ఇక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ దళం..


Ens Balu
83
Tadepalle
2021-08-30 06:11:51

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఒక దళం ప్రజలకు దర్శనం ఇవ్వబోతుంది..13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ప్రత్యక ఏకరూప దుస్తులు(యూనిఫారం)తో దర్శనం ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఇక్కడ పనిచేసే మహిళాపోలీసులను పోలీసుశాఖలో విలీనం చేసిన ప్రభుత్వం మిగిలిన 16 శాఖల(ఆల్రెడీ వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ ఉద్యోగులకు గ్రీన్ యాప్రాన్ఇచ్చేశారు) ఉద్యోగులకు దుస్తులను ఇవ్వనుంది. వీరంతా అక్టోబరు రెండు తరువాత అన్ని సచివాలయాల్లోనూ ప్రభుత్వం ఇచ్చిన యూనిఫారంతోనే దర్శనమిస్తారు. వీరిని చూసిన వారందరికీ ఒక ప్రత్యేక దళంగా కనిపిస్తారు. అందుకే వీరికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల దళంగా విశ్లేషకులు వర్ణిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల, గ్రామ, వార్డు సచివాలయ భవనాలు నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పూర్తిై సిబ్బంది సేవలు కూడా అందిస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టుగానే ఉద్యోగులందరికీ ఏకరూప దుస్తులు ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ పనుల, సేవల కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చేవారందరికీ వీరు ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశ్యంతోనే యూనిఫారం ఇస్తున్నట్టు రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net కి చెప్పారు. వీరికి మెడలో వేసుకోవడానికి కూడా గ్రామ, వార్డు సచివాలయం పేరుతోనే ఐడీకార్డు బ్యాడ్జీలు కూడా ఇవ్వనున్నారు. అందరూ ఒకేలా దుస్తులు వేసుకోవడంతోపాటు, ఎవరికీ కేటాయించి ప్రభుత్వశాఖల సీట్లో వారు కూర్చొని వచ్చిన వారందరి సేవలు చేస్తారు. ఇప్పటికే 775 సేవలను సచివాలయాల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చిన్న ప్రభుత్వం అన్నింటికోసం కామన్ సర్వీస్ సెంటర్ ను అనుసంధానం చేసే పనిలో ఉంది. 

ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు క్రింద కొన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని గ్రామ, వార్డు సచివాలయాలకు అందుబాటులోకి తెచ్చిన ఈవిధానం కూడా అక్టోబరు 2 తరువాత రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి వస్తుందని కూడా ఆ అధికారి చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని రకాల సేవలు ఒక్క గ్రామస్థాయిలోనే ప్రజలు పొందేలా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందని చెప్పారు. త్వరలోనే వివిధ రకాల సర్టిఫికేట్లు(ఫార్మసీ, మెడిసిన్, పారామెడికల్ బోర్డు, డ్రైవింగ్ లైసెన్స్ రెవిన్యువల్ ఇలా) అన్ని రకాల సేవలను కూడా ఇక్కడి నుంచే పొందే విధంగా కూడా గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేస్తుందట. అదే జరిగితే రాజధాని ప్రాంల్లో మాత్రమే ఉండే సదరు కార్యాలయాలకు ఎవరూ వెళ్లాల్సిన పనికూడా ఉండదు. ప్రజలకు ఆర్ధిక భారాన్ని తగ్గించి అన్ని రకాల సేవలను ఒకేచోట అందించడంతోపాటు స్పందన ద్వారా వచ్చే అర్జీలను కూడా వీరే పరిష్కరించాల్సి వుంటుంది. స్పందన దరఖాస్తులను మాత్రం మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారుల డాష్ బోర్డుల ద్వారా పర్యవేక్షించి ఎవరి స్థాయిలో వారు స్పందన అర్జీలను కూడా పరిష్కరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు అవుతుంది..

ఇక సుమారు రెండేళ్లుగా ఎదురు చూస్తున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిల అధికారాలు, విధులు, నిధులు పరిధిల బదలాయింపుపై కూడా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టుగా సమాచారం అందుతుంది. పంచాయతీ కార్యదర్శిల ఉద్యోగాలు రెగ్యులర్ అయిన తరువాత ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెంబరు 149ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందట. ఇప్పటికే ఈ విషయమై ఉద్యోగులంతా ఆందోళన చేయడం, మండలం నుంచి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వరకూ లేఖలు సమర్పిస్తూ వచ్చారు. అయితే కేవలం ఉద్యోగుల ప్రొబేషన్ పీరియడ్ కాకపోవడం, కొన్ని సాంకేతిక కారణాలు అడ్డంకిగా ఉండటం, ప్రస్తుతం ఉన్న గ్రేడ్-1,4 యూనియన్  నేతల ఒత్తిడి వలన కాస్త ఆలస్యం అవుతున్నా.. ఖచ్చితంగా అమలు చేస్తామని మాత్రం అధికారులు చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఇంటిపన్నులు పెంచిన తరుణంలో వాటి ఎసెస్ మెంట్లు పూర్తిస్థాయిలో ఆన్ లైన్ చేయకపోయాయి పంచాయతీలు, వారికి పూర్తిస్థాయిలో సిబ్బంది(జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు) ఉన్నా వారు పని పూర్తిచేయలేకపోయారు. అప్పుడు కూడా గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులే ఆ పనులు వారి వారి పరిధిలోని ఇళ్లకు అర్ధరాత్రి సమయంలో కూడా అసెస్ మెంట్లు ఆన్ లైన్ చేశారు. దీనితో వీరి సేవలను గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుతం వున్న గ్రేడ్-1,4 పంచాయతీకార్యదర్శిల్లో 80శాతం మందికి కంప్యూటర్ వినియోగంపై అవగాహన లేకపోవడం, సిబ్బంది ఉన్నా పని సకాంలో పూర్తిచేయకపోయిన విషయాన్ని గుర్తించామని పంచాయతీరాజ్ శాఖలోని ఒక ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గ్రేడ్-5 కార్యదర్శిలు డిమాండ్ సహేతుకంగా ఉన్నప్పటికీ, అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి వుందని, మరోవైపు జిల్లాల నుంచి కలెక్టర్లు కూడా ఇదే విషయమై చర్చలు జరుపుతున్న విషయాన్ని కూడా ఆయన కొందరు రాష్ట్ర సచివాలయ మీడియా ముందు ప్రస్తావించినట్టు సమాచారం అందుతుంది.  అయితే వీరికి ఎప్పుడు బదలాయింపులు ఇస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ రావడానికి సమయం పట్టేట్టు కనిపిస్తుందని, అదే సమయంలో ఉద్యోగులకు రెగ్యులర్ అయితన తరువాత అధికార బదలాయింపులు చేయపోతే వారు కోర్టుకు వెళితే ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని కూడా అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు అధికారాలు రావడానికి మార్గం సుగమం అయినట్టుగానే కనిపిస్తుంది..ఇక అధికారులు నిర్ణయం తీసుకోవడమే తరువాయి. కాగా ఏకరూప దుస్తులపై మాత్రం సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. కాకపోతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మార్పులు జరగవనే సంకేతాలు కూడా దుస్తుల టెండరు తేటతెల్లం చేసింది.. !