హెచ్ఆర్ఎంఎస్ లో సాంకేతిక లోపం..
Ens Balu
5
Tadepalle
2021-08-18 03:04:08
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామసచివాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు అత్యవసరంగా సెలువులు పెట్టాలంటే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన హెచ్ఆర్ఎంఎస్(హ్యూమన్ రీసోర్స్ మేన్ పవర్ సిస్టమ్)లో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. ఇటు పంచాయతీ కార్యదర్శిలకు గానీ, అటు పోలీస్ స్టేషన్ల హౌస్ ఆఫీసర్లకు గానీ లాగిన్ ఇవ్వకపోవడంతో వీరికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సెలవుచీటి రాసి సచివాలయంలోనూ, అటు పోలీస్ స్టేషన్లలోనూ ఇచ్చినా ఫలితం ఉండటం లేదు. బయోమెట్రిక్ అటెండెన్సు విధానం కూడా హెచ్ఆర్ఎంఎస్ కు అనుసంధానం అయి ఉండటంతో మహిళా పోలీసులు సెలువులు పెట్టిన సమయంలో బయోమెట్రిక్ సిస్టమ్ లో విధులకు హాజరు కానట్టు చూపిస్తుంది. దీనితో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ సచివాలయాల్లో సుమారు 15వేల మంది మహిళా పోలీసులు సాధారణ సెలవులు పెట్టుకోవడానికి సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఎస్ఐలకు తెలియజేసినా.. ఇంకా హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లు తమకు కూడా ఇవ్వలేదని ఎస్ఐ లు చెబుతున్నారు. దీనితో వీరి సెలవులు ఆన్ లైన్ లో నమోదు కావడం లేదు. తమకు అత్యవసర సమయంలో సెలవులు తీసుకునేందుకు హెచ్ఆర్ఎంస్ లాగిన్ విధానం అందుబాటులోకి తీసుకురావాలని మహిళా పోలీసులు వేడుకుంటున్నారు. అయితే గ్రామసచివాలయశాఖలోని సుమారు 19 శాఖలకు చెందిన సిబ్బందికి చెందిన ప్రభుత్వ శాఖల విధులు, ఆన్ లైన్ సిస్టమ్ అంతా నవీకరణ జరుగుతుందోని సచివాలయ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి ఒకరు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net కి తెలియజేశారు. త్వరలోనే ఈ సాంకేతిక సమస్య తీరనుందని ఆయన స్పష్టం చేశారు..ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించామని ఆయన వివరించారు. ఈ విషయం అన్ని జిల్లాల ఎస్పీ కార్యాలయాల నుంచి వస్తున్న సచివాలయ మహిళా పోలీసులు ఇబ్బందులను ద్రుష్టిలో పెట్టుకొని ప్రభుత్వం త్వరితగతిన సాంకేతిక సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. మహిళా పోలీసులు ఆందోలన పడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు.