1 ENS Live Breaking News

2020-10-21 14:21:03

ఇక మనకూ దేశీయ నౌక పర్యవేక్షణ వ్యవస్థ..

దేశీయంగా ఉత్ప‌త్తి చేసిన నౌకా ట్రాఫిక్ సేవ‌లు (‌Vessel Traffic Services (VTS)), నౌక‌ల ట్రాఫిక్ ను ప‌ర్య‌వేక్షించే వ్య‌వ‌స్థ‌ల‌ను (Vessels Traffic Management Systems‌)  సాఫ్ట్‌వేర్ సొల్యుష‌న్‌ను మంగ‌ళ‌వారం న్యూఢిల్లీలో కేంద్ర నౌకాయాన స‌హాయ మంత్రి (ఇన్‌ఛార్జి) మ‌న్‌సుఖ్ మాండ‌వీయ ఇ- మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు. భార‌తీయ ఓడ రేవుల‌లో ట్రాఫిక్ నిర్వ‌హ‌ణ కోసం విదేశాల‌లో చేసిన ఖ‌రీదైన సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్లుకు బ‌దులుగా మ‌న అవ‌స‌రాల‌కు త‌గిన దేశీయ వ్య‌వ‌స్థ‌ల అభివృద్ధి కోసం కృషి చేయాల‌ని త‌న ప్రారంభోప‌న్యాసం మంత్రి మాండ‌వీయ చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ దార్శ‌నిక‌త‌తో మిళిత‌మై,  మేడిన్ ఇండియా విటిఎస్‌, విటిఎంఎస్ సాఫ్ట్  వేర్‌లు నౌకా ట్రాఫిక్ నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌పంచం కోసం త‌యారు చేసే మార్గాన్ని సుగ‌మం చేస్తాయ‌ని మాండ‌వీయ వివరించారు. నౌక‌ల స్థానాలు, ఇత‌ర ట్రాఫిక్ ప్రాంతం లేక వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌మాద హెచ్చ‌రిక‌లతో పాటు ఒక ఓడ‌రేవులో లేక జ‌ల‌మార్గంలో విస్త్ర‌తంగా ట్రాఫిక్‌ను నిర్వ‌హించేందుకు విటిఎస్‌, విటిఎంఎస్ సాఫ్ట్ వేర్ నిర్ధారిస్తుందన్నారు. స‌ముద్రంలో జీవ‌న భ‌ద్ర‌త‌కు, స‌ముద్రయాన నిర్వ‌హ‌ణ భ‌ద్ర‌త‌, సామ‌ర్ధ్యానికి, స‌ముద్ర ప‌ర్యావ‌ర‌ణ భ‌ద్ర‌త‌తో పాటు, చుట్టు ప‌క్క‌ల గ‌ల తీర ప్రాంతాలు, ఆఫ్‌షోర్ స్థావ‌రాలు, క‌ర్మాగార‌ల‌ను నౌకాయాన ర‌ద్దీ చెడు ప్ర‌భావాల నుంచి కాపాడేందుకు విటిఎస్ ఎంతో దోహ‌దం చేస్తుందన్న మంత్రి  విటిఎంఎస్‌ల‌ను ప్ర‌పంచంలోనే అతి ర‌ద్దీగా ఉండే జ‌లాల‌లో ఏర్పాటు చేసుకోవచ్చున్నారు. అవి సుర‌క్షిత‌మైన నౌకాయానానికి, మ‌రింత స‌మ‌ర్ధ‌వంత‌మైన ట్రాఫిక్ ప్ర‌వాహానికి, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు విలువైన స‌హ‌కారాన్ని అందిస్తాయని, స‌మీప మార్గాల‌లో బిజీగా ఉండే ట్రాఫిక్ ప్ర‌వాహం, మార్గాల‌ను, ఓడ‌రేవుల‌ను అందుబాటులోకి తెచ్చుకొని, ఓడ‌రేవు, దాని వినియోగ‌దారుల ఉత్త‌మ ప్ర‌యోజ‌నాల కోసం సుర‌క్షితంగా స‌మ‌న్వ‌యం చేసుకోవ‌చ్చునన్నారు.  జలాల్లో జ‌రిగే ప్ర‌మాదాల‌ను, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల త్వ‌రితంగా ప‌రిష్క‌రించుకోడంతో పాటు ట్రాఫిక్ క‌ద‌లిక‌ల‌కు సంబంధించిన డాటాను స్టోర్ చేసి, ఓడ‌రేవు అధికారులు, పాల‌నా యంత్రాంగం, కోస్ట్‌గార్డ్ లు, సెర్చ్ అండ్ రెస్క్యూ సేవ‌ల బృందాలు సూచ‌న స‌మాచారంగా వినియోగించుకోవ‌డానికి ఈ వీటిఎస్ ఎంతో దోహదపడుతుందని స్పష్టం చేశారు..

New Delhi

2020-10-20 17:27:27

టీవోటీ మూడో దశకు రూ.5,011 కోట్ల విడుదల..

ఉత్తరప్రదేశ్‌, ఝార్ఖండ్‌, బిహార్‌, తమిళనాడులో 9 టోల్‌ కేంద్రాలున్న టీవోటీ (టోల్‌-ఆపరేట్‌-ట్రాన్స్‌ఫర్‌) మూడో దశ (566 కి.మీ.)కు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అనుమతినిచ్చిందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి  నితిన్‌ గడ్కరీ చెప్పారు. ఈ మేరకు సహాయ మంత్రి  వి.కె.సింగ్‌, ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌  ఎస్‌.ఎస్‌.సంధు, హెన్‌హెచ్‌ఏఐ, క్యూబ్‌ హైవేస్‌ సభ్యులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గట్కరీ మాట్లాడు, సంస్థ క్యూబ్‌ మొబిలిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (క్యూబ్‌ హైవేస్‌)కు ఈ ప్రాజెక్టును అప్పగించిందన్న మంత్రి ఇందుకుగాను, రూ.5011 కోట్లను ముందస్తుగా పొందిందని వివరించారు.  ప్రస్తుత ప్రాజెక్టు రాయితీ కాలం 30 ఏళ్లు. ఈ వ్యవధిలో టోల్ కార్యకలాపాలు, నిర్వహణ, వసూళ్లను క్యూబ్‌ హైవేస్‌ చేపడుతుంన్నారు. టీవోటీ పద్ధతిలో ఇచ్చిన రెండో అనుమతిగా మంత్రి వివరించారు. మొదటి అనుమతిగా, 10 టోల్‌ కేంద్రాలున్న 681 కి.మీ. ప్రాజెక్టును ఎంఏఐఎఫ్‌ సంస్థకు 2018లో ఎన్‌హెచ్‌ఏఐ అప్పగించింని, ఇందుకుగాను, రూ.9,681.5 కోట్లను ముందస్తుగా పొందిందని చెప్పారు. పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా నిధుల ఆర్జన కోసం, టీవోటీ పద్ధతిలో మరిన్ని విస్తరణలు అప్పగించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు చేపట్టిందని మంత్రివివరించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో  సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

New Delhi

2020-10-20 12:38:53

2020-10-20 12:08:04

2020-10-19 21:25:05

2020-10-19 21:24:01

2020-10-19 21:22:12

సర్వభూపాల వాహ‌నంపై ఉట్టి కృష్ణుడిగా..

శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమ‌వారం రాత్రి 7.00 గంట‌ల‌కు శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. కాగా బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం 9 గంటలకు మోహినీ అవతారం, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీవారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు  వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, డా.నిశ్చిత‌, శ్రీ చిప్ప‌గిరి ప్ర‌సాద్‌,  గోవింద‌హ‌రి,  డిపి.అనంత‌,  కుమార‌గురు,  ర‌మేష్‌‌ శెట్టి,  దుస్మంత కుమార్ దాస్‌, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్  ర‌మేష్‌రెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-10-19 21:12:21

2020-10-19 12:55:56

2020-10-18 21:06:50