ఈఎన్ఎస్ వార్తకు స్పందన.. సచివాలయ ఉద్యోగుల సిబిఏసీ పరీక్ష రద్దు..


Ens Balu
11
తాడేపల్లి
2021-08-03 02:11:18

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. అక్టోబరు 2 నాటికి ఉద్యోగులందరికీ రెండేళ్ల ప్రొభేషన్ పూర్తయ్యే సమయానికి పెట్టాలనుకున్న క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీక్షను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ప్రకటించారు. ఈ పరీక్ష వలన ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను, సాంకేతిక కారణాలను, అవసరమైతే కోర్టుకు వెళ్లాలనుకున్న విషయాన్ని కూడా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మరియు అధికారికి మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net ద్వారా ప్రత్యేక కధనాలను ప్రచురించింది. దీనితో రెండేళ్లపాటు సర్వీసులు అందించిన సచివాలయ ఉద్యోగులకు సిబిఏసీ పరీక్షను రద్దు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారని, ఆయన ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం వెల్లడించారు. సీఎం సర్వీసు రెగ్యులైజేషన్ కి సంబంధించిన ఈ పరీక్షలో మినహాయింపు ఇవ్వడం పట్ల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని అన్ని రకాల ముఖ్యవిషయాలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహిస్తూ.. తమకు సహాయ సహకారాలు అందిస్తున్న ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ కార్యాలయానికి సచివాలయ ఉద్యోగులు ఫోన్లు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ విషయంలో ఉద్యోగులంతా సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డికి ధన్యవాదములు తెలియజేశారు.