ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం..
Ens Balu
3
Tadepalli
2021-10-13 16:18:50
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రశాంత్ కుమార్ మిశ్రా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ , పలువురు హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. అనంతరం సిజెకి సీఎంతో పాటు మంత్రులు కూడా పుష్ఫగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు.