శ్రీవారి నవనీత సేవలో భక్తులకు అవకాశం..
Ens Balu
0
Tirumala
2021-09-04 06:35:34
దేశీయ గోవుల నుండి సేకరించిన పాల నుంచి పెరుగు తయారుచేసి, దాన్ని చిలికి వెన్న తయారుచేసి స్వామివారికి సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవలో భక్తులు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి చెప్పారు. సెప్టెంబరు 13వ తేదీ నుంచి ఏడు బ్రాండ్లతో పరిమళభరిత అగరబత్తులు భక్తులకు విక్రయం కోసం అందుబాటులోకి తెస్తామన్నారు. తిరుపతి టిటిడి పరిపాలన భవనంలో శనివారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ముందుగా టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. స్వామివారికి చెందిన సేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈఓ వివరించారు. ఈ సందర్భంగా భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు టిటిడి అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో సదా భార్గవి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్వీబీసీ సీఈవో సురేష్‌కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.