10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల..


Ens Balu
3
తాడేపల్లి
2021-08-06 16:44:15

రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షాఫలితాల్లో మార్చి 2020కు సంబంధించి 6,37,354 మంది, జూన్ 2021కు సంబంధించి 6,26,981 మంది ఉత్తీర్ణత సాధించారని రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ అన్నారు.  విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బి.రాజశేఖర్ తో కలిసి 10వ తరగతి పరీక్షా ఫలితాలను మంత్రి విడుదల చేశారు. ఈసందర్భంగా రాష్ట్రమంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ జూన్ 7 నుండి 16వ తేదీ వరకూ 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించిందని అయితే విద్యార్ధుల ఆరోగ్యభద్రత, ఉపాధ్యాయుల భద్రత, తల్లిదండ్రుల ఆందోళనను పరిగణనలోనికి తీసుకుని మే 28వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి నిర్ణయం మేరకు 10వ తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిందని మంత్రి అన్నారు. పరీక్ష ఫీజుకట్టిన ప్రతీ ఒక్కరినీ పాస్ చేస్తూ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి గ్రేడింగ్ ఇచ్చామని మంత్రి అన్నారు. విద్యార్ధుల భవిష్యత్తుకు 10వ తరగతి పరీక్షల్లో మార్కులు ఎ ంతోకీలకమని మంత్రి అన్నారు. ఉద్యోగాల నియామకంలో కాలేజీ విద్యలో, కేంద్రప్రభుత్వం నిర్వహించే ఉద్యోగాలు ముఖ్యంగా మిలటరీ రిక్రూట్‌మెంట్‌లో 10వ తరగతిలోని మార్కుల ఆధారంగానే ఉద్యోగనియామకాలు చేపడతారని మంత్రి అన్నారు. 10వ తరగతి పరీక్షల ప్రాముఖ్యత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందరినీ పరీక్ష పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని దీనిలోభాగంగా సంవత్సరకాలం పాటు విద్యార్ధుల ప్రతిభను ఆధారంగా తీసుకుని గ్రేడింగ్ ఇచ్చామని మంత్రి అన్నారు.

రద్దు అయిన 10వ తరగతి పరీక్షల విధివిధానాలను పరిశీలించి విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిందని అన్నారు. ఈహైపవర్ కమిటి ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించిన అనంతరం 10వ తరగతి పరీక్షాఫలితాలను విడుదల చేశామని మంత్రి అన్నారు. విద్యార్ధులెవరికీ నష్టంలేకుండా ఫలితాలను ప్రకటించామని మంత్రి అన్నారు. అందరికీ ఉపయోగపడేలా 2019-20, 2020-21 సంవత్సరానికి ఎ వ్వరూ నష్టపోకుండా 10వ తరగతిలో గ్రేడింగ్ ఇవ్వాలని హైపవర్ కమిటి నివేదిక ఇచ్చిందని మంత్రి అన్నారు. ఈనివేదికను యధాతథంగా ఆమోదించిన ప్రభుత్వం 10వ తరగతి ఫలితాలను ప్రకటించిందని మంత్రి అన్నారు.
2020-21వ సంవత్సరంలో సంవత్సర కాలంపాటు వారి ప్రతిభను ఆధారంగా తీసుకుని వ్రాతపరీక్షల్లో అత్యధిక వెయిటేజ్‌ను ఇస్తూ 70 శాతం, 30 శాతం వెయిటేజ్ మార్కులతో గ్రేడింగ్ ఇచ్చామని మంత్రి అన్నారు. 2020-21 సంవత్సరంలో 6 లక్షల 26 వేల 981 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారని వారిలో 3 లక్షల 22 వేల 391 మంది బాలురు, 3 లక్షల 04 వేల 036 మంది బాలికలు ఉన్నారని మంత్రి అన్నారు. 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి 6 లక్షల 37 వేల 354 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారని వారిలో 3 లక్షల 26 వేల 753 మంది బాలురు 3 లక్షల 10 వేల 601 మంది బాలికలు ఉన్నారని మంత్రి అన్నారు.

10వతరగతిలో సబ్జెక్టుల వారీగా ఫెర్ ఫార్మెన్స్ స్టేట్‌మెంట్లు (గ్రేడ్ షీట్లు) కొరకు విద్యార్ధులు ఠషష://స|షషె.శి|.శూ.గుు.n వెబ్‌సైట్ నుంచి పొందవచ్చునని మంత్రి అన్నారు. విద్యార్ధులు వారి రోల్ నెంబరును ఎ ంటర్ చేయడం ద్వారా గ్రేడ్ మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని మంత్రి అన్నారు. ఈవెబ్ సైట్‌కు సంబంధించి పాస్‌వర్డు కఊ – 2020 అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ , కమిషనరు చినవీరభద్రుడు, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎ గ్జామినేషన్స్ సుబ్బారెడ్డి, యస్ఇఇఆర్ టి డైరెక్టరు ప్రతాపరెడ్డి, ప్రకాశం జిల్లా డిఇఓ సుబ్బారావు, పెనమలూరు హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు దుర్గాభవాని, పై#్రవేట్ విద్యాసంస్ధల ప్రతినిధులు వై. విజయకుమార్ , పి. వెంకటకుమార్ , తదితరులు పాల్గొన్నారు.