ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్థపై జిఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. వ్యాట్ అమలులో వున్నప్పుడు రాష్ట్ర వాణిజ్య పన్నుల ఆదాయం 14 నుంచి 15 శాతం వ్రుద్ధిని నమోదు చేసుకున్న ఏపీ ప్రభుత్వం జిఎస్టీ అమలు జరిగిన తరువాత ఇపుడు 10శాతానికి పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో రాష్ట్రప్రభుత్వం భారీ స్థాయిలో ఆదాయం కోల్పోయే పరిస్థిలు నెలకొన్నాయి. జిఎస్టీ వలన ఏపీ ఏ విధంగా ఆదాయం కోల్పోతుందో.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవిధమైన ప్యాకేజీ ఏపీకి రావడం లేదో అనే విషయాన్ని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి లక్నోలో జరిగిన 45వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం ద్రుష్టకి తీసుకెళ్లారు. జిఎస్టీ వలన నష్టం తప్పితే ఆదాయం సమకూరడం లేదనే విషయాన్ని కౌన్సిల్ ద్రుష్టికి తీసుకెళ్లి పలు కీలక అంశాలను చర్చించారు. బుగ్గన తీసుకొచ్చిన అంశాలను బట్టి జిఎస్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుకుంటుందా అనే కోణం కనిపించింది. జిఎస్టీ అమలు లోకి వచ్చిన తరువాత ఏడుశాతం క్షీణత అంటే మామూలు విషయం కాదు. ఇక జిఎస్టీలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఒక్కసారి పరిశీలిస్తే.. జిఎస్టీపై వ్యారాస్తులకు, సంస్థలకు, వాణిజ్య సంస్థలకు పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పాటు చేయలేదు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ల రాష్ట్రపరిధిలో కాకుండా కేంద్ర పరిధిలోనే ఉంచుకుంది. జిఎస్టీపై అవగాహన లేనివారు ముందుగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకొని..తరువాత మళ్లీ దానిని కేన్సిల్ చేయించుకోవడానికి ప్రభుత్వానికి అపరాద రుసుము వేలల్లో కట్టాల్సి రావడంతో జిఎస్టీ వలన జరుగుతున్న నష్టాలను వ్యాపారస్తులు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి తెలియజేయడంతో జిఎస్టీ రిజిస్ట్రేషన్ కు ముందుకి రావడం లేదు. పైగా జిఎస్టీ రిటర్న్స్ దాఖలు విషయంలో అత్యధిక ఫైన్లు వేయడం కూడా జిఎస్టీ ఆదాయానికి గండి పడేలా చేస్తున్నది. ఈ విషయం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాగా అర్ధమైంది. బంగారు కోడిపెట్టలా మంచి ఆదాయ వనరుగా మారుతుందని భావించిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తిరిగి వారి ఆదాయానికే గండి కొట్టేలా జిఎస్టీ మారడంతో మళ్లీ అన్ని రాష్ట్రప్రభుత్వాల చూపు వ్యాట్ పైకే మల్లుతున్నట్టు జిఎస్టీ కౌన్సిల్ లో పలు రాష్ట్రాలు కేంద్రం ద్రుష్టికి సమస్యలను తీసుకెళ్లాయి.
జిఎస్టీ వలన వచ్చే నష్టాలు పూడ్చుకోకపోయినా, జిఎస్టీని చమురు విక్రయాలకు అమలు చేయకపోయినా భారీ నష్టాలే వచ్చే అవకాశం వుంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు, ఎన్ని ఆలోచనలు చేసినా జిఎస్టీ విషయంలో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని మరో వ్యాపారస్తుడిని హెచ్చరించేలా చేస్తుంది. జిఎస్టీ రిటర్స్న్ దాఖలు విషయంలో ఆదాయ పన్ను దాఖలు చేసే విధంగా కనీసం గడువు పెంచకపోవడం, అపాదర రుసుము అధికంగా విధించడమే జిఎస్టీ నష్టాలకు కారణంగా కనిపిస్తుంది. నేటికీ జిఎస్టీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కమర్షియల్ టాక్స్ అధికారులకు సైతం అవగాహన లేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ తరుణంలో ఏపీ ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన జిఎస్టీ కౌన్సిల్ ముందు ప్రస్తావించిన అంశాలు ఇపుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆలోచించేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పలు సంక్షేమ పథకాలు అమలు కావాలంలే ఆదాయం చాలా ఎక్కువగా కావాల్సి వుంది. ఈ తరుణంలో అన్ని రకాల ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న ఏపీ ప్రభుత్వానికి జిఎస్టీ ఇపుడు ఒక పెద్ద గుదిబండలా తయారైంది. ఆదాయం తెచ్చి పెడుతుందనుకుంటే ఉన్న ఆదాయ మార్గాలను మొత్తం తగ్గిపోయేలా చేస్తుంది. దానికి కేంద్రంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వంలోని కమర్షియల్ టాక్స్ అధికారులు చేపడుతున్న విధానాలు కూడా ఒక కారణంగా కనిపిస్తున్నాయి. ఇదే తరుణంలో జిఎస్టీ వలన ఆదాయం కాస్త బారీగా వస్తుందనుకుని లెక్కలు వేసిన ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తున్నాయి. అనుకున్నదానికంటే ఆదాయం ఐదుశాతానికి తగ్గిపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. ఈ జిఎస్టీ వలన వ్రుద్ధి రేటు పడిపోయినా.. వాణిజ్య పన్నుల ద్వారా ఆదాయం తగ్గిపోయినా కేంద్రం మెప్పుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో జోడి కట్టి జిఎస్టీని కొనసాగిస్తుందో..లేదంటే పాత వ్యాట్ విధానానికికే మొగ్గు చూపిస్తోందో..అదీ కాదంటే..జిఎస్టీ వలన కలిగినే నష్టాలపై ఇతర రాష్ట్రప్రభుత్వాలను ఆలోచించాలా చైతన్యం తెస్తుందా అనేది ప్రశ్నార్ధకమైంది. అదీకాదంటే ఆదాయ పన్ను రిటర్న్స్ మాదిరిగా జిఎస్టీ రిటర్న్స్ కు కూడా అపరాద రుసుములు లేని అవకాశం ఇచ్చి సంస్ధల ద్వారా జిఎస్టీతో ఆదాయాన్ని పెంచుకునే వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరుతుందో అనేది వేచిచూడాలి.