ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ఆదివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ గోస్వామి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని ఆశీర్వాద మండపంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ డెప్యూటీ ఈవో కస్తూరి బాయి, ఎఈవో ప్రభాకర్ రెడ్డి, విజిఓ, మనోహర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.