతో వెలుగుతోకి తీసుకు వస్తుంది ఈఎన్ఎస్. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని జీఓనెంబరు 149ని అమలు చేస్తూ గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు బదలాయించకపోతే వారు ఉత్సవ విగ్రహాల్లానే మిగిలిపోయి.. సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందించే 745 సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.
పైగా ఇప్పటికే మండల స్థాయి నుంచి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది వరకూ వినపతి పత్రాలు ఇచ్చినా తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో తమకెందుకు వచ్చిందిలే అన్నట్టుగా ఉండిపోవాలని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు డిసైడ్ అయినట్టు వార్తలొస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామ సచివాలయాలకు వివిధ సర్వీసుల ద్వారా రావాల్సిన ఆదాయం కోల్పోగా.. గ్రామ పంచాయతీ పరిధిలో సవరించిన ఇంటి పన్నులు వేయడంలోనూ.. వాటి ద్వారా ఆదాయం సమకూర్చడంలోనూ గ్రేడ్-5 కార్యదర్శిల నుంచి ప్రభుత్వానికి సహకారం కనిపించే అవకాశం దరిదాపుల్లో లేదు. చూడాలి పంచాయతీరాజ్ శాఖ పంతానికి పోయి ఎప్పటికీ జీఓనెంబరు 149 అమలు చేయకుండా.. గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు అధికార బదలాయింపులు చేయకపోతే..ఇప్పటికే కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని మరీ సచివాలయాలకు రావాల్సిన ఆదాయం మొత్తం కొట్టేస్తున్న మీ-సేవ ఆదాయాలను ప్రభుత్వం తహశీల్దార్ల డాష్ బోర్డులపై చూసుకోవడం తప్పా మరేమీ చేయలేని పరిస్థితులు మాత్రమే మిగులుతాయి. మరోవైపు ఉన్న పంచాయతీ గ్రేడ్-1 కార్యదర్శి స్థానం సరిపోదన్నట్టు వున్నవారికే నాలుగైదు పంచాయతీలు కట్టబెట్టడం ద్వారా గ్రామస్థాయిలో రావాల్సిన ఆదాయం మరెంత బకాయిలుగా పేరుకుపోతుందో అధికారులు గమనించాల్సి వుంది. ఏది ఏమైనా ఒక్క జీఓ అమలు చేయడం వలన ప్రభుత్వానికి ఆదాయంతోపాటు, గ్రామ సచివాలయాలు పెట్టిన లక్ష్యం నెరవేరుతుందని తెలిసినా దానిని అమలు చేయని ఏపీ ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శిలను ఏమనుకోవాలో అర్ధం కావడం లేదని సచివాలయ ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు..!