ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు హోంశాఖ కేటాయించిన కాఖీ డ్రెస్సుని ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తయిన తరువాత ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. సాధారణ పోలీసులు మాదిరిగా ఖాకీ డ్రెస్సు ఉన్నా..వారికి కేటాయించిన కేప్ మాత్రం లైట్ స్కైబ్లూ కలర్ ఉండటంతో అందరికీ వీరంతా సచివాలయ మహిళా పోలీసులనే గుర్తింపు వచ్చేలా డిజిపి గౌతం సవాంగ్ ఈ యూనిఫాం ను డిజైన్ చేయించారు. ఇటీవలే రాష్ట్రంలోని మహిళా పోలీసులందరికీ ప్రభుత్వం కొత్తగా మొబైల్ ఫోన్లను కేటాయించింది. వాటి ద్వారా ట్రాఫిక్ చాలన్లు కూడా వీరే గ్రామస్థాయిలో వేస్తారని సమాచారం అందుతుంది. గ్రామ రక్షణతోపాటు, గ్రామస్థాయిలో ఫిర్యాదులు కూడా ఇక్కడి నుంచే స్వీకరించడంతోపాటు, అత్యవసర సమయంలో బాదితులను పోలీస్ స్టేషన్ కి పంపించే బాధ్యతను కూడా గ్రామసచివాలయ మహిళా పోలీసులే చేపట్టనున్నారట. వాస్తవానికి జీఓనెంబరు 59 ప్రకారం సచివాలయ మహిళా పోలీసులను పోలీస్ శాఖ ఉద్యోగులకుగా మార్చినా వారికి కానిస్టేబుల్స్ కి ఇచ్చే పేస్కేలు వర్తింపచేయలేదు. అదేవిధంగా బ్లూకలర్ కేప్ ని కూడా ఇవ్వలేదు. అంటే ఉద్యోగులు పోలీసుశాఖకు చెందినప్పటికీ వీరిని ప్రత్యేకంగానే గుర్తించాలని ప్రభుత్వం భావించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు గ్రామాల్లో ఏదైనా ప్రభుత్వ తరహా కార్యక్రమాలు జరిగితే దగ్గరల్లోని స్టేషన్ల నుంచి పోలీస్ కానిస్టేబుళ్లు బంధోబస్తు, ఇతర వ్యవహారాలు చూసే వారు. ఇకపై సచివాలయ మహిళా పోలీసులే అవన్నీ చూడనున్నారు. రానున్న రోజుల్లో మహిళా పోలీసుల పాత్ర రాష్ట్రవ్యాప్తంగా చాలా కీలకంగా మారనుందనడాని వీరికి కేటాయించిన ఖాకీ డ్రెస్సే సంకేతాలు ఇస్తుంది. అంతేకాదు ప్రభుత్వం నుంచి వచ్చే జిఓలు, సర్క్యులర్ లు కూడా మండల, సచివాలయ సిబ్బంది కూడా ఖచ్చితంగా అమలు చేసేలా వాటిని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి సైతం పంపుతున్నారు. ఆ సర్క్యులర్లు, ఆదేశాలు ఇకపై ప్రోటోకాల్ ప్రకారం జిల్లా ఎస్పీ కార్యాలయాల నుంచే మండల కార్యాలయాలకు అక్కడి నుంచి గ్రామసచివాలయాలకు రానున్నాయి. వచ్చిన ఆదేశాలు ఆ క్షణం నుంచే అమలు చేయాల్సిన బాధ్యత కూడా వుంటుంది. మహిళా పోలీసు వ్యవస్థ ద్వారా గ్రామ రక్షణతోపాటు, దిశయాప్ వినియోగం, దైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసే విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఒక్క ఖాకీ డ్రెస్సు చాలా కార్యకాలపాలకు శ్రీకారం చుట్టనున్నాయి.