ఏపీలో కొత్తగా వీరికే డిపార్ట్ మెంటల్ టెస్టులు..


Ens Balu
12
Tadepalli
2021-09-11 05:53:16

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖలో సరికొత్త విధానాలకు తెరలేపింది. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఒక్కశాఖలోని  డిపార్ట్ మెంటల్ పరీక్షల లేని వారికి కూడా క్రియేట్ చేసి మరీ నిర్వహిస్తోంది. గతంలోలేని ప్రభుత్వ శాఖలకు సైతం ఇపుడు కొత్తగా టెస్టులు నిర్వహించి దేశవ్యాప్తంగా వున్న రాష్ట్రాల ద్రుష్టిని ఏపీవైపు మరల్చుకుంటోంది. ఈ విషయంలో ఉద్యోగులను నుంచి తీవ్ర నిరసన ఎదురైనా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళుతోంది. ఉద్యోగులకు ఈ పరీక్షలు వింతగానూ, కొత్తగానూ ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం దానికి ప్రత్యేక నిర్వచనం చెబుతోంది. అదీకూడా గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు రెండేళ్లు పూర్తయిన తరువాత ఈ డిపార్ట్ మెంటల్ టెస్టులు ఉంటాయని ప్రకటించడం పట్ల రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని లక్షా 34వేల మంది ఉద్యోగులు ప్రభుత్వం తీరుపై ఒంటికాలపై లేచి మరీ మండిపడుతున్నారు. డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసైన తరువాత మాత్రమే ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఈ విషయాన్ని కనీసం ఏడాది ముందుగా చెప్పి, సిలబస్ ఇచ్చి ఉంటే ఉద్యోగులంతా ఉత్తీర్ణత సాధించేవారని,, తీరా సర్వీసు రెగ్యులర్ చేయడానికి నెలరోజుల ముందు పరీక్ష పెట్టి పాసైతేనే సర్వీస్ రెగ్యులర్ అంటే ఎంత మంది పాసై ఉద్యోగాలు రెగ్యులర్ చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ప్రాధమిక శిక్షణ తప్పా మరే ఇతర శిక్షణలు ఇవ్వలేదని, ఈ కారణంగానే డిపార్ట్ మెంటల్ పరీక్షలు ఖచ్చితంగా పెట్టి అందులో సిలబస్ ను ప్రత్యేకంగా ఉంచి వారికి శిక్షణ స్థాయిలో ఉంటుందనే కారణంతోనే ఈ విధంగా డిపార్ట్ మెంటల్ పరీక్షలు లేని వారికి కూడా పరీక్షలు పెడుతున్నామని ఉన్నతాధికారి ఒకరు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net కి ప్రత్యేకంగా చెప్పారు. అదే సమయంలో ఈఎన్ఎస్ కూడా ఇదే పరీక్ష విషయాన్ని ముందుగా ఉద్యోగులకు చెప్పి ఉంటే పరిస్థితి బాగుండును కదాని ప్రశ్నిస్తే.. కరోనా సమయం కావడంతో అప్పుడు ప్రకటించలేదనే మాటను ఆ అధికారి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న గ్రామ, వార్డు సచివాలయ శాఖలో 8శాఖలకు అసలు డిపార్ట్ మెంటల్ టెస్టులే లేనపుడు ఏ విధంగా వీటిని నిర్వహిస్తారని కూడా ఈఎన్ఎస్ ప్రశ్నిస్తే.. ఆయా శాఖల ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ పై అవగాహన వస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన కొద్దిపాటి శిక్షణ వారికి చాలదని.. ఆకారణంతోనే శిక్షణ తరహాలో కూడి డిపార్టమెంటల్ పరీక్షలు వీరికి నిర్వహిస్తున్నామని ఆ అధికారి బదులిచ్చారు. దానికి మహిళా పోలీస్ లనే ఉదాహరణగా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న వీరికి అన్ని పోలీస్ స్టేషన్లలో లోనూ వారం రోజుల పాటు ప్రత్యేకంగా రెండవ దఫా శిక్షణ కూడా ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఇపుడు కూడా ఉద్యోగులంతా మెరిట్ ప్రాతిపదిక మార్కులు తెచ్చుకోవాల్సిన పనిలేదని, క్వాలిఫై అయితే సరిపోతుందని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగుల్లో ఉన్న ఆందోళనను పోగొట్టడానికే ఈ క్లారిఫికేషన్ తమకున్న సమాచారం మేరకు ఇస్తున్నామని కూడా(పేరు రాయడానికి ఒప్పుకోని అధికారి) చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నా..దేశం మొత్తం తొంగిచూసే ప్రభుత్వ శాఖగా గ్రామ, వార్డు సచివాలయ శాఖ రూపుదిద్దుకోవడానికి మాత్రం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ముందుచూపుతో ఆలోచిస్తున్నారని తడుముకోకుండా చెప్పారు. ఇపుడు ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులంతా రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో సీఎం ను ఆశానికి ఎత్తేస్తారని చెప్పడం విశేషం. ఈ డిపార్టమెంటల్ టెస్టులు కూడా ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు విధినిర్వహణలో అన్నిరకాలుగా సౌకర్యంగా ఉండాలనే ప్రభుత్వం నిర్వహిస్తోందని.. ఇందులో వేరే ఉద్ధేశ్యం ఏమీ లేదని మాత్రం ప్రభుత్వంలోని పెద్దలు వల్లెవేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వంలో ఏ శాఖలోని ఉద్యోగులకూ లేని విధంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ప్రభుత్వం ఒక్కోసారి ఒక్కోవిధంగా స్పందించి, పరీక్షలు నిబంధనలు పెట్టడం మాత్రం తీవ్రమైన చర్చకు దారితీస్తుంది..!