జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం..
Ens Balu
0
Tadepalle
2021-09-06 14:28:00
రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి ప్రత్యేకంగా సజ్జల రామకృష్ణారెడ్డి తో జాతీయ జర్నలిస్టుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నాయకులంతా సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి పలు అంశాలను చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జర్నలిస్టులు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాల సమస్య,హెల్త్ ఇన్సూరెన్స్ ,ప్రమాద బీమా పాలసీ వంటి సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీను బాబు వివరించారు. ప్రధాన పత్రికలతో పాటు చిన్న పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన అనేక మంది జర్నలిస్టులు పలు సమస్య లు ఎదుర్కొంటున్నారని సజ్జల దృష్టికి తీసుకు వెళ్ళారు. అంతేకాకుండా దశాబ్దాల తరబడి ఇళ్ల స్థలాలు సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల కూడా జర్నలిస్ట్ లు తీవ్ర ఆందోళన చెందుతున్న వివరించారు. ఇక 1994లో విశాఖలో 23 మంది జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించిన నేటికీ వారికి ఎన్ఓసి లు జారీ చేయలేదని శ్రీనుబాబు సజ్జలకు వివరించారు. మరోవైపు 2005 ఆక్రిడేటెడ్ జర్నలిస్టుల సంఘం సుమారు ఐదున్నర కోట్లు ఎన్నో ఏళ్ల క్రితం ప్రభుత్వానికి జమ చేయడం జరిగిందని, అనేక వ్యయ ప్రయాసలకోర్చి సొమ్ము చెల్లించినప్పటికి నేటికీ ప్రభుత్వము ఆయా స్థలాలు సభ్యులకు రిజిస్ట్రేషన్ చేయకపోవడం కూడా తీవ్ర ఆవేదనకు గురిచేస్తుందన్నారు. విశాఖ అర్బన్ అధ్యక్షులు పి.నారాయన్ మాట్లాడుతూ, తక్షణమే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని, అనేక సంవత్సరాల నుంచి తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియజేశారు. ఆయా అంశాలకు సంబంధించి ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు. వీటిపై సజ్జల సానుకూలం గా స్పందించారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సజ్జల హామీఇచ్చారు. చిన్న పత్రికలును ఆదుకుంటా మన్నారు. అనంతరం సజ్జలకు శ్రీనుబాబు సింహాద్రినాథుడు జ్ఞాపికను అందచేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా 13 జిల్లాలు కు చెందిన జర్నలిస్టు సంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలేల్ల అప్పి రెడ్డి, ఫెడరేషన్ రాష్ట్రఅధ్యక్షులు వెంకటరావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు. విశాఖ నుంచి జర్నలిస్ట్ సంఘం నాయకులు ఈరోతి ఈశ్వర్ రావు, బందరు శివప్రసాద్, జి.శ్రీనివాసరావు,సీతారామ్ మూర్తి, ఆనంద్ రావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.