ఏపీసీడ్స్ కి అవార్డు పట్ల సీఎం హర్షం..
Ens Balu
2
Tadepalle
2021-08-05 16:12:31
మున్ముందు రైతుల కోసం మరింతగా సేవలందించేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్ధ (ఏపీ సీడ్స్) అధికారులకు సూచించారు. గురువారం సంస్థకు జాతీయ అవార్డు రావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి అవార్డు వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీ సీడ్స్ వీసీ అండ్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్ బాబులు తెలియజేశారు. గవర్నెన్స్ నౌ అవార్డుకు రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక ప్రభుత్వ రంగ సంస్ధగా ఏపీ సీడ్స్ ప్రత్యేక గుర్తింపు సాధించడాన్ని సీఎం అభినందించారు. రైతులకు గ్రామస్ధాయిలో నిరాటంకంగా, సకాలంలో విత్తనాలు పంపిణీ చేసి, ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకోవడంపై ఏపీ సీడ్స్ ఎండీని, సిబ్బందిని ప్రశంసించారు.