చిత్తూరుజిల్లాకు మాత్రమే సర్వదర్శనం..
Ens Balu
7
Tirumala
2021-09-11 14:44:14
తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ లో చిత్తూరు జిల్లాకు చెందిన వారికి మాత్రమే ప్రయోగాత్మకంగా సర్వ దర్శనం టోకెన్లను టిటిడి జారీ చేస్తోంది. అయితే, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భక్తులు ఈ విషయం తెలియక సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతికి వచ్చి ప్రయత్నించి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన టిటిడి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భక్తులు ఈ విషయాన్ని గుర్తించి టిటిడికి సహకరించాలని విజ్ఞపి చేస్తున్నది. కేవలం ఇపుడు చిత్తూరు జిల్లాకి చెందిన వారికి మాత్రమే జారీచేస్తున్నట్టు తెలియజేస్తుంది.