ఏపీ సచివాలయ మహిళాపోలీస్ కేప్ రంగుపై ఆఫ్రికన్ మహిళా పోలీసుల హర్షం..


Ens Balu
6
Tadepalli
2021-09-27 05:40:27

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు ప్రభుత్వం ఇచ్చిన కాకీ యూని ఫారంతోపాటు లైట్ బ్లూకలర్ కేప్ ను కేటాయించడం పట్ల ఆఫ్రికాదేశ(ఐక్యరాజ్యసమితి) మహిళా పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్రికన్ మహిళా పోలీసులకు ఇచ్చిన కేప్ కలర్ ను ఇపుడు ఏపీలోని సచివాలయ మహిళా పోలీసులకు ఇవ్వడం వలన మాకు అపారమైన గౌరవం దక్కిందంటూ ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాన్ని ఆఫ్రికన్ మహిళా పోలీసులు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని మహిళా పోలీసులకు ఏపీ ప్రభుత్వంలోని హోంశాఖ కూడా అదే రంగు కేప్ ని మంజూరు చేయడమే దీనికి కారణం. వాస్తవానికి ఆఫ్రికాలోకూడా మహిళా పోలీసు విభాగం వుంది. అక్కడ దేశంలో వారితో ప్రభుత్వం మంచి ఫలితాలను సాధించడంతోపాటు ఎన్నో దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది. ఆ క్రమంలో ఇపుడు రాష్ట్రంలో కూడా అంతకంటే అత్యధిక స్థాయిలో మహిళా పోలీసుల నియామకం చేపట్టడం, మహిళల కోసం దిశ యాప్ ని రూపొందించడం, ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లు, దిశను చట్టం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న క్రుషికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది. దానికి కారణం రాష్ట్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పోస్టులకు స్రుష్టించడమే వాదన కూడా దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తుంది. మహిళా పోలీసులు విధుల్లోకి చేరి అక్టోబరు 2 వస్తే సరిగ్గా రెండేళ్లు పూర్తవుతుంది. దానికి గుర్తుగా ప్రభుత్వం కూడా వీరికి పోలీసు డ్రెస్సుని కేటాయించింది. అలా కేటాయించిన డ్రెస్సుకి లైట్ బ్లూకలర్ కేప్ ఇవ్వడం ఇపుడు దేశంలో ప్రాధాన్యత సంతరించుకోగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని దేశాల చూపు ఆంధ్రప్రదేశ్ వైపునకు మళ్లింది. దేశంలోనే చరిత్ర స్రుష్టించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఇపుడు మహిళా పోలీసు విభాగం కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చర్చించుకునే స్థాయికి ఎదగటం నిజంగా శుభపరిణామం అంటున్నారు విశ్లేషకులు. దిశ చట్టం, పోలీసు స్టేషన్లు మరింత సమర్ధవంతంగా పనిచేసి మహిళలకు నూటికి నూరుశాతం రక్షణ కల్పిస్తే.. ఇదే వ్యవస్థ దేశవ్యాప్తంగా అమలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతకంటే ముందు ప్రపంచదేశాల మహిళా పోలీసుల నుంచి గౌరవం పొందడం కూడా ఇపుడు ప్రాధాన్యత సంతరించుకుంది.