నందిగామలో డా.జాలాది జయంతోత్సవం..


Ens Balu
0
Nandigama
2021-08-06 03:28:54

ప్రముఖ కవి, సినీ గేయ రచయిత, కళాప్రపూర్ణ డా.జాలాది రాజారావు 90వ జయంతో త్సవాన్ని నందిగామలో నిర్వహిస్తున్నట్టు జాలాది కళాపీఠం వ్యవస్థాపకులు డా.జాలాది విజయ తెలియజేశారు. ఈమేరకు శుక్రవారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 9వ తేదిన స్నేహ క్లబ్ ఆధ్వర్యంలో నందిగామలో శ్రీవెంకటేశ్వరా ఫంక్షన్ హాలులో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు హాజరవుతున్నారని చెప్పారు. వీరితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కవులు, కళాకారులు అత్యధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని నిర్వాహకులు డా.జాలాది విజయ తెలియజేశారు. జాలాది జయంతిని ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలోని కవులు, కళాకారులు ఉన్నచోట చేయాలనే సంకల్పంతో ఈ జయంతిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సదర్భంగా ఆమె కోరారు.