ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూనియర్ కాలేజీల ఫీజులు ఖరారు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న కాలేజీలకు..ఎంపీసీ, బైపీసీలకు రూ.15000, ఇతర గ్రూపులకు రూ.12000 విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు చేయాలి. అదేవిధంగా మున్సిపాలిటీల పరిధిలో..ఎంపీసీ, బైపీసీలకు రూ.17,500, ఇతర గ్రూపులకు రూ.15000 చెల్లించాలి. ఇక కార్పొరేషన్ల పరిధిలో.. కాలేజీలు ఎంపీసీ, బైపీసీలకు రూ.20,000, ఇతర గ్రూపులకు రూ.18000 మాత్రమే వసూలు చేయాలని పేర్కొంది. అంతకు మించి అధికంగా వసూలు చేసే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కరోనా తరువాత ఫీజులు ఈ విధంగా ప్రకటించడం పట్ల ప్రజల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది..