ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ సహకారం మరువలేనిది..


Ens Balu
3
Tadepalli
2021-09-22 15:42:04

ఆంధ్రప్రదేశ్ లో స్ధానిక సంస్దల ఎన్నికలను సమర్ధవంతంగా పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన తోడ్పాటును అందించిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఎం. గిరిజా శంకర్‌ లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కాలిసి  కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మీట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు,సిబ్బంది కూడా బాగా కష్టపడి పరిచేశారని సీఎం కూడా కొనియాడారు.  మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వంపై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో ఈ ఎన్నికల్లో మరోసారి రుజువైందన్నారు.