ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లోని సుమారు 14న్నరవేల మంది గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ రోల్ మోడల్ గా మారిపోయారు. సచివాలయాలు ఏర్పాటైన దగ్గర నుంచి రాష్ట్రంలో ఒక్క పోలీసు అధికారి కూడా ప్రభుత్వం ఇచ్చిన జీఓలు 129, 59లను శాఖా పరంగా క్రింది స్థాయి ఎస్ఐలు, కానిస్టేబుళ్లు తెలియజేసి..వారిని పోలీసులుగా గుర్తించే ఏర్పాటు చేయలేదు. మహిళా పోలీసులు సాధారణ పోలీసులనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తించాల్సిందేననే ఆదేశాలు జారీచేసిన దాఖలాలేవు. కానీ తూర్పుగోదావరి జిల్లాకి కొత్తగా వచ్చిన ఎస్పీ వస్తూ వస్తూనే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ పోలీసులను బాహ్యప్రపంచానికి నిజమైన పోలీసులుగా ప్రభుత్వం గుర్తించిన విషయాన్ని పోలీసులకు నొక్కిచెప్పి.. సచివాలయ మహిళా పోలీసులను హోంశాఖ సాదారణ పోలీసులుగా గుర్తించాల్సిందేనని మొట్టమొదటి సారిగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆ విషయాన్ని జిల్లా వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్సు పెట్టి అన్ని డిఎస్పీలు, సిఐలు, స్టేషన్ల ఎస్ఐలకు, కానిస్టేబుళ్లకు మహిళా పోలీసుల సమక్షంలోనే చెప్పి ఖచ్చితమైన ఆదేశాలు జారీచేశారు. దీనితో ఆవిషయం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా పోలీసుల సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యింది.
రాష్ట్రంలో డీజీపి తరువాత ఆ స్థాయిలో మహిళా పోలీసులను గుర్తించినది తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ మాత్రమే నంటూ వారంతా ప్రశంసల జల్లు కురిస్తున్నారు. అంతేకాకుండా దిశ ఎస్ఓఎస్ యాప్ రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రోత్సహిస్తున్న తీరును కూడా జిల్లా మహిళా పోలీసులంతా తమతో ఎస్పీ ఒక కుటుంబ పెద్దగా మాట్లాడితన తీరును ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకూ చాలా చోట్ల హోంగార్డు నుంచి కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, ఎస్ఐలు తమను మీరంతా నిజమైన పోలీసులా, ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించినంత మాత్రాన మేము మిమ్మల్ని మాతో సమానంగా పోలీసులుగా గుర్తించలేమని మాట్లాడేవారని.. అలాంటి మాటలకు ఒకేఒక్క వీడియోకాన్ఫరెన్సు ద్వారా అడ్డుకట్ట వేయడంతోపాటు.. ఆ విధానాన్ని మార్చుకోవాలని తమ ముందే పోలీసులకు ఎస్పీ వివరించన తీరు తమలో ఎంతో ఆత్మస్తైర్యాన్ని నింపిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పైగా గ్రామాల్లో మహిళా పోలీసులున్నారనే భరోసా స్టేషన్ ఎస్ఐలే ప్రజలకు అవగాహన కల్పించాలని, వీరంతా సాధారణ పోలీసులేననే విషయాన్ని జీఓనెంబరు 59తో ప్రభుత్వమే వారికి గుర్తింపు నిచ్చిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం కూడా పోలీసుశాఖలో చర్చనీయాంశమవుతోంది.
పైగా అవినీకి పాల్పడిన పోలీసులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం, వీడియో కాన్ఫరెన్సు కి ఒక్కరోజు ముందు తూర్పుగోదావరి జిల్లాలో నలుగు ఏఎస్ఐలను సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా వీరంతా ప్రస్తావించుకున్నారు. పైగా మరో ఏఎస్ఐని విధుల్లో నుంచి తొలగించిన తీరు తమ కర్తవ్యాన్ని గుర్తుచేసిందని, రెండేళ్లలో సరైన జిల్లా పోలీసు అధికారిని చూశామని.. నిజమైన పోలీసు అధికారి అంటే కింది స్థాయి ఉద్యోగులను గౌరవిస్తేనే మంచి ఫలితాలు వస్తాయని తెలుసుకున్నామని మహిళా పోలీసులంతా తమ ఆనందాన్ని ఎస్పీతో మాట్లాడిన తీరును తమ సహచర మహిళా పోలీసులతో పంచుకోవడం విశేషం. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా రావీంధ్రబాబు రావడంతోనే పోలీసు శాఖ ప్రక్షాలణ చేపట్టడం ఇటు జిల్లాపోలీసులందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన మరుసటి రోజే జిల్లాలోని ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించడం కూడా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీయడం విశేషం.
పైగా నవంబరు2 నాటికి రెండేళ్లు పూర్తిచేసుకోబుతన్న తూర్పుగోదావరి జిల్లా మహిళా పోలీసులకు ప్రస్తుత ఎస్పీ వచ్చిన తరువాత వారికి వచ్చిన గౌరవం, పోలీసులుగా తమను గుర్తించాలని పదే పదే పోలీసులను హెచ్చరించిన తీరు తమకు మార్గదర్శకమని.. మహిళా పోలీసులంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎస్పీ జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్ల ఎస్ఐలతోపాటు కానిస్టేబుళ్లును హెచ్చరించిన విషయాన్ని జిల్లా పోలీసులు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకుంటారో.. లేదంటే గతంలో వ్యవహరించినట్టుగానే.. మీరు మాలా నిజమైన పోలీసులు కాదంటూ వెటకారంగా మాట్లాడుతూ, మహిళా పోలీసులకు గాలి తీసేసి వారిలో ఆత్మస్తైర్యాన్ని చెదరగొడతారో.. ఎస్పీ ఆదేశించిన హెచ్చరికను శిరసా వహించి ఈ విధంగా మాట్లాడినట్టు ఇక ముందు మాట్లాడకుండా ఉంటారో.. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలు ఎంత వరకూ పాటిస్తారనేది వేయి డాలర్ల ప్రశ్నగా మారింది. కానీ వస్తూ వస్తూనే ఎస్పీ రవీంధ్రనాధ్ తీసుకున్న చర్యలకు పోలీసు శాఖలో తేడా అధికారులకు ముచ్చెమటులు పడుతున్నా ప్రజల నుంచి మాత్రం మంచి స్పందన వస్తోంది..!