సమాచారశాఖ అధికారులకు ఇన్ కమింగ్ , ఔట్ గోయింగ్ కాల్స్ కట్..
Ens Balu
5
Tadepalli
2021-09-21 06:26:18
ఆంధ్రప్రదేశ్ లోని సమచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది అధికారిక ఫోన్లకు ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ కట్ ఆగిపోయాయి. ఒక్క అధికారులకే కాదు.. కమిషనర్, జెడీ, ఏడీల దగ్గర నుంచి జిల్లాల్లోని ఏపీఆర్వోల దాకా అందరి నెంబర్లు పనిచేయడం లేదు. దీనితో వారంరోజుల నుంచి సమాచారశాఖలో వారి సొంత మొబైల్ నెంబర్లును మాత్రమే వినియోగించాల్సి వస్తుంది. రాష్ట్రంలోని తమశాఖలో అందరు అధికారులదీ ఇదే పరిస్తితి అని సమాచారశాఖ అధికారులు చెబుతున్నారు. అత్యవసర పనిపై ఎవరు కాల్ చేయాలన్నా అధికారిక నెంబర్లకు ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ నిలిపివేయబడ్డాయి అనే సమాధానం వస్తున్నది. అలాగని జిల్లా కలెక్టర్లు, జెసిలకు తప్పితే సమాచారశాఖ అధికారుల పర్శనల్ నెంబరులు మరెవరికీ తెలియడం లేదు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రభుత్వంలోని గ్రూప్ నెట్వర్క్ గా వున్న ఈ నెంబర్లుకు ఆరు నెలలుగా బిల్లులు చెల్లింకపోవడం వలనే పోస్ట్ పెయిడ్ గా వున్న ఈ నెంబర్లకు ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ నిలిపివేశారనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయం సమాచారశాఖ మంత్రి పేర్ని నాని వరకూ వెళ్లింది. ఏం జరుగుతుందనేది తేలాల్సి వుంది.