అట్టడగు వర్గాల అభివ్రుద్ధికి విశేష క్రుషి..


Ens Balu
1
Tadepalle
2021-08-12 14:13:58

రెక్కాడితేగానీ డొక్కాడని అట్టడుగువర్గాల వారికి ఆర్ధికప్రయోజనాలను కల్పించి సమాజంలో సముచితం స్ధానం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్తు, అటవీ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (లిడ్‌క్యాప్) ఛైర్మన్‌గా నియమితులైన కాకుమాను రాజశేఖర్ గురువారం తాడేపల్లిలోని లిడ్‌క్యాప్ ప్రధాన కార్యాలయంలో పదవీబాధ్యతలను స్వీకరించారు. కార్యక్రమానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద బలహీన అట్టడుగు వర్గాల వారిని గత ప్రభుత్వం విస్మరించడం జరిగిందన్నారు. ముఖ్యంగా యస్‌సి యస్‌టి బిసి వర్గాల వారు ఆర్ధిక ఎ దుగుదలకు దూరం అయ్యారన్నారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో బలహీనవర్గాల వారుపడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయారన్నారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అప్పుడు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తూ పేదల సంక్షేమానికి కట్టుబడ్డారన్నారు. దేశంలో ఎ క్కడాలేనివిధంగా పేదప్రజలకు 38 లక్షల ఇళ్లస్ధలాలను మంజూరు చేయడంతోపాటు గృహనిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో యస్‌సి యస్‌టి వర్గాల వారికి అధికప్రాధాన్యతనిచ్చి వారు ఆర్ధికంగా నిలదొక్కుకోవడం ద్వారా సమాజంలో సముచితస్ధానం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్ధేశ్యమన్నారు. 

లిడ్‌క్యాప్ సంస్ధ ద్వారా అట్టడుగువర్గాలవారికి ఆర్ధికప్రయోజనం చేకూరే విధంగా కృషి చేయాలని ఆయన నూతన ఛైర్మన్‌కు సూచిస్తూ అభినందనలు తెలియజేశారు. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ పేదబలహీనవర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డే నన్నారు. ఇటీవల కార్పోరేషన్ ఛైర్మన్‌లుగా అధికశాతంమంది బలహీనవర్గాలవారిని ఆయన ఎ ంపిక చేయడమే ఇందుకు నిదర్శనం అన్నారు. నిర్జీవమైన లిడ్‌క్యాప్ సంస్ధకు జవసత్వాలను తీసుకొచ్చి ముందుకు నడపడం ద్వారా సంస్ధపై ఆధారపడిన బలహీనవర్గాల వారికి ప్రయోజనాలు కల్పించేందుకు ఇప్పటికే తాను ప్రణాళికలను రూపొందించుకోవడం జరిగిందన్నారు. వాటిని అమలు పరచడం ద్వారా ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని సఫలీకృతం చేసి ఆయన మన్ననలను పొందేందుకు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలోలెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (లిడ్‌క్యాప్) మేనేజింగ్ డైరెక్టరు కె. హర్షవర్ధన్, జనరల్ మేనేజరు యం. పుష్పవతి, అసిస్టెంట్ మేనేజరు యన్. అధికారి, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.