మహిళాపోలీసుల సర్వీసు రెగ్యులేషన్ పై సమీక్ష..


Ens Balu
31
Tadepalle
2021-08-25 15:44:48

రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 15వేల 4  గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 14న్నర వేల మహిళా పోలీసులకు సంబంధించిన ప్రొబేషన్ డిక్లరేషన్ లో ప్రభుత్వం సూచించిన విధంగా చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోనున్నామని రాష్ట్ర పోలీస్ ట్రైనింగ్ విభాగం అదనపు డిజీపీ ఎన్.సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం డీజీపీ కార్యాలయం నుంచి డిఐజీలు నాగేంద్రకుమార్, ఎస్వీరాజశేఖర్ బాబు, రాజకుమారి లతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రస్తుతం ఎలాంటి డిపార్ట్ మెంటల్ పరీక్షలు లేని శాఖలుగా గుర్తించిన8 ప్రభుత్వ శాఖల్లో  మహిళా పోలీసులు కూడా ఉండటంతో వీరికి ఏ విధంగా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి, వారికి ఏ తరహా ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలి, ఏ తరహా శిక్షణలు ఇవ్వాలనే విషయంపై పూర్తిస్థాయిలో జిల్లాల ఎస్పీలతో చర్చించారు. అంతేకాకుండా మహిళా పోలీసులకు ఖాకీ డ్రెస్సు కేటాయింపులు, వారి యొక్క నూతన జాబ్ చార్టు అమలు, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీఓలను ప్రస్తావిస్తూ ఈ వీడియో కాన్ఫరెన్సులో కీలక మైన అంశాలను చర్చించారు. కాగా మహిళా పోలీసుల సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తూ.. సర్వీసులను రెగ్యులర్ చేయడానికి చేయడానికి ఒక ప్రత్యేక వ్రాత పరీక్ష నిర్వహించేలా సూచనలు చేసినట్టు సమాచారం అందుతుంది. అయితే అది ఏంటనే విషయంలో బయటకు మాత్రం రాలేదు. గతంలో ఇదే విషయమై పలు దఫాలు చర్చలు జరిగినా.. ఇటీవల ప్రభుత్వం 8 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విషయంలో ప్రత్యేక పరీక్షలు, డిపార్ట్ మెంటల్ పరీక్షలు సూచించాలని చెప్పడంతో ఈరోజు జరిగిన ప్రత్యేక సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ ప్రస్తావించిన అంశాలను డిజిపీ తెలియజేసిన అనంతరం ప్రభుత్వ ప్రత్యేకార్యదర్శి ఆదేశాల మేరకు వీరికి పరీక్షలు నిర్వహించే విషయమై ఒక నిర్ణయం తీసుకుంటరని మాత్రం తెలుస్తుంది. ఈరోజు మంగళగిరి నుండీ అన్ని జిల్లాల ఎస్పీలు, పి.టి.సి ప్రిన్సిపాల్స్, కమాండెంట్లు, డి.టి.సి & బి.టి.సి హెడ్స్, అన్ని జిల్లాల ఎస్డీపీఓలతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.