గాంధి పుట్టిన దేశమా ఇది.. నెహ్రుకోరిన సంఘమా ఇది.. స్వామ్యవాదం, రామరాజ్యం సంభవించే కాలమా అన్నాడో సినీ కవి..ఆయన మాటలు ఏమో గానీ.. భారతదేశం మొత్తం తొంగి చూసే విధంగా గాంధీజీ కలలు గన్న స్వరాజ్యాన్ని స్థాపించడకం కోసం, గ్రామంలోనే అన్ని రకాల సేవలు అందించడం కోసం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మానస పుత్రికగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటై నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తిచేకుంది. దీనికి అంతా గర్వపడాలి. అదే సమయంలో ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ప్రకారం ఏ ఒక్క అధికారాలు ఇవ్వకుండా రెండేళ్లపాటు ఉత్తుత్తి ఉద్యోగులుగా, సాధారణ పనులే చేయిస్తున్నందుకు సిగ్గుపడాలి కూడా. ప్రభుత్వమే ఇచ్చిన జీఓ, ఇదే ప్రభుత్వం అమలు చేయలేదంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం మరొకటి ఉండదనే భావించాలి. ప్రభుత్వంలో జిఓ(గవర్నమెంట్ ఆర్ఢర్) అంటే ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. కానీ ఏపీ ప్రభుత్వంలో గ్రామసచివాలయాల్లో మాత్రం అది రెండేళ్లు పూర్తయినా అమలు కాలేదు. ఈ విషయంలో గ్రామ, వార్డు సచివాలయ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ కానీ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వివేది కానీ, కమిషనర్ గిరిజాశంకర్ లు గానీ ఈ జీఓని అమలు చేయలేకపోయారు. అంటే ఒకరకంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఆశయాలకు ఈరెండు ప్రభుత్వశాఖలు సాధ్యమైనంతగా కష్టపడి గాలీ తీసేస్తున్నట్టే లెక్క. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రభుత్వం ఏం చేసినా జీఓల ప్రకారంమే, జీఓలతోనే చేస్తుందని పదే పదే చెప్పే మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు ఈ జీవో నెంబరు 149 విషయంలో చేతులెత్తేశారంటే లోపం ఎక్కడుందో ప్రభుత్వమే ఆలోచన చేసుకోవాలి. పంచాయతీరాజ్ శాఖలో గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 కార్యదర్శిల వరకూ అమలైన జీఓ ఒక్క గ్రేడ్-5 కార్యదర్శిలకు మాత్రం ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రజలకు సేవచేసేందుకు గ్రామసచివాలయానికో కార్యదర్శిని నియమించిన ప్రభుత్వం వారికి అధికారాలు, విధులు, నిధులు, పరిధులు కేటాయించకపోతే వాళ్లు ఎలా పనిచేస్తారో ప్రభుత్వంలోని పెద్దలకు, ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదేశాఖ అధికారులు తెలియజేయాలి కూడా..అలా అన్నప్పుడు ఇలాంటి జీఓలన్నీ అమలు చేయాల్సిన బాధ్య పంచాయతీరాజ్ శాఖలోని ముఖ్యకార్యదర్శిదే. ఆయనే దానిని పక్కనపెట్టేశారు.
ఈవిషయం అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయం, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్, ముఖ్యకార్యదర్శిల ద్రుష్టికి ఈఎన్ఎస్ నేషల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net గత రెండేళ్లుగా తీసుకెళుతూనే ఉంది. కానీ ఫలితం శూన్యం. రోజూ తిని భోజనమే ఒక రోజు మానేస్తే శరీరంలో ఏదో తెలియని లోపం, వెలితీ కనిపిస్తుంది. అలాంటిది ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు సేవలు అందించడానికి అధికారాలుఇవ్వకపోయినా అవే లోపాలు, సేవల్లో జాప్యాలు, ప్రజలకు ఆయా సచివాలయా పరిధిలో న్యాయం చేయలేకపోయిన అంశాలు కనిపించాయి. గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేసిన ఘనకార్యాన్ని కీర్తిస్తూ.. అదే సమయంలో ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు చేయకుండా ఉండేందుకు ఇదే ప్రభుత్వంలోని మంత్రులు, సీనియర్ ఐఏఎస్ లు చేసిన లోపాలు గుర్తు చేస్తూ ఈ ప్రత్యేక కధనం ద్వారా గాంధీజయంతి రోజున మరోసారి గుర్తుచేస్తున్నాం. చాలా గ్రామపంచాయతీల్లో కార్యదర్శిల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం పనిచేస్తున్న గ్రేడ్-1 నుంచి 4 వరకూ కార్యదర్శిలు ఇన్చార్జి బాధ్యతలు టంచనుగా అప్పగించి.. పనిచేస్తున్న పంచాయతీల్లో పూర్తిస్థాయిలో పనులు చేయకుండా..అటు ఇన్చార్జి పంచాయతీల్లో పనులు, సేవలు అందించడానికి వీలు లేకుండా చేస్తున్న అధికారులు గ్రేడ్-5 కార్యదర్శిలకు మాత్రం జీఓనెంబరు 149 ద్వారా అధికారాలు, దస్త్రాలు నేటి వరకూ కేటాయించలేదు. అదేమంటే ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు. ఈ విషయంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కలెక్టర్లు సైతం ఇదే విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లా దీనిపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ లు స్పందించలేదు. అంతేకాదు ఈ విషయంలో ఈఎన్ఎస్ ప్రత్యేకంగా వారిని సంప్రదించాలని సుమారు 100పైగా ఫోన్ కాల్స్, 50కి పైగా మెసేజులు, మరో 80కి పైగా వాట్సప్ మెసేజులు, ఆపై జీఓనెంబరు 149 అమలుకాకపోవడం వలన ప్రజలకు సేవలు అందడం లేదని ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ద్వారా ప్రచురిచించ కధనాలను షేర్ చేసినప్పటికీ ఒక్క సమాధానం కూడా రాలేదు. ఈ వార్త రాయడానికి గంట ముందు కూడా ఇద్దరు అధికారులను ఇదే విషయమై సంప్రదించినా ఫలితం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది..ముఖ్యమంత్రి మంచివాడైతే రాష్ట్రం శుభిక్షంగా వుంటుంది.. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పడం కోసం లక్షా 35ఉద్యోగాలు కొత్తగా స్రుష్టించి, కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త సచివాలయ భవనాలు నిర్మించి, 750పైకా సర్వీసులు సచివాలయాల్లోనే అందుబాటులోకి తెచ్చిన సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని ప్రధాని మంత్రి నరేంద్రమోడీ సైతం కీర్తించారు.. అంతటి కీర్తికి పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర అధికారులు కనీసం అక్కడ విధులు నిర్వహించే గ్రేడ్-5 కార్యదర్శిలకు ప్రభుత్వమే విడుదల చేసిన జీఓనెంబరు 149ని అమలు చేయకుండా, అధికారాలు ఇవ్వకుండా ఈ రెండేళ్లు పనిచేయిందంటే ప్రభుత్వ ఆశయానికి అధికారులు ఏ స్థాయిలో గండి కొడుతున్నారో ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ మరోకటి ఉండదు. ప్రభుత్వం నియమించిన అధికారికి విధులు, నిధులు, అధికారాలు ఇవ్వకపోతే ప్రజలకు ఏవిధంగా సేవలు అందిస్తారనే కనీస సాంకేతక కారణం కూడా ఆలోచించకుండా ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ లు ఈ విషయంలోనే వ్యహరించారు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు.. ఇప్పటికైనా ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వారా ఈజీఓనెంబరు 149 ఇప్పటికైనా అమలు చేయకపోతే..గ్రేడ్-5 కార్యదర్శిల నుంచి ప్రభుత్వానికి వచ్చే మద్దతు పూర్తిగా పోయే ప్రమాదాలున్నాయి. ఇప్పటికే ఈ విషయమై సచివాలయ ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున చర్చజరుగుతుంది. మేకుంటే శుభిక్షం..లేదంటే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా మొదలయ్యే ప్రమాదముంది. అదీ కేవలం పంచాయతీరాజ్ శాఖ అధికారులు సచివాలయ ఉద్యోగులకు ఇవ్వని అధికారాలు, ప్రోత్సాహం వలనే..ఈ గాంధీ జయంతి రోజు తర్వాతనైనా ప్రభుత్వంలోని గ్రామ,వార్డు సచివాలయ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ లు మేల్కుంటారేమో చూడాలి..!