ఆ.. ఐఏఎస్ అధికారి పేరు ఏ. సూర్యకుమారి.. విజయనగరంజిల్లాకి కలెక్టర్, అన్ని ప్రభు త్వశాఖలను శాసించే జిల్లా ముఖ్య అధికారి, పలు సంస్ధలకు చైర్మన్.. కావాలను కుంటే ఏసీ గదుల్లో కూర్చొని కింది స్థాయి అధికారులతో పనిచేయించొచ్చు.. ఆదేశాలివ్వొచ్చు.. చిటెక వేసి క్షణాల్లో పథకాలు అమలు చేయించవచ్చు.. కానీ అక్కడ ఏం జరుగుతుందో ప్రజలు ఏమనుకుంటున్నారో మాత్రం వాస్తవాలు తెలియవు.. ఇదే విషయాన్ని గమనించిన సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కలెక్టర్లూ మీరు ప్రజల ఇంటి ముందుకు వెళ్లాలి..ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేదో అని తెలుసుకోవాలని కోరారు. అంతే రాష్ట్రంలోని విజయనగరం జిల్లాతో పాటు, మిగిలిన 12 జిల్లాల్లోని ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు తమ కార్యాలయాల్లో ఏసీ గదులు వదిలిపెట్టి క్షేత్రస్థాయిలో నిజంగా ప్రభుత్వ పథకాలు ఎంతమందికి అందుతున్నాయో తెలుసుకునే పనిలో పడ్డారు. ఇంటి ముందుకెళ్లి ఒక సాధారణ వ్యక్తిలా ప్రభుత్వ పథకాల కోసం ఆరాతీస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వం ప్రజల కోసం చేసే వేల కోట్ల సంక్షేమ పథకాల నిధులు ప్రజలకు అందుతున్నాయో..లేదంటే మధ్యలో దళారులు, అమలు చేసే అధికారులు తినేస్తున్నారో..అదీ కాదంటే పథకం రాసినందుకు ఆయా పార్టీల నేతల బొక్కేస్తున్నారో స్వయంగా జిల్లా కలెక్టర్ పసిగట్టేందుకు ఈ ప్రజల ముంగిట ప్రభుత్వ పథకాల అమలు శోధన ఎంతగానో ఉపయోగపడుతుంది. 75ఏళ్ల స్వాంతంత్ర్య భారత దేశంలో అఖిలభారతస్థాయి అధికారి సాధారణ ప్రజల గుమ్మం ముందు చేతులు కట్టుకొని నిలుచుని మరీ ప్రభుత్వ పథకాల అమలు కోసం వాకబు చేసిన అంశాన్ని ఎవరైగా ఊహించారా అంటే లేదనే చెప్పాలి.
ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని పథకాలు ప్రభుత్వానికి ఖర్చు తప్పా, ప్రజలకు ఉపయోగం లేదు. అలాంటి వాటిల్లో ఇంటింటికీ రేషన్ పథకం. ఇందులో వందల కోట్ల రూపాయలు వాహనాల కొనుగోలుకి ప్రభుత్వం ఖర్చుచేసింది. అనుకున్నట్టు ఆ పథకం ప్రజల మనసును రంజింపచేయలేకపోయింది. ఈ పథకం వలన ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో తెలుసుకోవాలని, ప్రజల సమస్యలతోపాటు, అమలు కాని పథకాల వివరాలు తెలుసుకోవాలని కూడా ప్రజలే ఐఏఎస్ అధికారుల ముందు ఏకరువుపెట్టే ఒక బ్రుహత్తర కార్యక్రమం కోసం ఇపుడు దేశమంతా చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే..గాంధీజీ కలలుగన్న గ్రామపరిపాలనను గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో తీసుకొచ్చిన ప్రభుత్వం ఇపుడు వారితోనే ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందిస్తోంది. అయనప్పటికీ ఏదో తెలియని వెలితి, ఇంకా చాలా మంది ప్రజలకు రాజకీయ నేతల వలనో, అధికారులో, సిబ్బంది ఫాల్సు ప్రెస్టేజీ వలనో పథకాలు అందని వారు చాలా మందే ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా నిజమైన అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేందుకు రాజమార్గం వేసినట్టు అయ్యింది. నలగని బట్టకట్టుకొని అధికారులతో సమీక్షలు నిర్వహించే ఐఏఎస్ అధికారులు గ్రామాల్లో కాలినడకన తిరుగుతూ, ఎండలో ఆరుబయటే నిలుచొని ప్రజలతో మమేకమై వారిని బాగోగులు తెలుసుకునేలా చేసిన ఈ ప్రయత్నం కొందరు ఐఏఎస్ అధికారులకు, రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని పథకాలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే నాయకులకు కాస్త అసహనం కలిగించినా.. కొద్ది మంది అధికారులకు నచ్చకపోయినా, మెజార్టీ ఐఏఎస్ అధికారులను మాత్రం ఎంతగానో ఆలోచింపజేసింది.
సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇలా ఆదేశించగానే అలా కధనరంగంలోకి దిగా ఐఏఎస్ అధికారులు గ్రామాల బాట పట్టారంటే సీఎం ముందుచూపు, సంక్షేమ పథకాలు ప్రతీ పేదవాడికి అందాలనే ఆలోచన ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఐఏఎస్ అధికారులు గ్రామాల్లో పర్యటించడం వలన ఒక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాదు..వేలకు వేలు జీతాలు తీసుకుంటూ.. పనులు చేయడానికి కాసుల పందేరం పెట్టే అవినీతి అధికారుల ఆటకూడా కట్టడై పోతుంది. ప్రభుత్వ ఉద్యోగం అంటే టైమిదాటిపోయిన తరువాత కార్యాలయానికి వెళ్లి.. ఆ తరువాత సమయం మిగిలి ఉండగానే ఇంటి మొహం పట్టే అధికారులతో కూడా సీఎం తీసుకున్న నిర్ణయం చక్కగా పనిచేయించేలా చేస్తుందని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ జీఓల ద్వారా పూర్తిస్థాయి అధికారాలు బదలాయింపు జరగకపోతే ప్రజలకు ఎలాంటి సేవలు అందవనే విషయం ఇప్పటికే గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిల విషయంలో తేలిపోయింది. వీరికి ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెంబరు 149 ఆధారంగా అధికారాలు, విధులు, నిధులు పరిధిలు పంపకాలు చేయాల్సి వున్నా ప్రభుత్వంలోని పంచాయతీరాజ్ శాఖ దానిని అమలు చేయలేదు. ఫలితంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటైనా, వీరి ద్వారా ప్రజలకు సేవలు మాత్రం అందడం లేదు. ఇపుడు ఆ విషయం కూడా గ్రామాల్లోకి వచ్చే ఐఏఎస్ అధికారులు, గ్రూప్-1 అధికారులకు ప్రజలే చెప్పే సమయం వచ్చింది. ఏదైనా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందుని అనే మాట్లాల్లో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజల కోసం ఆలోచిస్తే ఐఏఎస్ అధికారులే గ్రామాల బాట పట్టారు. జిల్లా కలెక్టర్ కు విశేష అధికారం ఉంది కనుక కనుసైగలతో అధికారులు పనులు చేస్తున్నారు.. అదే నిత్యం గ్రామాల్లో ఉంటూ ప్రజలకు సేవలందించే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకూ అవే అధికారాలు(149 జీవో ద్వారా సంక్రమించేవి మాత్రమే) ఉంటే ఫలితాలు ఇంకెంత బాగుంటాయో ఊహకే అందదు.. ఐఏఎస్ అధికారి మనసుపెట్టి ఆలోచించి పనిచేసే సిబ్బందికి అధికారాలు కట్టబెడితే ఫలితాలు ఏ విధంగా వస్తాయో ఒక్కసారి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సి వుంది..!