సచివాలయ ఉద్యోగుల బదిలీలు అప్పుడేనా..?


Ens Balu
45
Tadepalle
2021-08-31 02:12:40

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు జరుగుతున్నాయా.. జరుగుతాయా.. ఉంటే ఎపుడు ఉంటాయి.. అసలు ఐదేళ్ల వరకూ ఉండవా.. సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత  ఏడాది చేసేస్తారా.. ఏది నిజం.. ప్రస్తుతం ఉద్యోగుల్లో ఇదే విషయమై తీవ్రమైన చర్చజరుగుతోంది. ఎవరో ఒకరు వేసిన ప్రశ్న మొత్తం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాల్లో పనిచేస్తున్న లక్షా 35 వేలయ మంది ఉద్యోగుల మనసులను తీవ్రంగా తొలిచేస్తుంది. ఈ విషయంలో క్లారిటీ తెచ్చేందుకు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net తన నెట్వర్క్ తో రంగంలోకి దిగింది. వాస్తవాలు తెలుసుకునే పనిలో పడింది. ఈ క్రమంలో ఈఎన్ఎస్ నెట్వర్క్ దగ్గరకి వచ్చిన వివరాలు, కొందరు రాష్ట్ర అధికారులతో మాట్లాడిన తరువాత వచ్చిన క్లారిటీ ప్రకారం.. సచివాలయ ఉద్యోగులో ఇప్పట్లో బదిలీలు జరగవనేది సూచన ప్రాయంగా అధికారులు చెబుతున్నారు. దానికి కారణాలను కూడా వారు 5 అంశాలను ఈఎన్ఎస్ వద్ద ప్రస్తావించారు. 1)సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ కాలేదు.. దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి.. 2)ఉద్యోగులకు బదిలీలు జరగాలంటే ట్రాన్స్ ఫర్ పాలసీని ప్రభుత్వం ప్రత్యేక జీఓ ద్వారా ప్రకటించాలి.. 3)నేటికీ గ్రామ,వార్డు సచివాలయ శాఖలోని 19శాఖల ఉద్యోగులకు సరైన జాబ్ చార్ట్ రాలేదు, సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ కాలేదు..గెజిట్ లు పబ్లికేషన్ కాలేదు.. 4) ఏ ప్రభుత్వ శాఖలోనైనా బదిలీలు జరగాలంటే కనీసం మూడున్నరేళ్లు నుంచి ఐదేళ్ల సమయం పడుతుంది.. 5) ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్నవారి ఉద్యోగాల్లో ఎంత మంది సర్వీసులు రెగ్యులర్ అవుతాయో ఎంతమందికి సమయం పడుతుందో..(వారికి డిపార్ట్ మెంటల్ పరీక్షలు ఆధారంగా) అని మొదలు పెట్టారు. ఇదీ వాస్తవమే.. అసలు ఉద్యోగాలే రెగ్యులర్ కాకుండా బదిలీలు ఎలా చేస్తారో ఉద్యోగులకే తెలియాల్సి వుంది. ఒకవేళ సర్వీసులు రెగ్యులర్ అయినా ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయం తీసుకునేదాకా ఆ జోలికి వెళ్లే పరిస్థితి లేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పటికే మహిళా పోలీసులను పోలీసుశాఖలో విలీనం చేసి జీఓనెంబరు 59 విడుదల చేయడం దానిపై కొంత మంది వ్యతిరేకించడం, వారి పదోన్నతుల్లో డిగ్రీ అర్హత ఉన్నా.. ఎస్ఐగా కాకుండా హెడ్ కానిస్టేబుల్ గా ప్రకటించడం, వారికి ఖాకీ డ్రెస్సు ఇస్తామంట కొందరు వద్దని చెప్పడం, ఇక మిగిలిన శాఖల ఉద్యోగులను తీసుకుంటే ప్రభుత్వం కేటాయించి ఏక రూప దుస్తుల విధానాన్ని వ్యతిరేకించడం. ఇవన్నీ పక్కనపెడితే అసలు నూతనంగా విధుల్లోకి చేరిన ఉద్యోగులను ఎలా బదిలీలు చేయాలనే అంశం. ప్రభుత్వం ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేయడానికే వందసార్లు వెయ్యికోణాల్లో ఆలోచిస్తూ.. వారి సర్వీసులకు చాలా నిబందనలు పెట్టి వాటిని అమలు చేయడానికి రెండేళ్లు పూర్తవుతున్న సమయంలో కొత్త కొత్త విధానాలను రూపొందిస్తోంది.

 ఈ తరుణంలో ఉద్యోగుల్లో ఉన్న బదిలీల ఆశలపై సదరు ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలు నోరు మెదపడం లేదు సరకదా..వారి సర్వీసులకు సంబంధించిన అన్నీ అంశాలూ పూర్తైన వరకూ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలావుంటే ఉద్యోగులు మాత్రం వారి వారి సామాజిక మాద్యమాల్లో మాత్రం మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్లు, జిల్లాల పరిధిలోనే జరిగే బదిలీల కోసం పెద్ద పెద్ద చర్చలకు తెరతీస్తున్నారు. ఒక ప్రక్క గ్రేడ్-5 కార్యదర్శిలకు సంబంధించి జీఓనెంబరు 149 పెండింగ్ లో ఉండిపోవడంతోపాటు 8శాఖల సిబ్బందికి డిపార్టమెంటల్ టెస్టుల విషయంలోనూ ఒక్కోశాఖకు సంబంధించి ఒక్కో గెజిట్ పబ్లికేషన్ ను ప్రభుత్వం ఆలస్యంగా విడుదల చేసుకుంటూ వస్తుంది. వాస్తవానికి ఉద్యోగులకు సర్వీసు రూల్స్ దగ్గర నుంచి ప్రొబేషన్ డిక్లరేషన్ తోపాటు, ట్రాన్స్ ఫర్స్ ఎలిజిబిలిటీ వచ్చినా ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొచి బదిలీలకు జీఓ ఇస్తే తప్పా ఆ పని జరగదు. ‘ఆలు లేదు సూలు లేదు కొడుడుపేరు సోమలింగం’ అన్నట్టుగా సచివాలయ ఉద్యోగులు అపుడే బదిలీల కోసం ఆలోచిస్తుండం విచిత్రంగా ఉందంటూ ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు జస్ట్ కామెడీగా తీసుకుంటున్నారు. ఇక్కడ ఉద్యోగుల్లో కూడా ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లడం, ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయాలు, పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, గ్రేడ్-1,4 కార్యదర్శిల నుంచి ప్రోత్సాహం లేకపోవడం, వేరే వేరే జిల్లాల్లో ఉద్యోగాలు లభించడం, ప్రభుత్వం ఇచ్చే రూ.15 వేలు జీతం ఎటూ చాలకపోవడం తదితర ఎన్నో కారణాలను సచివాలయ ఉద్యోగులు చెప్పుకొస్తున్నారు. ఏది ఎలా వున్నా, ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సర్వీసు డిక్లరేషన్ ప్రకటించి వారందరికీ ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించిన తరువాత మాత్రమే పదోన్నతలకు సంబందించి ఏ పనైనా ముందుకి కదులుతుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. 

కాగా  రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు జిల్లాల్లో ఉన్న ఉద్యోగులు మాత్రం మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్లకు మాత్రం లైన్ క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రభుత్వంలోని ఇతర పెద్దలను ప్రసన్నం చేసుకుంటూ పదోన్నతలు(సర్వీస్ రెగ్యులైజేషన్) రాగానే ఒక్కసారే జంప్ అయిపోవాలని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరికొంత మంది ఉద్యోగులు మాత్రం తమ ఉద్యోగాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సర్వీసులు రెగ్యులర్ అయిపోతే ఒక పనైపోతుందని, కావాలంటే ఆ తరువాత బదిలీలు, పదోన్నతులు, ఇతరత్రా అంశాలు చూసుకుందామన్నట్టుగా కామ్ గా ఉండి పోతున్నారు. మరికొంత మంది తమకు రావాల్సిన అధికారాలు, విధులు, నిధులు, పరిధిల కావాలని పట్టుబడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే గ్రామసచివాలయాల్లో డిడిఓగా ఉండే కార్యదర్శిలను కాదని పంచాయతీరాజ్ శాఖ ఆ అధికారాలను విద్యార్హత తక్కువగా వున్న వీఆర్వోలకు కట్టబెట్టింది ఆ అంశం కాస్త కోర్టులో ఉంది. గ్రేడ్-5 కార్యదర్శిల అధికారాలు సైతం ఇంకా గాల్లోనే ఉన్నాయి.. ఇంకా భర్తీకానీ చాలా పోస్టులను ప్రభుత్వం ఇంకా భర్తీచేయలేదు. ఇలా ఎటు చూసినా బదిలీలకు సంబధించి ఏ కోణంలోనూ లైన్ క్లియర్ గా ఉన్నట్టు మాత్రం కనిపించం లేదు. అయితే ఇన్ని కారణాలు చెప్పిన అధికారులు ప్రభుత్వ పెద్దలు తలచుకుంటే ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేసిన తరువాత ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకొని దగ్గర చేసి బదిలీలు చేయించినా చేస్తారంటూ అధికారులు ముగించడాన్ని బట్టి బదిలీలకు అశకాశం 50-50 చాన్సులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రిక అయిన గ్రామ, వార్డు సచివాలయశాఖలో అక్టోబరు 2 తరువాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో అనే విషయంపై అందరికీ ఉత్కంఠ నెలకొంది..!