సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోతలు..
Ens Balu
2
Tadepalli
2021-10-23 07:11:01
అవును గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోత మొదలైంది.. దానికి బయో మెట్రిక్ హాజరు, సెలవులు, ప్రభుత్వమే జీఓ ద్వారా ఇచ్చిన సెలవులను కూడా కలిపేసి జీతాల్లో కోత విధిస్తున్నట్టు ఉద్యోగుల సీఎఫ్ఎంఎస్ ఐడీ జాబితాలను ఉద్యోగులకు చరవాణిలకు పంపింది ప్రభుత్వం. రోజుకో కొత్త నిబంధన తెరపైకి తెస్తున్న ప్రభుత్వం కొత్తగా బయోమెట్రిక్ ను జీతాల కోతకు కారణంగా చూపింది. ఇదే సమయంలో సెలవురోజుల్లో పనిచేసిన పనిని సైతం గుర్తించకపోగా.. బయో మెట్రిక్ మిషన్లు పనిచేయని తప్పుకి కూడా ఉద్యోగులనే బాధ్యులను చేసింది. ఫలితంగా ఇచ్చే రూ.15వేలు జీతంలో ఒక్కో ఉద్యోగికి ఒక్కో విధంగా జీతం కోత విధించింది ప్రభుత్వం. ప్రస్తుతం వారి జీతం కోత జాబితాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఆది నుంచి చెబుతూనే ఉంది బయో మెట్రిక్ హాజరు లేకపోతే జీతాల్లో కోత విధిస్తామని.. చెప్పినట్టుగానే అక్టోబరు మాసం నుంచే దానిని అమల్లోకి తీసుకు వచ్చింది. ప్రభుత్వమే ఇచ్చిన సెలవులకి, చేసిన పనికీ కూడా జీతాల్లో కోత విధిస్తారని.. తమ జీతంలో కోత పడినట్టు సమాచారం వస్తే తప్పా తమకి తెలియలేనది సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. గ్రామసచివాలయాలు ఏర్పాటై అక్టోబరు 2 నాటికి రెండేళ్లు పూర్తి అయ్యాయి. ఈ ప్రొబేషన్ పీరియడ్ తరువాత ఉద్యోగులందరినీ సర్వీసు నిబంధనలు అనుసరించి రెగ్యులర్ చేయాల్సి వుంది. ఆ సమయంలోనే వారికి ఖచ్చితంగా విధులకు వచ్చి బయోమెట్రిక్ హాజరు వేస్తేనే జీతం ఇస్తాం.. లేదంటే కోతవిధిస్తామనే భయాన్ని తెలియజేసింది. ఒక్క గ్రామసచివాలయ ఉద్యోగులకే కాకుండా గ్రామపంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తింపజేసింది ప్రభుత్వం. దీనితో అక్టోబరు మాసం జీతాల్లో ఒక్కో ఉద్యోగికి రూ.800, 1500, 2500 చొప్పున జీతాల్లో కోత పడినట్టుగా ఉద్యోగుల చరవాణీలకు సమాచారం రావడంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. విధులకు వచ్చి పనిచేసినా జీతాల్లో కోత విధించడమేంటని తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ఉద్యోగులకు కల్పించిన సెలవులు వినియోగించుకున్నవారికి కూడా జీతాల్లో కోతవిధించడం విశేషం. చాలా మంది సచివాలయ ఉద్యోగులు విధి నిర్వహణ పూర్తయిన తరువాత సాయంత్రం 5గంటలకు బయో మెట్రిక్ వేయాల్సి వుంది. ఆ సమయంలో సర్వర్లు పనిచేయక బయో మెట్రిక్ పనిచేయని తప్పకి కూడా ఉద్యోగులే మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఏ రోజు అయితే బయో మెట్రిక్ పనిచేయలేదో ఆ విషయాన్ని బయోమెట్రిక్ మిషన్ ను మొబైల్ ఫోన్లలో స్క్రీన్ షాట్లు తీసి, ఫోటోలు తీసి అధికారులకు సామాజిక మాద్యమాల్లోనూ, రికార్డుల్లో నమోదు చేసినప్పటికీ వాటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. కాగా ప్రొబేషన్ పూర్తయి సర్వీసు రెగ్యులర్ అవుతున్న సమయంలో ఉద్యోగులకు విధినిర్వహణ ఖచ్చితత్వం గురించి తెలయాలని, ప్రభుత్వ ఆదేశాలు ఏ స్థాయిలో అమలు జరుగుతాయో తెలియడం కోసమే ఈ బయోమెట్రిక్ హాజరు నిబందనను అమలు చేసి చూపించినట్టుగా ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే జీతాల్లో కోత విధించినట్టుగా వచ్చిన జాబితాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా..లేదంటే ఉద్యోగులు అధికారుల ద్వారా సమస్యను తెలియజేసిన విధంగా వార్ణింగ్ గా చూపించి రూ.15వేలు జీతం పూర్తిగా ఇస్తుందా అనేది దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. కాగా అటు అధికారులు మాత్రం ముందుగా చేసిన హెచ్చరిక మేరకే జీతాల్లో కోత విధించినట్టుగా చెబుతున్నారు. ఇక్కడ మరో మెలిక ఏంటంటే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల బిల్లులు ప్రతీ నెలా 25వ తేదీన ఆన్ లైన్ చేస్తారు. కానీ ఉద్యోగుల జీతాల్లో కోత పడినట్టుగా 22వ తేదీనే ఉద్యోగుల సెల్ ఫోన్లకు సమాచారం రావడం విశేషం. దానిని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు మండల, జిల్లా, రాష్ట్ర అధికారుల ద్రుష్టికి సైతం తీసుకెళ్లేలా చేసింది. మొదలైన ఈ బయోమెట్రిక్ జీతాల కోతను సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా కొనసాగిస్తుందా..లేదంటే ఉద్యోగులకు ఒక అవకాశం ఇస్తుందా అనేది తేలాల్సి వుంది..చూడాలి ఏం జరుగుతుందో..!