1 ENS Live Breaking News

దేశ సరిహద్దుకి సైనికులు.. సమాజానికి జర్నలిస్టులే రక్షణ..?!

దేశ రక్షణకు సరిహద్దుల్లో భారత సైనికులు.. సమాజాన్ని తమ వార్తలతో మేల్కొలపడానికి వర్కింగ్ జర్నలిస్టులు లేకపోతే ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. పాకిస్తాన్ లాంటి దాయాది దేశాలు గుంటనక్కల్లా దేశంపై దాడి చేసిన సమయంలో భారత సైన్యం వారిని సునాయాశంగా తిప్పికొట్టింది. ఆ విషయాన్ని యావత్ మీడియా బాహ్య ప్రపంచానికి తెలియజేసింది. అంటే ప్రపంచంలో ఏ మూలన ఏం  జరుగుతున్నా తాజా సమాచారాన్ని సేకరించి దానిని ప్రపంచానికి తెలియజేసేది కేవలం జర్నలిస్టు మాత్రమే. సొసైటీలో ఫోర్త్ పిల్లర్ గా ఉన్న జర్నలిస్టులు వహించే నైతిక బాధ్యత, దేశ సంరక్షణ సైనికులతోపాటు సమానంగా జర్నలిస్టులూ చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా సరిద్దుల్లో చొరబాటు దారులకు భారత సైనికులు సింహ స్వప్నమైతే.. సమాజంలో అవినీతి పరులకు మీడియా, జర్నలిస్టులంటే భయం వణుకు. జర్నలిస్టు లేకపోతే అత్యంత భారీ కుంభకోణం భోఫోర్స్, టుజీ స్కాములు బయటకి వచ్చే పరిస్థితి ఉండేదా..? సరిహద్దుల్లో భారత సైనికులు వీరోచితంగా పోరాడకపోతే పాకిస్తాన్ డ్రోన్ వ్యవస్థను ఇండియన్ ఆర్మీ తుక్కు తుక్కుగా నాశనం చేయగలిగేదా..? అవన్నీఊహలకే అందని వాస్తవాలు. 

నేడు దేశ ప్రజలు గుండెలపై చేయి వేసుకొని ప్రశాంతంగా నిదురపోగలుగుతున్నారంటే గణన తలంలో వాయుసే.. సముద్రంపై నౌకసే.. నేలపై ఆర్మీ ఇలా త్రివిధ దళాలు కంటిమీద కునుకు లేకుండా దేశానికి రక్షణ వలయంగా కాపుకాస్తున్నాయి. వీరి విజయగాధలను వీరోచిత యుద్దాలను, త్రిప్పికొట్టే దాడులను బాహ్య ప్రపంచానికి తెలియజేసేది కేవలం జర్నలిస్టులు మాత్రమే. భారత దేశ ఆయుధ సంపత్తి, శక్తి సామర్ధ్యాలు, సైనిక బలం, అత్యాధునిక టెక్నాలజీ ఇలా సమస్త వివరాలు ప్రపంచ దేశాలకు తెలియడానికి ఒకే ఒక్క కారణం జర్నలిస్టు. సైనికుడు తుపాకీతో దేశానికి పహారా కాస్తే.. జర్నలిస్టులు తన పదునైన కలంతో సమాజానికి రక్షణ వలయంగా నిలుస్తున్నాడు. ప్రభుత్వాలు నడిపేది పాలకులైతే.. వారు ఎలా ప్రభుత్వాన్ని నడుపుతున్నారో ప్రజలకు తెలియజేసది మాత్రం వర్కింగ్ జర్నలిస్టులు. విచిత్రం ఏంటంటే దేశ రక్షణకు పాటు పడిన సైనికుడితో సమానంగా గౌరవం ఉన్నా నేటికీ 70శాతం మంది జర్నలిస్టులకు నేటి సమాజంలో రక్షణ లేకుండా పోతున్నది. దేశ సరిహద్దుల్లో సైనికులతోపాటు యుద్దాలను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులు కూడా అసువులు బాసిన సందర్భాలు ఉన్నాయి. 

బయట వాస్తవాలను తెలియజేస్తున్నందుకు దుండగులు జర్నలిస్టులపై చేస్తున్న దాడులు ఎక్కువైపోయాయి. సైనికులకు ప్రభుత్వం జీతం ఇస్తున్నట్టుగా మీడియా యాజమాన్యాలుు మాత్రం జర్నలిస్టులకు అంతగా జీతాలు ఇవ్వడం లేదు. కొందరు జర్నలిస్టులు పస్తులుండి కూడా సమాజకోసం పనిచేస్తున్న సందర్భాలూ లేకపోలేదు. రాను రాను ఉద్యోగ భద్రతలేని మీడియా రంగంలోకి రావడానికి యువత వెనుకడుగు వేస్తున్నారు. అందునా సోషల్ మీడియా ప్రాభవం బాగా పెరిగిపోవడం కూడా దీనికి కారణం అవుతున్నది. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న మీడియా సంస్థలు..అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జర్నలిస్టులకు తగ్గుతున్న ఆదరణ కూడా దానికి కారణం అవుతున్నాయి. అలాగని అన్ని మీడియా సంస్థల పరిస్థితీ ఒకేలా ఉందని అనుకోవడానికీ లేదు. ప్రభుత్వాలకి అనుకూలంగా, కుల బలం ఉన్న మీడియా పరిస్థితి ఒకలా ఉంటే విలువలు, ప్రజలు, సమాజం దేశం కోసం ఆలోచించి పనిచేస్తున్న మీడియా సంస్థల పరిస్థితి మరో ఉంటోంది. దేశంలో గూఢచార సంస్థలు చేసే స్ట్రింగ్ ఆపరేషన్ల కంటే పది రెట్ట నెట్వర్క్ తో సేకరించిన సమాచారాన్ని జర్నలిస్టులు మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేయగలుగుతున్నారు. 

ఇంతచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వాలు ఇచ్చే గుర్తింపు కార్డు(అక్రిడిటేషన్లకు) ఎక్కడా లేని నిబంధనలు పెట్టి మీడియాను నియంత్రించే చర్యలకు ప్రభుత్వాలు పూనుకోవడం దారుణం. కనీసం జర్నలిస్టులకోసం పలా సంక్షేమ పథకం ఉందని చెప్పడానికి కూడా ఒక్క పథకం కూడా లేకపోవడం మరింత దారుణం. జర్నలిస్టులు లేకపోతే పరిస్థితి తలకిందులవుతుందని తెలిసినా కూడా  ప్రభుత్వాలు కఠిన చర్యలు అవలంభిస్తున్నాయి. అయినా మొక్కవోని దీక్షతో జర్నలిస్టులు పనిచేస్తూనే ఉన్నారు. కొన్ని మీడియా సంస్థలు విలువలకు కట్టుబడి అదే ప్రభుత్వాల కోసం పనిచేస్తున్నారు. ప్రభుత్వాలు చేసే సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జర్నలిస్టులు ఉపయోపడిన దానిలో దశమభాగం మీడియాకి ప్రభుత్వాలు ఉపయోగ పడటం లేదనేది వాస్తం. సమాజంలో ఫోర్త్ పిల్లర్ గా, కలం అనే ఆయుధంతో సమాజానికి కాపలా  కాస్తున్న జర్నలిస్టులను పరిస్థితి మారాలి. వారి ఆర్ధిక అభివృద్ధి జరగాలి. కూడు, గూడు విషయంలో ప్రభుత్వం నుంచి సహకారం అందాలి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు జర్నలిస్టులను గుర్తించాలి. 

జర్నలిస్టులు కూడా మనుషులే వారికంటూ ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వాల్లో రావాలి. సమాజాన్ని మేల్కొలపడానికి జీవితాలను ధారపోస్తున్న జర్నలిస్టుకు వారి చివరి రోజుల్లోనైనా కనీసం కొద్దిపాటి పెన్షన్ సౌకర్యం కల్పించి ఆదుకుంటే.. మీడియా రంగంలోకి కూడా కొత్త రక్తం రావడానికి ఆస్కారం వుంటుంది. లేదంటే రానున్న రోజుల్లో పూర్తిగా మీడియా ప్రజలను పాలిస్తున్న పాలకులే వారి సొంత సిబ్బందితో నడుపుకోవాలి.. ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చేసింది. అది నిజంగా దేశానికి కూడా ప్రమాదం. ఈ విషయాన్ని పాలకులు గుర్తించాలి. దేశ రక్షణకు సైనికులు ఎంత అవసరమో సమాజ రక్షణకు జర్నలిస్టులూ అంతే అవసరమని ప్రభుత్వాలు గుర్తించాలి. దేశ సరిహద్దుల్లో కంటిమీద కునుకు లేకుండా పహారా కాస్తున్న భారత సైనికులూ మీకు వందనాలు.. సమాజాన్ని తమ వార్తలతో చైతన్యం తీసుకువస్తున్న  వర్కింగ్ జర్నలిస్టులూ మీకు జేజేలు. జర్నలిజం వర్థిల్లాలి..!

visakhapatnam

2025-07-11 04:40:13

జర్నలిస్టు పనిచేయని సమాజాన్ని ఒక్కసారి ఊహించగలమా.. కానీ..?!

సమాజంలో మీడియాని, జర్నలిస్టులను ఫోర్త్ పిల్లర్ అంటారు కదా.. అలాంటి జర్నలిస్టు పనిచేయకపోతే ఏమైనా అవుతుందా..? ఒక్కసారి ఆలోచించి చూడండి. వాస్తవానికి సమాజానికి జర్నలిస్టు నిజంగా ఒక దిక్సూచి.. సమాచార సారధి.. పొలిటికల్ డిఫెండర్.. పీలపు ల్ లెజండర్..అవును మీరు చదువుతున్నది అక్షర సత్యం. జర్నలిస్టు అనే వాడు ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజు పనిచేయడం మానేస్తే వ్యవస్థలు మొత్తం తలకిందులైపోతాయి. మీరు అనుకోవచ్చు.. సోషల్ మీడియా ఉంది కదా అని. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు, డిజైన్ చేసిన యాడ్స్ మాత్రమే షేర్ చేసుకోవడానికి వీలుపడుతుంది కానీ ఒక విషయాన్ని సవివరంగా తెలియజేసే పరిస్థితి ఉండదు. మీకు ఈ ఒక్క ఉదాహరణ చాలు.. నిజంగా ఈ లైన్ చదివిన తరువాత మీకు నవ్వు రాకపోతే మీలోనూ ఏదో లోపమున్నట్టుగానే భావించుకోండి. అలాంటి సమాచారమే అన్ని విషయాల్లోనూ వస్తే సమాజం పరిస్థితి ఏంటో కూడా మీరే అర్ధం చేసుకోండి.. అదేమిటో ఒక్కసారి ఈ లైన్ చదవండి.. శ్రీశ్రీశ్రీ మా ఎమ్మెల్యేగారు పలాన పార్టీ కార్యకర్త ఇంటికి వాళ్ల అమ్మాయి పెద్దమనిషి ఫంక్షన్ కి వెళ్లి.. ఆయన చేతులు మీదుగా  అమ్మాయి తలపై అక్షింతలు వేశారు..భోజనాల్లో కూర్చొని భోజనం చేసి వచ్చారు. 

ఈ కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గారితోపాటు.. ఆ సారూ(గార్లు, బూర్లు, అప్పడాలు, వడలు) ఈసారూ ఈసారు పాల్గొన్నారు.. యటకారం కాకపోతే ప్రతీ దానికి ఈ పదమే వాడతారు అదేంటో విచిత్రంగా.. చేతులు మీదుగా అక్షింతలు వేయకపోతే కాళ్లతో వేస్తారటండీ.. మా మంత్రిగారు తన కాళ్లపై తానే నిలబడ్డారు.. కంటితోనే చూశారు.. గు..తోనే పి...త్తా..రు.. ఏంటి పదాల సంబోధన. సోషల్ మీడియాలో వచ్చే విషయం ఈ విధంగానే ఉంటుంది మరి.. అదే జర్నలిస్టు ఒక వార్త రాస్తే.. పార్టీ కార్యకర్త ఇంట్లో శుభకార్యానికి వెళ్లి స్వయంగా దీవించిన వచ్చిన ఎమ్మెల్యే అని రాస్తాడు. ఈ పదాల అల్లికకు.. సోషల్ మీడియాలో వచ్చే పదాల అమరికకు ఎంత తేడా ఉందో ఒక్కసారి మనం బాగా ఆలోచించుకోవాలి. ఇది కేవలం ఉదాహరణకు మాత్రమే. ఇకపోతే ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా సమాచారం వచ్చేది కేవలం జర్నలిస్టుకి మాత్రమే. ఆ జర్నలిస్టు సమాచారం వార్తల రూపంలో అందించకపోతే ప్రభుత్వాలు, ప్రజలు, ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏ విధంగా వుంటుందో  ఆలోచిస్తేనే రకరకాలుగా ఉంటుంది. కాకపోతే ఏ మీడియాలోనూ జర్నలిస్టులు పనిచేయకుండా ఉండలేదు నేటి వరకూ.. అంతెందుకు ఏడాదిలో మూడు రోజులు పత్రికలకి సెలవులు వస్తేనే మనకి తెలియకుండా బయట ఏం జరిగిపోయిందోననే ఆందోళన.

 మానసిక సంఘర్షణ. వెంటనే సెల్ ఫోనులో వెతుకులా.  కాకపోతే నేడు ప్రసార మాద్యమాలు వచ్చిన తరువాత పత్రికలకు కాస్త డిమాండ్ తగ్గింది. లేదంటే ఎక్కడో విజయవాడలోని ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింటింగ్ అయ్యే పత్రిక మరుసటి రోజు సాయంత్రానికి విశాఖపట్నం వస్తే గాని పేపర్ లో ఏం వచ్చేదో ఎవరికీ తెలిసే పరిస్థితి ఉండేది కాదు ఒకపుడు. కానీ నేడు సమాచార విప్లవం తెచ్చిన స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా పుణ్యమాని మీడియా అవసరం చాలా వరకూ లేకుండానే పోతుంది. ఎంత టెక్నాలజీ వచ్చినా, సోషల్ మీడియా ఎంత అభివృద్ధి చెందినా ఎక్కడైనా.. ఎప్పుడై.. ఎవరికోసమైనా వార్త రాయాల్సింది మాత్రం జర్నలిస్టే. చాలా మందికి ఈ ముఖ్యమై సాంకేతిక కారణం తెలియదు. మీడియా లేకపోతే సోషల్ మీడియా ఉందనుకుంటారు తప్పితే అక్కడే స్క్రిప్ట్ రాసేది ఒక జర్నలిస్టు మాత్రమేనని గుర్తించడం లేదు.  విషయం సేకరించాలన్నా జర్నలిస్టు.. దానిని వార్తగా రాయాలన్నా జర్నలిస్టు.. ప్రశ్నించాలన్నా జర్నలిస్టు.. ప్రజాప్రతినిధి చేసిన మంచిని ప్రజలకు తెలియజేయాలన్నా జర్నలిస్టు.. ప్రభుత్వం కోసం ప్రజలకు వివరించాలన్నా జర్నలిస్టు.. సంక్షేమ పథకం వివరాలు తెలియజేయాలన్నా జర్నలిస్టు.. ఒక అవినీతి అధికారి లంచావతారాన్ని బయటపెట్టాలన్నా జర్నలిస్టు.. ప్రజలకు చక్కటి వైద్యం అందించే వైద్యుల సేవలను కొనియాడుతూ కీర్తించి రాయాలన్నా జర్నలిస్టు.. ప్రభుత్వానికి మందుబాబులే ఆదాయాన్ని పెద్ద మొత్తంలో సమకూర్చి పెడుతున్నారనే విషయాన్ని తెలియజేయాలన్నా కూడా జర్నలిస్టు మాత్రమే.. అందుకే మీడియా.. అందులో పనిచేసే జర్నలిస్టుకి అంత విలువ. 

అదే నేడు సమాజంలో ఫోర్త్ పిల్లర్ గా జర్నలిస్టుకి ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆడదాని వలన రాజ్యాలే కూలిపోయాయన్నది ఒకప్పటి మాట. నేడు జర్నలిస్టులు లేకపోతే సమాజమే మూగబోతుంది.. ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోతాయన్నిది నేటి మాట. జర్నలిస్టుకోసం తెలియవారు చులకనగా చూసినా.. చదువుకొని, లోకం తీరును ఒడిసి పట్టే వారికి మాత్రం జర్నలిస్టు అంటే ఏంటో.. మీడియా విలువ ఏంటో తెలుసును కాబట్టే ఇంకా జర్నలిస్టుకి గౌరవం.. కాస్తో కూస్తో విలువలు ఉన్నాయి. లేదంటే మీడియా, జర్నలిస్టులు ఎప్పుడో కనుమరుగు అయ్యేవారు. సాధారణంగా మనం ఆహారం లేకపోతే ఉండలేం. కానీ జర్నలిస్టుకి వార్తల లేకపోతే ఉండలేదు. ఆకలితో పస్తులైనా ఉంటాడు గానీ.. సమయానికి వార్తలు అందించి సమాజాన్ని మేల్కొలపడంలో మాత్రం జర్నలిస్టు ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇప్పుడు చెప్పండి అలాంటి జర్నలిస్టు లేని సమాజాన్ని ఊహించుకోగలమా.. అది జరుగుతుందా..? అందుకే ఈరోజు వార్త యందు జగము వర్ధిల్లుతున్నది. జై జర్నలిం.. జై జై జర్నలిస్టు.. జిందాబాద్ జర్నలిస్టు..లాంగ్ లివింగ్ మీడియా..!

visakhapatnam

2025-07-10 07:02:37

డేంజర్ బెల్స్... మీడియాకి పోటీగా పొలిటికల్ సోషల్ మీడియా ..!

సోషల్ మీడియా పుణ్యమాని మీడియాకి పనితగ్గిపోయింది. కాదు కాదు ఎవరూ పట్టించుకునే పరిస్థితి రాను రాను పోయే పరిస్థితి ఏర్పడింది. ఎవరికి వారే.. ఏ రాజకీయ పార్టీకి ఆ పార్టీయే సోషల్ మీడియా వేదిక ద్వారా వారి ప్రచారాలను ముమ్మరంగా చేసుకుంటున్నాయి. ఇంటర్నెట్ సెల్ ఫోన్ తెచ్చిన సాంకేతిక  విప్లవం ఎవరికీ కలిసిరానంతగా రాజకీయపార్టీలకు బాగా కలిసొచ్చింది. ఒప్పుడు ప్రజలను నమ్మించడానికి, చేసిన పనులు చెప్పుకోవడానికి రాజకీయపార్టీలు మీడియా సంస్థలు, టీవీలను, పత్రికలను ఏర్పాటు చేసేవి. అది కాస్తా సోషల్ మీడియా వచ్చిన తరువాత చాలా సులువైపోయింది. ఇంటర్నెట్, ఈమెయిల్ అకౌంటున్న ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా(యూట్యూబ్ ఛానల్, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ ఛానల్, వెబ్ సైట్, టెలీగ్రామ్ ఛానల్, ప్రైవేటు యాప్) ఏర్పాటు చేసుకుంటున్నారు. రాజకీయపార్టీలైతే ఒక అడుగు ముందుకి వేసి.. ఒకరిద్దరు యాడ్స్ డిజైనర్లను, స్క్రిప్ట్ రైటర్లను, ఫోటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్, వీడియో ఎడిటర్ ఇలా సోషల్ మీడియా ప్రమోషన్ కి ఉపయోగా పడేవారందరినీ ఒక యూనిట్ ఏర్పాటు చేసి, వారికోసం ప్రత్యేకంగా కార్యాలయాలను కూడా తెరుస్తున్నది.

  ఎవరి టీము వారి నాయకుల కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వారి స్టైల్ లో తయారు చేసి జనాలమీదకు వదులుతున్నారు. అదే జనం నమ్మేసే స్థితికి వచ్చారు. మీడియా ఏం చెబుతున్నది మరిచిపోయి.. పొలిటికల్ సోషల్ మీడియాలో ఏమొస్తుందోనని వేచి చూస్తున్నారు. ఒక రకంగా మీడియా కూడా సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్నే వార్తలుగా రాసుకోవాల్సిన పరిస్థితికి వచ్చిందంటే సోషల్ మీడియా రాజకీయపార్టీలకు ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో అర్ధం చేసుకోవచ్చు. కొత్తగా న్యూస్ ఛానల్ పెట్టాలన్నా, దినపత్రిక పెట్టాలన్నా ఒకప్పుడు రాజకీయపార్టీలు కోట్లాది రూపాయలు వెచ్చించేవి. ఇపుడు ఆ మొత్తం కాస్తా లక్షల్లోకి వచ్చేసింది. అందులోనూ ఒక్కసారి సోషల్ మీడియా యూనిట్ పెడితే అది శాస్వతంగా పైసా ఖర్చులేకుండా ఉచితంగానే ఎవడి ప్రచారం వాడే చేసుకోవడానికి అవకాశం ఉండటంతో ప్రతీ రాజకీయపార్టీ వారి పార్టీ అంశాలను ప్రచారం చేయడానికి సోషల్ మీడియా యూనిట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. వాటి నిర్వహణకు పార్టీలోని వారినే నియమించుకుంటున్నాయి. దానికోసం ఒక స్టేట్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేస్తున్నది.

 అన్ని జిల్లాలకు అన్ని గ్రామాలకు మండల గ్రూపులు, మండలాలతో జిల్లా గ్రూపులు, జిల్లాలతో స్టేట్ గ్రూపులు ఏర్పాటు చేసి ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా టీవీ ఛానల్, పేపర్లు కంటే ముందుగా సోషల్ మీడియాలోనే ప్రచారం చేయడం మొదలు పెడుతున్నాయి. టీవీ ఛానళ్లను యూట్యూబ్ ఛానళ్లు వెక్కిరిస్తుంటే.. వెబ్ సైట్లు, న్యూస్ యాప్ లను, దినపత్రికలను వాట్సప్ చిన్న చూపు చూస్తున్నది. ఫేస్ బుక్ పైత్యం పెరిగిపోయి ఎడా పెడా పోస్టులతో ఎవరికి వారే సోషల్ మీడియా నిర్వాహకులుగా మారిపోతున్నారు. ఏదైనా రాజకీయపార్టీ ఒకప్పుడు మరేదైనా సమాచారం, ముఖ్యమైన విషయాన్ని ప్రజలకు, నాయకులకు తెలియజేయాలంటే ఖచ్చితంగా పత్రిక, టీవీ ఛానల్ విలేఖరులను పిలిచి ప్రెస్ మీట్లు పెట్టేవి. అవి వార్తలుగా మరుసటి రోజు వచ్చేవి. ఇపుడు ఆ పరిస్థతి పోయి సోషల్ మీడియా రావడంతో మీడియా వచ్చినా రాకపోయినా.. ముందు ఫోటోలు, వీడియోలు, వారికి నచ్చిన భాషతో  నాయకుడికి పేరు ముందు గుడిలో దేవుళ్లను కొలిచినట్టుగా ముందు మూడు  శ్రీశ్రీశ్రీలు  పేరు తరువాత గార్లు, బూర్లు, వడలు, ఇంకా ఏమైనా డిగ్రీలుంటే అవికూడా తగిలించి..  ఆ విధంగా జరగడం జరిగిందంటూ.. ఓ ప్రెస్ నోటు కూడా రిలీజ్ చేసి జనాలే చస్తారులే అన్నట్టుగా వాట్సప్ లలో వదిలేస్తున్నారు.

 అందులో వినియోగించే పదప్రయోగం కొంతమందికి పిచ్చి, మెంటలు ఎక్కించిన దాఖలాలు కూడా లేకపోలేదు. ప్రజలకు సమాచారం వీటి ద్వారానే గబుక్కున చేరిపోతున్నది.   మీడియా కంటే సోషల్ మీడియా ముందు కదా.. అంతే దానితో సోషల్ మీడియాలో వచ్చిన సమాచారాన్నే వార్తలుగా, వాళ్లిచ్చిన ఫోటోలే న్యూస్ ఫోటోలుగా మీడియా  ఆ వీడియోలనే  వినియోగించక తప్పడం లేదు. అలా పబ్లిసిటీ చేయకపోతే అసలు మీడియా ఉందో లేదో తెలియని పరిస్తితికి వచ్చేస్తుందని.. ఆ సమాచారంతోనే ఓ న్యూస్ క్లిప్ ఫోటో తయారు చేయించి మళ్లీ వాళ్లకే సోషల్ మీడియాలో వదులుతున్నాయి మీడియా సంస్థలు. అంతే ఆ క్లిప్పింగుని కూడా నిర్వాహకులు ఎడాపెడా సోషల్ మీడియాలో షేర్లు చేసి వైరల్ చేసుకుంటున్నారు. దానితో పూర్తిగా మీడియా పనే లేకుండా పోయింది. కొందరు సోషల్ మీడియా నిర్వాహకులు ఏకంగా కార్యక్రమం జరిగిన ప్రదేశం నుంచే లైవ్ కవరేజీ ఇచ్చేస్తున్నారు. దానితో ఎవరి మొబైల్ ఫోన్లలో వారే ఆ కార్యక్రమాన్ని వీక్షించేస్తున్నారు. ఫలితంగా టీవి న్యూస్ అవసరం లేకుండా పోయింది.

  కార్యక్రమం అయిన వెంటనే సోషల్ మీడియా లైవ్ ఇచ్చేస్తుంటే.. ఆ తరువాత మరుసటి రోజు ఆ పాసి వార్తలను అసలు మీడియా ప్రజలకు వార్తలు ద్వారా తెలియజేస్తున్నది. రాజకీయ పార్టీలకు ప్రచారం చేసుకోవడానికి మీడియా సంస్థలు ఉన్నా.. లైవ్ లో వారి కార్యక్రమాలను, ప్రచారాల కోసం ప్రత్యేక సోషల్ మీడియా విభాగాలనే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇంట్లో ఉండే కేబుల్ టీవీ బిల్లు నెలకి రూ.150 కట్టలేనివారు ఇపుడు నెలకి రూ.600 ఇంటర్నెట్ ప్యాక్ వేసుకొని మొత్తం సమాచారాన్ని కేవలం సోషల్ మీడియాద్వారానే వీక్షిస్తున్నారు జనం కూడా. రాజకీయపార్టీలకు కూడా అదే కలిసి రావడంతో అసలు మీడియాని వదిలేసి సోషల్ మీడియా ద్వారానే గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు. రానున్నరోజుల్లో మీడియా మనుగడ ప్రశ్నార్ధకం కాబోతుందనే సంకేతాలని సోషల్ మీడియా ద్వారా రాజకీయపార్టీలే ప్రజలకు తెలియజేస్తున్నాయి.   పొలిటికల్ సోషల్ మీడియానా మాజాకా...?!

visakhapatnam

2025-07-09 10:24:04

విలేఖరి కలం తన గోడు రాసుకోలేని దినం..!

నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని..  అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవత్సవాన్ని అంటాడో సినీ కవి.. ప్రశ్నిస్తూ  ప్రపంచాన్ని తన వార్తలతో ఆలోచింపజేసే జర్నలిస్టులు తమ కోసం మాత్రం తాము రాసుకోలేకపోతున్నారు. సమాజంలో నాల్గవ మూలస్థం జీవం కోల్పోతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. జర్నలిస్టులు పడుతున్న బాధలు, పడుతు ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలు రాయాలని ఉన్నా.. యాజమాన్యాలు రాయనివ్వవు. పైకి పల్లకీ మోత..లోన అప్పుల రోత అన్న సామెత సరిగ్గా సరిపోతుందేమో వర్కింగ్ జర్నలిస్టులకి. మీరు జర్నలిస్టు అయితే.. ఈ వార్త చదవుతున్న సమయంలో నిజమే నా విషయంలోనూ ఇలా జరిగిందని అనుకుంటారు. కాదు కాదు జరిగే వుంటుంది. పత్రికల్లో, టీవిల్లో  ఎవరికోసమో రాసిన వార్త అచ్చు అయితే, చేసిన స్టోరీ బ్రాడ్ కాస్ట్ అయితే ఆనంద పడే జర్నలిస్టులు.. వారి సమస్యలను మాత్రం కనీసం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లలేకపోతున్నారు. 

చచ్చీ చెడీ జర్నలిస్టుల సంఘాల ద్వారా ఆందోళనలు చేసి, మీకోసం లో అర్జీలు పెట్టినా.. యదారాజా తదా ప్రజా అన్నట్టుగా అధికారులు కూడా సదరు దరఖాస్తులను ప్రక్కన పెట్టేస్తున్నారు. నేటికీ 60శాతం మంది జర్నలిస్టులు వారంలో ఒక రోజు కుటుంబ సమేతంగా పస్తులుంటున్నారంటే అతిశకయోక్తి కాదేమో. ప్రస్తుతం ఆంగ్ల పత్రికలు, కొన్ని ప్రధాన టీవి ఛానళ్లు, రెండు మూడు పెద్ద దినపత్రికలు తప్పితే మరే ఇతర యాజమాన్యాలూ పత్రికల్లో పనిచేసే విలేఖరులకు జీతాలు ఇవ్వడం లేదు సరికదా.. కనీసం లైన్ అకౌంట్ కూడా ఇవ్వడం లేదు. ప్రైవేటు ప్రకటనలు చేస్తే వాటిపై ఇచ్చే కమిషన్లు తప్పా. దాని కోసం జర్నలిస్టు గొడ్డులా కష్టపడాల్సి వస్తున్నది. చీమల దండు సినిమాలో నా రక్తంతో నడుపుతాను రిక్షాను.. నా రక్తమే నా రిక్షకు పెట్రోలు అని ఆర్.నారాయణమూర్తి పాడినట్టు. జర్నలిస్టుల రక్తమాంసాలతోనే పత్రికలు, ఛానళ్లు నడుస్తున్నాయి. చచ్చీ చెడి జర్నలిస్టులు పస్తులుండి కూడా యాజమాన్యాలను పెంచి పోషించాల్సి వస్తున్నది. 

అదే జర్నలిస్టే యాజమాన్యాలపై రోత పుట్టి తానే పత్రిక ప్రారంభిస్తే.. భార్య మెడలో పుస్తెలు అమ్మి అయినా పత్రికను అచ్చువేయాల్సిన పరిస్థితి. ఇవేమీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టవు.. జర్నలిస్టులకి ఎక్కడ మేలు జరిగిపోతుందోనని కంగారు పడి 50శాతం రాయితీ తో ఇచ్చే రైల్వే పాసుని తీసేసింది కేంద్రం. మరెక్కడ జర్నలిస్టులు ప్రమాదంలో మృత్యువాత పడితే కుటుంబానికి ఆశరా వస్తుందోనని యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్సే ఇవ్వడం మానేసింది రాష్ట్రం. అంతేకాదు రాజకీయ పలుకుబడి.. కుల పెత్తనం ముసుగులలో పెద్దపత్రికలకి ఇచ్చే ప్రకటనల్లో కనీసం దశమ భాగం కూడా ప్రభుత్వాలుగానీ, ప్రైవేటు సంస్థలుగానీ స్థానిక పత్రికలకు, చిన్న మధ్య తరహా పత్రికలకు ఇవ్వడం లేదు. ఆ సమయంలో నిజంగా వర్కింగ్ జర్నలిస్టు రక్తం అమ్ముకొనైనా పత్రికను నడిపించాల్సిన పరిస్థితి వస్తోంది. లేదంటే ఇంట్లో బియ్యం లేకపోయినా.. చేసిన యాడ్స్ కి బలవంతంగా తన సొంత డబ్బులు యాజమాన్యానికి కడితే తప్పా మనుగడ లేని పరిస్థితి. 

జర్నలిస్టుగా పనిచేస్తున్నందుకు ప్రభుత్వం సమయానికి అక్రిడిటేషన్ ఇవ్వదు.. హెల్త్ కార్డు ఇవ్వదు.. యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ ఇవ్వదు, కనీసం సొంత గూడు నిర్మించుకోవడానికి ఓ మూడు సెంట్ల స్థలం కూడా ఇవ్వదు. ఇవన్నీ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. ఈ విషయంలో నిరుపేదలకిచ్చే నిబంధనలు కూడా జర్నలిస్టుల కోసం సడలించి ఆలోచించడం లేదు  ప్రామాణికంగా తీసుకోవడం లేదు. కానీ తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి దయ్యాలు తిరిగే వరకూ ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా దానిని  వెలుగులోకి తీసుకు వచ్చేది ఒక్క విలేఖరి మాత్రమే. రాజకీయపార్టీలు ప్రభుత్వాన్ని స్థాపించాలన్నా, స్థాపించిన ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు వరకూ వెళ్లాలన్నా మళ్లీ జర్నలిస్టులు కావాలి. కానీ జర్నలిస్టుల కనీస అవసరాలు, ప్రధాన సమస్యలు మాత్రం ప్రభుత్వాలు తీర్చవు. సాధారణ ప్రజల మాదిరిగానే అధికారులకు, ప్రజాప్రతినిధులకు అర్జీలు పెట్టుకోకా తప్పదు. 

ఇక్కడ కూడా మళ్లీ సిగ్గులేనిది జర్నలిస్టులకే.. ప్రభుత్వం జర్నలిస్టుల కనీస అవసరాలు తీర్చకపోయినా.. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకూ ప్రభుత్వం, అందులోని నాయకులు, అధికారులు ఏం చేశారనే విషయాలను ప్రజలకు అందరికంటే ముందుగా చూపించాలనే తపన మాత్రం ఉంటుంది. అదే తపన తాను కట్టుకున్న భార్యను, పిల్లలను సక్రమంగా చూసుకోవాలనే ఆలోచనను కూడా ప్రక్కన పెట్టేలా చేస్తుంది ఈ విలేఖరి ఉద్యోగం. ఇపుడు నేను చెప్పిన అంశాలన్నీ ప్రతీ ఒక్క జర్నలిస్టు విషయంలోనూ జరిగేవే.. అయినా మళ్లీ ఈరోజు పేపర్ వాళ్లు ఎందుకు గుర్తుచేస్తున్నట్టో అంటే..అందరూ జర్నలిస్టులూ వారి కోసం వాళ్లు రాసుకునేంత తీరిక, సమయం వారికి లేవని.. ఉన్న కొద్దిపాటి సమయం మాకు దొరికిందని.. వారికి వారి సమస్యలేంటో తెలియజెప్పే చిన్న ప్రయత్నం మాత్రమే. 

జర్నలిస్టులు ఎన్ని వార్తలు రాసినా ప్రభుత్వంలోనూ ప్రజాప్రతినిధుల్లోనూ చలనం ఏ విధంగా అయితే రాదో.. ఇలాంటి వార్తలు వచ్చినా.. జర్నలిస్టుల్లోనూ ఆ విధంగానే మార్పు రాదని చెప్పడానికి కూడా పనిచేస్తుందని... అసలు జర్నలిస్టుకి కనీసం ఉపయోగపడని వారికోసం జర్నలిస్టులు ఎందుకు పనిచేస్తాడంటే సమాజంలోని నాల్గవ మూల స్థంబంగా గౌరవం ఇచ్చినందుకు. కానీ నేడు అదే సమాజం జర్నలిస్టుకి కనీస గౌరవం ఇవ్వడం లేదు. దానికి కారణం కూడా అరకొర పనితనం, ప్రెస్ కార్డు అడ్డం పెట్టుకొని చేస్తున్నదందాలు, వేధింపులు, ఇలా చెప్పుకుంటూ పోతే జర్నలిస్టు అనే నాణేనికి ఒకవైపు జర్నలిస్టులు చేసే అరాచకాలు కూడా లేకపోలేదు. 

ఒక వైపు సమాజాన్ని మేల్కొలపాలని పనిచేసే నికార్శైన వర్కింగ్ జర్నలిస్టులుంటే.. మరోవైపు యూనియర్లు పేరుతోనూ, పత్రికల పేరుతోనూ, కులం పేరుతోనూ జర్నలిజాన్ని బ్రష్టు పట్టించేవారూ లేకపోలేదు. ఎన్ని ఉన్నా.. ఏం చేసినా.. విలేఖరి కలం మాత్రం తన గోడుని రాసుకోని దినంగానే మిగిలిపోతున్నది..అయినా కూడా జర్నలిజం వర్ధిల్లాలి.. జర్నలిస్టుల్లో ప్రశ్నించే తత్వం పెరగాలి.. జర్నలిస్టుల వార్తలతో సమాజం మేల్కోవాలి.. ప్రజలు చైతన్యవంతం కావాలి..!?

visakhapatnam

2025-07-08 06:11:16

విప్లవాగ్ని అల్లూరి అన్యధా భావించకు..!

భరతమాత దాశ్య శృంఖలాలను తెంచేందుకు తృణ ప్రాయంగా ప్రాణాలు అర్పించిన ఓ ధీరుడా.. తెల్లవాడిని భారత దేశం నుంచి తరిమికొట్టి.. స్వాంత్ర్య ఉద్యమంలో తెలుగువాడీ వాణిని వినిపించిన వీరుడా.. భారతీయులను బానిసలుగా చేయబోయిన బ్రీటీషువాడికి తెలుగుజాతి పౌరుషాన్ని రుచి చూపించిన సూరుడా.. మన్యంలో మహోదయం సృష్టించిన విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజా మమ్మల్ని మణ్ణించు.. మేము చేసే తప్పులను చూసి జాలిపడు.. నీ పుట్టిన రోజు జూన్ 4న నిన్ను అధికార లాంఛనాలతో కీర్తించడం.. నీ మరణాన్ని వీరత్వానికి ప్రతీకగా కొలిచి నిన్ను పూజించడం తప్పా ఏమీ చేయలేకపోతున్నాం. అధికారులుగా.. ప్రజా ప్రతినిధులుగా.. ఎంపీలుగా.. ఎమ్మెల్యేలుగా..ఎమ్మెల్సీలుగా.. ఆఖరికి కేంద్ర మంత్రులుగా ఉండి కూడా మిమ్మల్నిప్రచారం కోసం పూజించడం తప్పా మరేమీ చేయలేని నిశ్శాహయస్థితి భారతీయులం. బరి తెగించి ఇలా మాట్లాడుతున్నామని మాత్రం అన్యధా బావించకు.. మేమింతే.. మాలో మార్పురాదు.. మిమ్మల్ని గుర్తించం సరికదా.. గుర్తింపు తీసుకు వచ్చేందుకు కూడా కనీసం ప్రయత్నం చేయము.. కాదు కాదు.. తీసుకురాము.. రాలేము... చేతనైనే పరలోకం నుంచే మమ్మల్ని శపించు.. అదీ కుదరకపోతే వీళ్లింతేనని క్షమించు.. కానీ మేము ప్రతీ విషయానికి మీ పేరుతో, మీ పోరాట పటిమతో మాకు అనుకూలంగా  అనూహ్య ప్రచారానికి మిమ్మల్ని వాడుకుంటున్నామని మాత్రం గుర్తించు..జోహార్ అల్లూరి సీతారామరాజా..జోహార్..!

అవును మీరు చదువుతున్నది నిజమో కాదో ఒక్కసారి భారతీయులుగా ఆలోచించండి.. మీలో మీరు ప్రశ్నించుకోండి.. అవకాశం వస్తే ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే ప్రయత్నం చేయండి. క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో ఆడితే పిలిచి ఆ క్రీడాకారుడికి గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు కోట్లాది రూపాయల ప్రైజ్ మనీ, మంచి ఇల్లు కట్టుకునేందుకు ఇంటి స్థలం. ఇంకా అవసరం అయితే అకాడమీలు ఏర్పాటు చేసేందుకు ఉచితంగానే ఎకరాలకు ఎకరాలు భూమి ఇస్తున్న  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. స్వాతంత్ర్యం కోసం.. బ్రీటీషువాడి కాలిక్రింద నలిగిపోతున్న అమాయక గిరిజనులను కాపాడేందుకు అత్యంత పిన్నవవయస్సులో భరతమాత కోసం తన ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు కి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఏమివ్వాలి. ఆయన పుట్టిన రోజు, వర్ధంతి రోజున ఘనంగా అధికారికంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే అల్లూరికి సచిత స్థానం ఇచ్చినట్టా..? ఒక్కసారి ఆలోచించాల్సిన  సమయం వచ్చింది... అల్లూరి జన్మించి నేటికి 128 ఏళ్లు పూర్తవుతుంది. గత 2024కి ఆయన మరణించి 100ఏళ్లు దాటింది.

 ప్రపంచం గర్వించ దగ్గ వీరుడికి  ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుచేసిందేమిటో చూసుకుంటే.. ఆయనను కీర్తిస్తూ ప్రచారం చేసుకోవడం, అక్కడక్కడా విగ్రహాలు ఏర్పాటు చేయడం తప్పా మరేమీ చేయలేదు. కనీసం ఆ మహానుభావుని విగ్రహాన్ని పార్లమెంటులో  మాత్రం పెట్టించలేకపోయిన మన పార్లమెంటు సభ్యులను ఏమనుకోవాలో ఒక్కసారి ఆలోచించండి. ఇదేదో కావాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను తప్పుబట్టడం కాదు. దేశ చరిత్రలో ఒక పేజీలో ఇమిడి ఉండాల్సిన అల్లూరి వీరోచిత చరిత్ర కనీసం నేటికీ పాఠ్యాంశంగా కూడా నోచుకోలేదు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు, ఎయిర్ పోర్టులకు అల్లూరి పేరు పెట్టినంత మాత్రన ఆయనను గుర్తించి ఇచ్చినట్టా..? భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి విశాఖ జిల్లా, గొలుగొండ మండలం క్రిష్ణదేవీపేట గ్రామం వేదికగాబ్రిటీషు సేనలపై అల్లూరి తిరుగుబాటు చేసిన మన్యం పితూరి ఉద్యమం ఎంత మందికి తెలుసు.. 

ఆ ఉద్యమంలో మరెంత మంది అల్లూరి కంటే ముందు అసువులు బాసారో ఇంకెంత మందికి తెలుసు.. అల్లూరి వెంట నడిచిన, ఆయనతో నర్సీపట్నం జైలులో ఖైదు చేయబడిన వీరుల కోసం ఈ కధనం చదువుతున్న మీకైనా తెలుసా.. అంతెందుకు బ్రిటీషువాడిని ఎదిరించే సమయంలో ఆయన తిరిగిన ప్రదేశాలు ఏమేమిటో నేటికీ ఎవరికీ తెలియదు. ఆయన పుట్టుక, మరణం, కుటుంబం కోసం తప్పితే ఇంకేమీ దేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే ఎవరికీ తెలియదు. భూమి ఉన్నంత కాలం ఆయనను గుర్తుంచుకోవాల్సిన మనం, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఆయన కోసం ఏం చేశారని ఒక్కసారి ప్రశ్నిస్తే.. 100ఏళ్లుగా కీర్తించి ఆహా, ఓహో అల్లూరి అంత.. అల్లూరి ఇంత ధీరుడు, సూరుడు, అని కీర్తించడం తప్పితే ఆయన పేరు, చరిత్ర గుర్తిండిపోయేలా ఒక రూపే నాణెం కూడా ముద్రించుకోలేకపోయాం. ఆయన చరిత్రను భావి తరాలకు తెలిసే విధంగా అధికారికంగా అధ్యయనం చేయించలేకపోయాం.. బ్రిటీషువాడి వెన్నులో చలి పుట్టించిన ఆయన వినియోగించిన విల్లుని, భాణాన్ని భావి  భారత ప్రజలకు చూపించలేపోయాం. అల్లూరి వెంట నడిచిన అనుచరులను గుర్తించలేకపోయాం..

 అల్లూరి చరిత్ర చిరస్థాయిగా నిలిచి ఉండిపోయేలా కనీసం ఒక చిన్న మ్యూజియం కూడా నిర్మించుకోలేకపోయాం.. కానీ అల్లూరికి చెందిన సామాజిక వర్గంగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుగా.. ప్రజాప్రతినిధులుగా.. ఆయన జనన, మరణాల రోజున మాత్రం ఆయన విగ్రహాలకు దండలు వేసి, దండం పెట్టి.. ఆయనను కీర్తిస్తున్నాము.. ఇపుడు అల్లూరి ఆశయ సాధనే ఈరోజు దినపత్రిక, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి రాస్తున్న కథనాలన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియకుండానే ఉన్నాయా అంటే.. అన్నీ తెలుసు.. కానీ.. అల్లూరికి అంత విలువ ఇవ్వాల్సిన పనిలేదని ఇప్పటి వరకూ అలానే వదిలేనట్టుగా పక్కన పెట్టేశారు. అందుకే నేటికీ అల్లూరి సముచిత స్థానం దక్కలేదనేది జగమెరిగిన సత్యం. అల్లూరి మన్యం పితూరి ఉద్యమంలో, తెల్లవాడికి సమాంతరంగా ఏర్పాటు చేసిన రచ్చబండ పరిపాలనకు సాక్ష్యాలుగా  క్రిష్ణదేవిపేటలో, నేటికి అక్కడ రచ్చబండలపై అల్లూరి స్వయంగా కూర్చొని పంచాయతీలు చేసిన రాళ్లు ఉన్నాయి. 

కనీసం వాటిని కూడా భారతదేశంలో స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత ఏర్పాటైన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు ఎంత మంది ఆ గ్రామాన్ని సందర్శించి, ఆయన వీరోచిత చరిత్రకు గుర్తుగా ఏమైనా చేశారా అంటే.. చారిత్రక గ్రామంలో మన్యం పితూరి ఉద్యమ చరిత్రను తెలియజేసే బోర్డు సైతం పెట్టించలేకపోయాయంటే అతిశయోక్తి కాదేమో. అల్లూరి జయంతి, వర్ధంతి ఈ రెండురోజులు తప్పా.. మళ్లీ అల్లూరిని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పట్టించుకుంటే ఒట్టు. కాకపోతే గత టిడిపి ప్రభుత్వంలో ఎంపీగా పనిచేసిన దుంపా మేరీ విజయకుమారి పుణ్యమాని తన ఎంపీ నిధులతో క్రిష్ణదేవీపేట(ఏజెన్సీ లక్ష్మీపురం) లో అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరుడు గాం గంటందొర పార్థీవ శరీరాలను  ఖననం చేసిన చోట మాత్రం ఒక పార్కుని నిర్మించారు. చాలా ఏళ్ల తరువాత మళ్లీ ఇపుడు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

 నేడు రాష్ట్రప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతిని కూడా జరుపుతున్నారు. ప్రతీ జయంతికీ అల్లూరి కోసం శాస్వతంగా ఏదైనా నిలిచి ఉండే పనులు చేస్తారా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా.. నాటికీ ఏనాటికీ రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఆ చొరవ తీసుకోకపోడాన్ని బట్టి అల్లూరికి ఏస్థానం ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇదంతా ఎవరినో ఉద్దేశ్య పూర్వకంగా తప్పుపట్టడానికి కాదు.. కేవలం అల్లూరికి ఇన్నేళ్లైనా సముచిత స్థానం దక్కలేదని బాధాతత్ప హృదయాలతో మననం చేసుకోవడం తప్పా.. క్షమించు మన్యవీరా క్షమించు.. జోహార్ విప్లవజ్యోతి అల్లూరి జోహార్.. జోహార్..!

-అల్లూరి సీతారామరాజుకి సముచిత స్థానం కల్పించాలి
అల్లూరి సీతారామరాజుకి చరిత్రలో నిలిచి ఉండిపోయేలా సముచిత స్థానం కల్పించాలి. దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన చరిత్రపైనా, ఉద్యమాలపై, పోరాటాలపైనా అధికారికంగా అధ్యయం చేయించాలి. ఆయన విల్లును, యుద్దంలో వినియోగించిన ఆయుధాలను సేకరించి మ్యూజియంలో పెట్టాలి. అల్లూరి మన్యం పితూరి ఉద్యమం, రచ్చబండల ఉద్యమ సమయం, పోలీసు స్టేషన్లపై దాడి చేసిన సమయంలో తిరిగిన అన్ని ప్రాంతాలను ఒక టూరిజం ప్రాజెక్టుగా రూపొందించాలి. అల్లూరి కాంశ్య విగ్రహాన్ని భారత పార్లమెంట్ లో ప్రతిష్టించి, ఆయన పేరుతో రూపే నాణేన్ని ముద్రించాలి.. అల్లూరి చరిత్రను కేజీ నుంచి పీజీ వరకూ పాఠ్యాంశంగా చేర్చాలి. అల్లూరి మన్యం పితూరి, రచ్చబండ పంచాయతీలు ప్రారంభించిన క్రిష్ణదేవిపేట(పాతూరు) గ్రామాన్ని పర్యాటకప్రాంతంగా అభివృద్ధి చేయాలి. అల్లూరి గిరిజనులకు చేసిన ఆయుర్వేద వైద్యానికి గుర్తుగా  ఈ గ్రామంలో ఆయుష్ శాఖ తరపున ఆయుర్వేద డిస్పెన్సిరీ ఏర్పాటు చేయాలి. అల్లూరి అనుచరులు, కుటుంబాల వివరాలను సేకరించి, అల్లూరి చరిత్రతోపాటు, వారి చరిత్రను కూడా బాహ్య ప్రపంచానికి తెలియజేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలు, యూనివర్శిటీల్లో చదువుల్లో అల్లూరి అనుచరుల కుటుంబాలకు ప్రత్యేక కోటాను ఏర్పాటు చేయాలి. అల్లూరి చరిత్రను అధ్యయనం చేస్తున్న పరిశోధకులకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించేందుకు ప్రత్యేక విభాగాన్ని లేదా కార్పోరేషన్ ను ఏర్పాటు చేయాలి. క్రిష్ణదేవీపేటలోని అల్లూరి పార్కుని మరింతగా అభివృద్ధి చేసి పర్యాటకశాఖలో విలీనం చేసి చారిత్రక ప్రాంతంగా గుర్తింపు తీసుకు రావాలి. తద్వారా భరతమాత కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత స్థానాన్ని కల్పించినట్టు అవుతుంది.

-పి.బాలభాను(ఈరోజు బాలు), అల్లూరి చరిత్ర పరిశోధకులు,
అల్లూరి అనుచరుడు, అల్లూరితో జైలుకెళ్లిన పందిరి రామస్వామి ముని మనవడు

visakhapatnam

2025-07-03 21:58:51

అలెర్ట్... కోవిడ్-19 తరువాత మరణాలన్నీ హార్ట్ ఎటాక్ లే..!

ప్రపంచాన్ని ఒణికించిన కోవిడ్ వైరస్ కి వేక్సిన్ వేసుకున్న తరువాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరణాలన్నీ గుండె పోటు మరణాలనే వార్త ఇపుడు మళ్లీ ప్రపంచాన్ని కలవర పెడుతున్నది. అకారణంగా మృతిచెందుతున్నవారంతా గుండెపోటు వచ్చి చనిపోతున్నవారే. ఈ వార్త ఇపుడు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం, అంతర్జాతీయంగా కూడా పెద్ద చర్చకు తెరతీసింది. కోవిడ్-19 వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాలను చాలా వరకూ వినియోగించుకున్నారు. అప్పట్లో వాక్సిన్ వేసుకున్న తరువాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవని వైద్య నిపుణులు కూడా చెప్పుకొచ్చారు. కానీ వేక్సిన్ వేసుకున్న తరువాత చాలా మందిలో చాలా రకాల మార్పులు వచ్చాయి. దానిని ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే చాలా మంది ఆరోగ్యవంతులు కూడా గుండెపోటు వచ్చి మృతిచెందుతుండటం కూడా ప్రస్తుతం అన్ని వర్గాల వారిని కలవరపెడుతున్నది.

 కొందరు ఒకటి రెండు వేక్సిన్లు వేసుకుంటే అవకాశం ఉన్నవారు మూడు నాలుగు సార్లు కూడా కోవిడ్ వేక్సిన్ వేసుకున్నారు. వేక్సిన్ వేసుకున్న తరువాత సాధారణంగా గుండ దడ పెరుగుతుందని.. వైరస్ వెళ్లిపోయిన తరువాత శరీరంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చల శారాంశం. చాలా మందికి కోవడ్ వ్యాక్సిన్ వేసుకున్న ఏడాదికి గుండె వేగం పెరిగిందని, చిన్న ఆందోళన శరీరంలోని చాలా మార్పులు వచ్చాయని కూడా చెబుతున్నారు. అవి కూడా టిబిసి(టోటల్ బాడీ చెకప్) చేయించుకున్నవారు చెబుతున్న మాట. దానికి తోడు కొందరికి గుండెపోటు వచ్చినా.. వెంటనే స్టంట్లు, బైపాస్ సర్జరీలు చేయించుకొని కాస్త ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ చాలా మందికి తెలియకుండానే ఈ గుండెపోట్లు రావడం, హఠాత్తుగా మృతిచెందుతుండటం కూడా ఆందోలన కలిగిస్తున్నది. వైరస్ ను శరీరంలోకి రానీయకుండా వ్యాక్సిన్ అయితే తయారు చేశారు చేశారు గానీ.. తరువాత దాని వలన వచ్చే దుష్ప్రభావాలు కోసం పట్టించుకోలేదని.. కనీసం మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదనే వాదన బలంగా వినిస్తున్నది. 

 ప్రస్తుతం కోవిడ్ కేసులు దేశ వ్యాప్తంగా అనూహ్యంగా పెరుగుతున్న వేళ ప్రస్తుతం హార్ట్ ఎటాక్ మరణాలు అందరినీ ఆలోచింప చేస్తున్నాయి. ఒకవేళ మళ్లీ కోవిడ్ కేసులు పెరిగి.. పరిస్థితి తీవ్రతరం అయితే మళ్లీ కోవిడ్ వైరస్ శరీరాన్ని తాకకుండా ఉండేందుకు వ్యాక్సిన్ వేసుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే గతంలో వేసుకున్న వేక్సిన్  వలనే శరీరంలో చాలా మార్పుల వచ్చాయని భావిస్తున్నవారు.. భయపడుతున్నవారు మళ్లీ కోవిడ్ వేక్సిన్ వేసుకునే దైర్యం చేస్తారా..? అనేది ప్రశ్నార్ధకం అయ్యింది. అటు వైద్యులు కూడా అత్యంత ఎక్కువగా జరుగుతున్న హార్ట్ ఎటాక్ మరణాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్-19 వేక్సిన్ వేసుకున్న తరువాతే హార్ట్ ఎటాక్ మరణాలు జరుగుతున్నందు.. వేక్సిన్ వలనే జరుగుతున్నాయని చెప్పడానికి లేదని.. కానీ చాలా మంది రోగులు వేక్సిన్ వేసుకున్న తరువాత శరీరంలో చాలా మార్పులు వచ్చాయని.. గుండె వేగం పెరిగిందని చెబుతున్నారని కొందరు వైద్యులు చెబుతున్నారు.

 కోవిడ్ వైరస్ వచ్చిన తరువాత చాలా మంది వైద్యులు కూడా గుండెపోటుతో మరణించడం కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతున్నది. వాస్తవానికి కోవిడ్ వైరస్ కు ఆయుర్వేదం, హోమియలోనూ మంచి కాంబినేషన్ తో మందులు ఉన్నా.. తక్షణం ఉపసమనం పొందడానికి చాలా మంది అల్లోపతి వ్యాక్సిన్ కే ప్రాధాన్యత ఇచ్చారు. వేక్సిన్ వేసుకున్న తరువాత హమ్మయ్య అనుకున్నారు తప్పితే తరువాత చాలా ఇబ్బందులు వస్తాయని ఎవరూ ఊహించలేదు. హార్ట్ ఎటాక్ మరణాలు సంభవించిన చోట ఎక్కువగా వైరస్ కి వేక్సిన్ వేసుకున్న తరువాతనే మరణాలు పెరుగుతున్నాయనే వాదన, ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఎక్కువగా సంభవిస్తున్న హార్ట్ ఎటాక్స్ ని ముందుగా గుర్తించడానికి ప్రత్యేక మెడికల్ క్యాంపులు పెట్టి గుర్తించడం కూడా ఇపుడు చాలా అత్యవసరమైంది.

visakhapatnam

2025-06-25 07:01:30

భారతదేశంలో 15 ఏళ్ల తరువాత మళ్లీ జన-కుల బలం ప్రదర్శన..?!

భారత దేశంలో సరిగ్గా 15ఏళ్ల తరువాత జన-కుల బలం ప్రదర్శన జరగబోతుంది. ఇప్పటి వరకూ మా సామాజిక వర్గం పెద్దది.. మా సామాజిక వర్గమే పొడుగు.. మాతరువాత ఇంకెవరైనా అంటూ భీరాలు పోయేవారందరి లెక్కలు అధికారింగా తేలిపోనున్నాయి. దానికోసం కేంద్రప్రభుత్వం జన-కుల గణను గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.  గత కొద్దిరోజుల ముందే జనాభా గణణ జరగుతుందని.. దానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రకటించగానే ఎవరి కుల బలం ఎంతుందో తెలియజేసే ప్రయత్నాలకు అంతా తెరలేపారు. ఎవరి సామాజిక బలం ఎంతుందో సంఘాల వారీగా లెక్కపెట్టుకునే పని మొదలు పెట్టారు. అవన్నీ ప్రైవేటుగా జరుగుతున్నవే అయినా.. ఎవరి సామాజిక వర్గం వారి లెక్కలు వారు ముందుగానే వేసుకుంటున్నారు. గతంలో కుల, జనన బలాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఈ జనాభా గణన ఎప్పుడైతే లెక్కించడం మానేశారో అప్పటి నుంచి కుల, జన గణనకు రాజకీయ రంగు అంటుకుంది. దానితో ఎవరికి కుల బలం, ఓట్ల బలం ఉంటే వారికి చట్టసభల్లో సీట్లు ఇవ్వడం ప్రారంభించాయి రాజకీయపార్టీలు. 

ఫలితంతా అన్ని సామాజిక వర్గాల్లోనూ వారి సంఖ్యా బలాన్ని అనధికారికంగా లెక్కించుకుంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందే జనగణన జరగాల్సి వున్నా.. విభజన జరిగిపోయిన పదేళ్ల తరువాత కూడా జరగలేదు. కానీ ఇపుడు తప్పక, విభజన హామీలు అమలు చేసే కార్యక్రమంలో భాగంగా ఇపుడు కేంద్రం జన, కులగణన చేపట్టనుంది. ఇది పూర్తయితేనే జనాభా సంఖ్య ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన, అదే సమయంలో కొత్త జిల్లాలు, స్థానిక సంస్థల పునర్విభజన ఇలా చాలానే పనులకు మోక్షం వస్తుంది. అదే సమయంలో ఎవరి సామాజిక బలం ఏంటో కూడా రాజకీయ పార్టీలకు ఇక అధికారికంగా లెక్కలతో సహా తెలుస్తుంది. అపుడు మేమే పొడుగు అన్న పదం.. మేము చాలా ఎక్కువ మందిమి అనే సౌండ్ చేయడానికి లెక్కలు చాలా క్లియర్ గా కనిపించి ముందర కాళ్లకి బంధం వేస్తాయి. ఒకప్పడు ఒక్కో జిల్లాల్లో ఒక్కో సామాజిక వర్గం బల ప్రదర్శన చేస్తూ వచ్చి రాజకీయం చేశారు.  కొన్ని సామాజిక వర్గాల్లో వారి సంఖ్యా బలం తగ్గిపోవడంతో కులంలోని వర్ణాలు, వర్గాలు వేరుగా ఉన్నా తామంతా ఒకే సామాజిక వర్గం అని చెప్పుకున్నాయి కొన్ని సామాజిక వర్గాలు. 

ఇపుడు అదే పాచికను ప్రధాన సామాజిక వర్గాలు కూడా అమలు చేసే యోజనలో పడ్డాయి. అలా చేయకపోతే వారి సామాజికవర్గం బల ప్రదర్శన చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. దానికోసం కేంద్రం కుల, జన గణనకు పచ్చజెండా ఊపగానే చాపక్రింద నీరులా సామాజిక వర్గాలు ఎవరికి వారు సమావేశాలు, సభలు, సోషల్ మీడియాలో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసుకొని ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా వారి బలాన్ని ప్రదర్శించానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇపుడు కులగణన చేసిన తరువాత ఒకే సామాజిక వర్గంలోని వర్ణాలు తేడాగా ఉన్నా, సంబంధీక కులానికి దగ్గరగా వుంటే వారంతా ఏకమయ్యే అవకాశాలు కనిస్తున్నాయి. కారణం గతంలో రెండు మూడు సామాజిక వర్గాలు చేసిన రాజకీయ చదరంగ ఎత్తుగడను ఇపుడు అన్ని సామాజిక వర్గాలు కూడా అమలు చేయాలని చూస్తున్నాయి. ఉదాహరణకు స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో చేనేత కుటుంబాల సంఖ్య ఇంచుమించు కోటి 10 లక్షలుపైనే ఉంది. 

అది 1970 వచ్చేసరికి ఆ సంఖ్య నాలుగు కోట్లకు పైగా చేరింది. తెలుగు రాష్ట్రాలలో ఈ కులాల వారు 12 -15 మిలియన్‌లుగా అంటే రాష్ట్రాల జనాభాలో 13 -15 శాతం మంది ఉన్నప్పటికీ సరియైన ప్రాతినిధ్యం కూడా లేదు. దేశంలో తరతరాలుగా ఈ వృత్తిలోనే జీవించే కులాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుశాలి, సాలి, తొగటశాలీలు, స్వకులశాలి, కురిమిసెట్టిశాలి, సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, కరికాలభక్తులు, తొగుల వీరక్షత్రియ, సాధనాశూరులు, అచ్చుకట్లవాళ్ళు, దూదేకుల, కుర్ని, ఖత్రి, నీలి, నీలకంఠి, కోష్ఠి, నక్కల, పట్కార్, కైకోల, కైకోలన్, సెంగుండం, సెంగుంతర్, సాలివన్, నెస్సి మొదలైన కులాలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ కులాలు ఎంబీసీ జాబితాలో ఉన్నాయి.  ఇరు రాష్ట్రాల మొత్తం 294 శాసనసభ నియోజకవర్గాల్లో 60-70 నియోజకవర్గాలలో గెలుపుపై ప్రభావం చూపగల స్థాయిలో చేనేత కులాల వారు ఉన్నారు. ఇక్కడున్న సమస్య అల్లా ఒక్కటే చేనేత కులానికి చెందిన వారే.. ఇక్కడ సామాజిక వర్గాల్లో వర్ణాలు వేర్వేరుగా ఉండటంతో వీరు మా వారు కారు అనే లక్ష్మణరేఖ గీసుకున్నారు.

 కాలక్రమంలో చేతనే సామాజిక వర్గం చేసిన తప్పుని ఇతర సామాజిక వర్గాలు వారికి అనుకూలంగా మార్చుకొని వర్ణాలు వేరైనా.. మేమంతా ఒక్కటే సామాజిక వర్గానికి చెందిన వారమని వారి బలాన్ని ప్రదర్శించుకుని రాజకీయం ఎదిగారు. అంతా అయిపోయిన తరువాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి అన్నట్టుగా చేనేత సామాజిక వర్గం చాలా కాలం బల ప్రదర్శనలో వెనుకబడిపోయింది. కానీ ఇపుడు కేంద్రం మళ్లీ కుల, జన గణన చేపడుతుండటంతో ఇతర సామాజిక వర్గాలు మాదిరిగా సామాజిక వర్గం వర్ణాలు కాకుండా ఒక్కటే సామాజిక వర్గం అనే విధంగా ఒకే తాటిపైకి వస్తే తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రంలోనూ అదిపెద్ద మూడవ సామాజిక వర్గంగా అవతరిస్తుందనే అంశం ఇపుడు మిగిలిన సామాజిక వర్గాలను కలవరపెడుతున్నది. వారి బల ప్రదర్శన చేయడానికి సదరు సామాజిక వర్గాల్లోని వారు కూడా వర్ణంతో సంబంధం లేకుండా ఒక ప్రధాన సామాజిక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని కుల ప్రదర్శన చేయడానికి సిద్దపడుతున్నారు. 

2027కి పూర్తవనున్న జన కుల గణన అనంతరం అధికారిక లెక్కలు ఏ సామాజిక వర్గాన్ని ఏ స్థాయిలో నిలబెడుతుంది..? ఎవరికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తారు..? ఎవరి సామాజిక వర్గం బలం.. బలగం ఎంతో తేలిపోయి.. రాజకీయ ప్రకటనలకు తెరపడుతుంది. అపుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయపార్టీలు కూడా ఒక అంచనాకు వస్తాయి. 15ఏళ్ల తరువాత జరుగుతున్న ఈ కుల, జన గణన ఫలితాల కోసం వేచి చూడటమే తరువాయి..!

viskahapatnam

2025-06-17 10:47:46

ఇట్లు నాన్నకు ప్రేమతో.. మీ పిల్లలు..!

నాన్నంటే నీలాకాశం.. దానికి కొలమానం ఉండదు..చూపించే ప్రమకూ హద్దుండదు.. పదినెలలు కడుపున మోసి అమ్మ జన్మనిస్తే.. జీవితాం తం పెంచి పోషించి నాన్న జీవితాన్ని ఇస్తాడు.. కొవ్వొత్తుని చూసినపుడుల్లా నాన్నే గుర్తుకి వస్తాడు. పిల్లల జీవితాల్లో వెలుగుని నింపడానికి తాను కరిగిపోతాడు. వయసు మీదనవేసుకొని లొంగిపోతాడు. నాన్న అనే పదం ప్రతీ బిడ్డ జీవితంలోనూ 6వ నెల నుంచి 8వ నెలలోనే మొదలవుతాయి. తొలుత బిడ్డ అమ్మ అనే పదం నేర్చుకుంటే.. తరువాత పదం నేర్చుకునేది నాన్ననే. అక్కడి నుంచి తాను భారం మోస్తూ.. మనకి జీవితాలను తేలిక చేస్తాడు నాన్న. అమ్మ, నాన్న ప్రతీ ఒక్కరికీ రెండు కళ్లు. ఏ ఒక్క కంటికి ఇబ్బంది వచ్చినా జీవితమే అంధకారం అవుతుంది. రక్తాన్ని పంచి అమ్మ జీవం పోస్తే.. తాను శ్రమించి ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తాడు. అమ్మను మించిన దైవం లేదు.. నాన్న ను మించిన అర్ధం లేదు. నాన్న అనే పదం ప్రతీశ్వాసలోనూ మనల్ని బ్రతికిస్తుంటే.. ప్రతీ శ్వాసను త్యధిస్తూ.. జీవితాన్ని ధారపోస్తాడు. 

నడక నేర్చిన దగ్గర నుంచి నడవడిక నేర్చుకునే వరకూ అందరికీ నాన్నే రోల్ మోడల్. అదే నాన్న ఒక ఉన్నతస్థానంలో ఉంటే.. దానిని సమాజం కీర్తిస్తే.. ఇక నాన్న మనకే కాదు అందరికీ రోల్ మోడల్ అయిపోతాడు. అలాంటి నాన్న మనకి నాన్న అయ్యాడంటే దేవుడు సృష్టి ఎంతటి గొప్పదో అర్ధమవుతుంది. బిడ్డగా పుట్టి.. పౌరుడిగా ఎదిగి.. మనిషిగా మారడానికి మార్పు చెందడం వెనుక నాన్న కృషి, పట్టుదల, శ్రమ వెలకట్టలేనివి. ఈ సృష్టిలో  నాన్న ఉన్నవారు అదృష్టవంతులు.. నాన్న లేనివారు దురదృష్టవంతులనే చెప్పాలి. ఒకరకంగా నాన్న లేకపోవడం శాపంగానే భావిస్తారు అంతా. సుఖంలోనూ, బాధలోనూ, ఆనందంలోనూ, ఆప్యాయతలోనూ అన్నింటా మనవెనుక ఉండేది నాన్న మాత్రమే నాన్న లేకపోతే బిడ్డకు గమనం లేదు. నాన్న లేకపోతే మన బ్రతుకుకి అర్ధం లేదు.. నాన్న లేకపోతే సృష్టి మనుగడే ప్రారంభంకాదు. అందుకే నాన్నను దేవుడితో పోలుస్తారు. దేవుడంటే భక్తుల కోర్కెలు తీర్చేవాడు.

 అలాగే నాన్నఅంటే  బిడ్డల ఆనందాలు, సంతోషాలను తీర్చేవాడు.. తీరుస్తుంటాడు.  ఒక కుటుంబం ఆనందంగా ఉంటుందంటే అందులో నాన్న పాత్ర వెలకట్టలేనది. అమ్మ కుటుంబాన్ని విస్తరిస్తే.. నాన్న కుటుంబానికి గౌరవం తీసుకు వస్తాడు. నాన్న వెన్నంటే ఉంటే నిజంగా పండుగే.. అదే నాన్న లేకపోతే జీవితం కూడా దండగే. ప్రతీ జీవి నాన్నను నా తొలి హీరో అంటాడు..  నాన్నను చూసే బిడ్డ కూడా అన్నీ నేర్చుకుంటాడు. ప్రతీ ఒక్కరి జీవితంలో నాన్న కొండంత అండ, చలువ నీడనిచ్చే చెట్టు.. ప్రాణాన్ని నిలబెట్టే ఆయువు. ఆ ఆయువును పెంచి పోషించడానికి నాన్న పడే కష్టం అంతా ఇంతా కాదు. బిడ్డకు నాన్న తోడుంటే అన్ని విషయాలు నాన్నతో పంచుకుంటాడు. అదే నాన్న లేకపోతే నాన్న ఉన్నవారి చూసి ఆనందపడి.. నాన్న లేనందుకు కడివెడు కన్నీళ్లు కారుస్తూ.. నీలాకాశంలో దేవుడి దగ్గర ఉన్న నాన్నను తలచుకొని ఆకాశం వైపే చూస్తూ.. నాన్న నువ్వు నా దగ్గర లేవు. నేను నా ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలని నాన్న అంటూ బాధపడతాడు. 

నాన్న అనే పదం విన్నప్రతీసారీ నువ్వే గుర్తొస్తున్నావు. మళ్లీ ఎప్పుడు నువ్వు కనిపిస్తావు నాన్న అంటూ దేవుడిని వేడుకుంటూ నాన్నను స్మరించుకుంటాడు. యుక్త వయస్సుకి వచ్చిన తరువాత మా నాన్న నా కడుపున పుట్టాలనుకుంటాడు. అలా మగబిడ్డ పుడితే నాన్నగానూ, ఆడబిడ్డ పుడితే అమ్మగాను అనుకుంటాడు. నాన్నకు దూరమైన లోటుని తనకి పుట్టిన బిడ్డతోనే అన్నీ పంచుకుంటాడు. నాడు పిలవలేని నాన్న అనే పదం తన బిడ్డను ప్రతీసారి నాన్న నాన్న.. అంటూ పిలిచి మురిసిపోతాడు. అంతటి నాన్నకోసం ఏమని చెప్పాలి.. ఎలా చెప్పాలి.. ఆకాకాశమంత నాన్నను ఎలా ఒడిసి పట్టాలి.. ప్రతీ ఏడాది జూన్ 2వ ఆదివారం వచ్చే నాన్నల దినోత్సవరం రోజున నాన్న కోసం ఇలా చెప్పుకొని మురిసి పోవడం తప్పా.. కొందరికి నాన్న దగ్గరున్నా వారికి నాన్నవిలువ తెలియదు.. విలువ తెలిసే వారికి నాన్న దగ్గరుండడు. ఇదే విధి ఆడిన వింత నాటకం. నాటకంలో అన్ని పాత్రలు సజీవంగా ఉంటే దేవుడి కరుణ.. అందరిలో ఏ ఒక్కరిని మనకి దూరం చేసినా  ఆ దేవుడి శాపమే అనుకోవాలి.. ఇంత చెప్పినా మాకు ప్రతీ పదంలో మీరు గుర్తొస్తూనే ఉంటారు. ప్రతీ నాన్నకు ఈ అక్షరాలను అంకిత మిస్తూ.. ఇట్లు నాన్నకు ప్రేమతో మీ పిల్లలు..!

visakhapatnam

2025-06-15 12:25:38

సోషల్ మీడియాలో వాట్సప్ నే నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే..?!

పెరుగుట విరుగట కొరకేనని సోషల్ మీడియా యాప్ వాట్సప్ ఇప్పుడిప్పుడే వినియోగదారుల అకౌంట్ లను నిలిపివేస్తూ.. హెచ్చరికలు జారీ చేస్తున్నది. షడన్ గా యాప్ ని నిలుపుదల చేసి దిస్ అకౌంట్ కెన్ నో లాంగర్ యూజ్ డ్యూటు ది స్పామ్ అని చెప్పి ఏకంగా 24 గంటలు ఆపేస్తున్నది. ఆ తరువాత వాట్సప్ కి సాంకేతిక సిబ్బంది కాళ్లా వేళ్లా పడితే తప్పా మళ్లీ వాట్సప్ యాప్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. మనకి అత్యవసర సమయంలో వాట్సప్ నిలిచిపోతే పరిస్థితి ఏంటి..? అప్పటి కప్పుడు జరగాల్సిన పనులు ఏం కావాలి అనే అలోచనకు సోషల్ మీడియా దిగ్గజం టెలీగ్రామ్ యాప్ ను కూడా వినియోగదారులు ఇపుడు వినియోగించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఖచ్చితంగా సమాచార విస్తరణ, సేకరణ కోసం ఖచ్చితంగా టెలీగ్రామ్ యాప్ వినియోగించాల్సిన ఆవశ్యకతను వాట్సప్ పరోక్షంగా చెప్పకనే చెబుతున్నట్టు అవుతోంది. ఏ మీడియాలో ఉన్నవారి నెంబరో, లేదంటే ఏ ప్రయాణంలో ఉన్నప్పుడో, పిల్లలు విదేశాల్లో చదువుతున్నప్పుడో వాట్సప్ షడన్ గా ఆగిపోతే పరిస్థితి ఏంటినేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన సమయం ఆశన్నమైంది. 

స్పామ్ కాల్స్, స్పామ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారని.. లేదంటే ఏఐ అనుకోకుండా మీ వాట్సప్ అకౌంట్ ని నిలుపుదల చేసిందని, లేదంటే బ్యాన్ చేసిందనే సమాచారం వినియోగదారులకు అగ్ని పరీక్షలాంటిదే. ఇలాంటి విపత్కర సమయంలో టెలీగ్రామ్ యాప్ ఆపద్భాందవుడిగా వినియోగదారులకు చాలా చక్కగా ఉపయోగ పడుతున్నది. అంతేకాదు వాట్సప్ కంటే అత్యధిక ఫీచర్లు టెలీగ్రామ్ లో ఉన్నాయి. పెద్ద వీడియోలతోపాటు, ఎంతటి భారీ ఫైల్స్ అయినా టెలీగ్రామ్ ద్వారా షేర్ చేసుకోవడానికి అవకాశం వుంటుంది. అంతేకాకుండా వాట్సప్ కంటే అత్యధికంగా సెక్యూరిటీ ఆప్షన్స్ కూడా టెలీగ్రామ్ లో ఉన్నాయి. కానీ ఎందుకనో వాట్సప్ ను మాత్రమే చాలా మంది వినియోగిస్తున్నారు. కానీ.. ఇపుడు అలా వాట్సప్ పైనే నమ్మకం పెట్టుకొని దానిని మాత్రమే వినియోగిస్తే నట్టేట ముగినిపోవడం ఖాయమని వాట్సప్ ఒక్కక్కరికీ బ్లాక్ అవుతున్నప్పుడు గానీ తెలిసి రావడం లేదు. 

వాట్సప్ లో ఏఐ టూల్ వచ్చిన తరువాత మరిన్ని ఇబ్బందులు తలెత్తులున్నాయి వాట్సప్ వినియోగదారులకు అయినా వాట్సప్ నే వినియోగిస్తున్నారు తప్పితే ఇబ్బందులు పడేకంటే చక్కగా టెలీగ్రామ్ వినియోగిస్తే బెటర్ అనే ఆలోచన మాత్రం రావడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో వాట్సప్ ఇబ్బడి ముబ్బడిగా చాలా మంది అకౌంట్లను బ్యాన్ చేయడంతో వాట్సప్ వినియోగ దారులందరూ ఆలోచనలో పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారస్తులపై ఈ వాట్సప్ బ్యాన్ తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. మీడియాలో పనిచేసేవారు అత్యధికంగా సమాచారం అన్ని వర్గాల వారికి షేర్ చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో అదునుచూసి వాట్సప్ బ్యాన్ అయి 24 గంటలు ఎలాంటి ఉలుకూ పలుకూ లేకపోవడం కూడా జర్నలిస్టులుకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడున్నది. దానితో ఇపుడు సోషల్ మీడియా యాప్స్ ఒకే దానిని నమ్ముకుంటే కాదని.. ఖచ్చితంగా టెలీగ్రామ్ యాప్ కూడా వినియోగించాలనే నిర్ణయానికి వచ్చారు.

 ఆ లోచన రావడంతోనే వాట్సప్ తోపాటు, టెలీగ్రామ్ యాప్ ను కూడా వినియోగించే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతున్నది. సోషల్ మీడియాని అలవాటు చేసిన మెటా ఇపుడు ఏఐ టూల్, ఇతరత్రా కారణాలతో వాట్సప్ ను బ్యాన్ చేస్తుండటంతో అందరూ టెలీగ్రామ్ కి మారుతున్నారు. వాట్సప్ ఇదే బ్యాన్ పద్దతిని కొనసాగితే టెలీగ్రామ్ యాప్ అత్యంత త్వరగా అన్ని వర్గాలకు చేరువ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం వాట్సప్, మెటా యాజమాన్యాలకి తెలిసినా లైట్ తీసుకుంటున్నాయి తప్పితే చేస్తున్న తప్పులకు, అకౌంట్ బ్యాన్ వంటి అంశాల విషయంలో  ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడం లేదు. అదీ కూడా ఒకందుకు మందిచే అవుతుందని చెబుతన్నారు విశ్లేషకులు. ఎల్లప్పుడూ ఒకే సోషల్ మీడియా యాప్ ని వినియోగిస్తే.. వాడి చేతుల్లోకే వినియోగదారులు వెళ్లిపోతారని.. ఆ పరిస్థితి మారాలాంటే వినియోగదారులు బహు విధాలుగా ఉపయోపడే సెక్యూరిటీ ఉన్న సోషల్ మీడియా యాప్స్ ని సేఫ్ సైడ్ గా పెట్టుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఎంతో నమ్మకాన్ని కూడగట్టుకున్న మెటా వాట్సప్.. ఇపుడు అదే నమ్మకాన్ని వినియోగదారుల పాలిట భయంగా మార్చుకుంటున్నది..?!

visakhapatnam

2025-06-10 17:51:04

డేంజర్ బెల్స్.. ఆర్ఎన్ఐ మీడియా గణన వాస్తవ మీడియా లెక్కతేలుస్తుంది..?!

ప్రతీ పదేళ్లకొకసారి జనాభా గణన జరుగుతున్నట్టుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన మీడియా గణన కూడా జరిగితే వాస్తవ మీడియా లెక్కతేలుతుంది. లేదంటే ఏది మీడియానో.. ఏది సోషల్ మీడియానో తెలియక  అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఫలితంగా వాస్తవ మీడియాలో పనిచేస్తున్నవారికి గుర్తింపు లేకుండా పోతున్నది. సాధారణంగా అయితే ఆర్ఎన్ఐ నుంచి గుర్తింపు పొంది, లైసెన్సు పొందిన దిన పత్రికలు అనునిత్యం పత్రికలు ముద్రించి డాక్యుమెంటేషన్ పక్కాగా చేస్తేనే వాటికి గుర్తింపు వుటుంది. రాష్ట్రాల్లో అయితే ముద్రించిన పత్రికను సమాచారశాఖకు ఆధారంగా చూపించడంతోపాటు, బయట మార్కెట్ లో కూడా కొద్దోగొప్పొ కనిపించినపుడు సదరు మీడియాకి గుర్తింపు వుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అగ్రభాగన రాజ్యమేలుతుండటంతో.. నిజంగా వున్న మీడియా ఏదో.. లేని మీడియా ఏదో ఎవరికీ తెలియడం లేదు. రెగ్యులర్ గా మీడియా సంస్థలు రన్ చేస్తూ.. డాక్యుమెంటేషన్ రాష్ట్రాల సమాచారశాఖ కార్యాలయాలకు అందేజేస్తున్నవారు.. లైసెన్స్ తీసుకొని పత్రికలు ముద్రించిన వారు కూడా కూడా పీడీఎఫ్ లో రాజ్యమేలుతున్నారు.

 ఫలితంగా కొన్ని రాష్ట్రాల్లో సమాచారశాఖ అధికారులు వద్ద చులకన అవ్వాల్సి వస్తున్నది. సాధారణంగా ఒక మీడియా సంస్థను రన్ చేయాలంటే సాధారణ విషయం కాదు. ఒక దిన పత్రికనే తీసుకుంటే ఒక చీఫ్ ఎడిటర్, ఇద్దరు సబ్ ఎడిటర్లు, ఒక పేజ్ డిజైనర్, ఒక ఫోటో గ్రాఫర్, కార్యాలయ సిబ్బంది, కార్యాలయం, ప్రింటర్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్, స్కానర్లు,  రిపోర్టర్ల నెట్వర్క్, కొన్ని ప్రాంతాల్లో లేకపోతే న్యూస్ ఏజెన్సీల నెట్వర్క్ సహాయంతో పత్రికలు బయటకు తీయాల్సి వుంటుంది. అందులోనూ సొంతంగా ప్రింటింగ్ యూనిట్లు ఉంటే ఒకలా.. లేదంటే అద్దె ప్రింటింగ్ యూనిట్ల ద్వారా నైనా పత్రికలు ముద్రణ చేసుకొని మేము పత్రికలు రెగ్యులర్ గా బయటకు తీస్తున్నామని చెప్పుకోవాల్సి వచ్చినపుడు ముద్రించిన పత్రికలను సమాచారశాఖ కార్యాలయంలో అటెండెన్సుకి ఇవ్వాల్సి వస్తున్నది. ఇపుడు ఆర్ఎన్ఐ(పీఆర్జీఐ) కూడా ఒక్క అడుగు ముందుకి వేసి ఏరోజు పత్రిక ముద్రిస్తే ఆ రోజు పత్రికను ఆన్ లైన్ లో అప్లోడ్ చేయమని పత్రికలకు ఆర్డరు వేసింది. వాస్తవానికి ఆర్ఎన్ఐ వెబ్ సైట్ పూర్తిస్థాయిలో లేకపోయినా.. పత్రికల సౌలభ్యం కోసం దానిని అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. 

ఇదే సమయంలో ఇబ్బడి ముబ్బడిగా పత్రికలు రిజిస్ట్రేషన్లు చేసిన వారంతా వారు కూడా పత్రికలు రన్ చేస్తున్నామని చెప్పుకోవడానికి తయారు చేసిన పత్రికల పీడీఎఫ్ లతో హల్ చల్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు, అధికారులు, ఇతర వర్గాలకు సమాచారం తక్షణమే రావడం, అది కూడా పత్రికలైతే పీడీఎఫ్ లు, టివి ఛానల్ అయితే యూట్యూబ్ లింక్, యాప్, వెబ్ సైట్, ఇలా అనేక సోషల్ మీడియా మార్గాల్లో సత్వరమే కోరుతున్నారు. దీనితో ఆర్ఎన్ఐ వద్ద రిజిస్ట్రేషన్లు చేసుకున్నవారంతా లైసెన్స్ నెంబర్లు పత్రికపైన వేసి పీడీఎఫ్ లతోనూ, ప్రధాన వార్తల క్లిప్పింగులతోనూ రాజ్యమేలుతున్నారు. వీరందరినీ కట్టడి చేయడానికి మీడియా గణన చేయడానికి  ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(పిఆర్జీఐ)(గతంలో ఆర్ఎన్ఐ-రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా గా ఉండేది) నడుంబిగించింది. ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్న పత్రికలు ముద్రణ చేస్తే 48 గంటల్లో వాటిని ఆన్ లైన్ ప్రెస్ సేవా పోర్టల్ లో అప్లోడ్ చేయాలి.  అలా చేసిన పత్రికలనే పీఆర్జీఐ(ఆర్ఎన్ఐ) సక్రమంగా వచ్చే పత్రికలుగా గుర్తించాలని నిర్ణయించింది. దీనితో సక్రమంగా పత్రికలు నడుపుతున్నవారంతా  పత్రిక ముద్రిస్తే ఆన్ లైన్ లో ఫోటో అప్లోడ్ చేస్తున్నారు. లేదంటే అలాగే వదిలేస్తున్నారు. 

ఒక్కోసారి పీఆర్జీఐ వెబ్ సైట్ సాంకేతిక సమస్య ఎదురైతే వారికి మెయిల్స్ పెట్టి సమస్య పరిష్కారం అయిన తరువాతనైనా వాటిని రన్ చేస్తున్నారు. కానీ ఇవేమీ తెలియకుండా  కేవలం గతంలో ఆర్ఎన్ఐ సర్టిఫికేట్ పొంది పత్రికలు నిర్వహణ చేయకుండా, అవసరం ఉన్నపుడు మాత్రమే బయటకు తీసేవారికి గత ఆర్ఎన్ఐ, ప్రస్తుతీ పీఆర్జీఐ లక్షణ రేఖ విధించినట్టుగానే బావించాలి. ఒక రకంగా ఇదే మీడియా గణన అధికారికంగా రూపాంతరం చెందే అవకాశాలు కూడా లేకపోలేదు. అపుడు సక్రమంగా పత్రికలు నడిపేవారి లైసెన్సులు మాత్రమే ఉంటాయని.. నిర్వహణ చేయని వారి లైసెన్సులు రద్దు అయ్యే అవకాశాలు లేకపోలేదని కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి.  తొలుత నిర్లక్ష్యం వహించే వారికి తొలుత అపరాద రుసుము విధించిన తరువాత. రెండవ చర్యగా లెసెన్సులు రద్దు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తారట. కాగల కార్యం గందర్వులకెరుక.  అదే సమయంలో రాష్ట్రసమాచారశాఖ కూడా రెగ్యులర్ గా వచ్చే పత్రికలకు గుర్తింపు ఇవ్వడం, రెగ్యులారిటీని చూడటం ప్రారంభిస్తే తద్వారా రాని రిజిస్ట్రేషన్ పత్రికలు నియంత్రణ ప్రారంభం అవుతుంది. ఆర్ఎన్ఐ మీడియా గణన ఫలితాలను ఇస్తుంది..!

Visakhapatnam

2025-06-09 09:52:54

పేదోడి చద్దిబువ్వకి స్టార్ హోటల్ లో ఖరీదైన పొద్దొచ్చింది..!

చద్దన్నం..ఈ మాటా ఈరోజుల్లో చాలా మంది మరిచినపోయిన పదం. కానీ నేటి తరం బడాబాబులకు మాత్రం ప్రతీరోజూ ఉదయాన్నే గుర్తొచ్చే స్తోంది. ప్రస్తుతం పేదోడు గ్రామాల్లో ముద్దుగా.. వాడుక పదంలో పిలిచే సల్దన్నం.. చద్దన్నానికి స్టార్ హోటల్ లో ఖరీదైన పొద్దొచ్చింది. నిరుపే దలు అనునిత్యం ఆ చద్ది బువ్వ మాత్రమే తిని ఆరోగ్యంగా ఉంటూ.. ఖరీదైన యుగం ప్రారంభం అయ్యాక టిఫిన్లకు అలవాడు పడ్డాడు. కాల క్రమం లో సోషల్ మీడియా ప్రభావం కాస్త సాంప్రదాయ రుచులు, వంటలు, ఆరోగ్యకరమైన ఆహారాలపై పడటంతో నేడు అదే చద్దన్నం( సల్దన్నం) నేడు స్టార్ హోటల్స్ నూ చాలా కాస్ట్ లీ మెనూగా దర్శనమిస్తున్నది. ఇంట్లో పెడితే తినని వారంతా నేడు హోటళ్లకు వెళ్లి చద్దిబు వ్వ ఆర్ఢర్ ఇచ్చి.. జీఎస్టీతో కూడిన బిల్లు కట్టి మరీ తింటున్నారు. ఒక నాడు పేదోడి గడప కూడా దాటని ఈ చద్దన్నం నేడు ఖండాంత రాలు దాటి పయనిస్తున్నది. ప్రస్తుతం స్టార్ హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ లో మెయిన్ మెనూ క్రింద మారిపోయింది. 

సాధారణంగా అయితే ఈ చద్దన్నం హోటళ్లలో ప్లేట్స్ లోనే పెట్టాలి. కానీ చద్దన్నం కుండలో తింటేనే దాని యొక్క విలువలు, పోషకాలు తిన్న శరీరారానికి వంటపడతాయ్. దానికి అనుగుణంగానే ఇపుడు కుండల్లోనే వడ్డిస్తున్నారు. అన్నట్టు ఇక్కడ కుండలోని చద్దిబువ్వకి రేటు కూడా కాస్త ఎక్కువే తీసుకుంటున్నారు. అంతేకాదు ఏ ప్రాంతానికి తగ్గ మాండలికంతో పిలిస్తే అంత స్టేటస్ ఇపుడు ఈ స్టార్ హోటల్స్ లో కూడా.. ఒకప్పుడు మేము స్టార్ హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేశామని కాస్త డబ్బు మదంలో చెప్పుకునేవారంతా.. నేడు మేము అదే స్టార్ హోటల్ లో ఆర్గానిక్ చద్దిబువ్వ తినొచ్చామని చెప్పుకోవడం నిజంగా చద్దన్నానికి గౌరవం పెరిగినట్టుగానే చెప్పుకోవాలి. సామాజిక మాద్యమాల నుంచి గుగూల్, స్టార్ హోటల్స్ చేసే ప్రమోషన్స్ లో కూడా ఈ చద్ది బువ్వకి ప్రాధాన్యత ఇస్తున్నారంటే దీని విలువ ఏఐ రోజుల్లో కూడా ప్రజలకు.. అందులోనూ డబ్బున్న ప్రజలకు ఎంత బాగా అర్ధం అయ్యిందోననే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి. 

సామాజిక మాద్యమాలు యువతను ఏ స్థాయిలో పెడ త్రోవని పట్టిస్తున్నాయో.. అంతకంటే ఎక్కువగా సంపన్నవర్గాలను చైతన్యం చేయడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. నిరుపేదల ఇంట్లో కూడా ఇపుడు అనునిత్యం చద్దిబువ్వకి ప్రాధాన్యత పెరుగుతున్నది. బయట తినే బ్రేక్ ఫాస్ట్ లతో కడుపు మంటలు తెచ్చుకుని బాధపడేవారంతా ఇపుడు చక్కగా ఇంట్లోనే ఉదయాన్నే చద్దిబువ్వ తినేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగని జంక్ ఫుడ్ కి ప్రాధాన్యత లేదా అంటే మాత్రం దాని స్థానం దానిదే. కానీ క్రమేపీ నాటి సాంప్రాదయ ఆరోగ్యకర వంటలకు సముచి స్థానం పెరుగుతోందని మాత్రం నేటి స్టార్ హోటల్స్ అధిరాకంగా రుజువు చేస్తున్నాయి. అంతేకాదు యూట్యూబ్, ఇనిస్టాగ్రామ్, ఫేస్ బుక్ వీడియోస్ పుణ్యమాని ఈ చద్దిబువ్వను ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో తెలియజేసే వీడియోలు కూడా అన్ని వర్గాల వారిని తారా స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయి. వాట్సప్ లో స్టేటస్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిన తరువాత. ప్రతి నిత్యం చద్దిబువ్వ స్టేటస్ లు పెరుగుతున్నాయంటే చద్దన్నం విలువ ఏ స్థాయికి చేరుకుందో వేరేగా చెప్పాల్సిన పనిలేదు. 

చద్దిబువ్వే అందరూ తింటున్నారా అనడానికి కూడా లేదు. సంపన్నులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖరీదైన స్టార్ హోటళ్లకి వెళ్లి మరీ చద్దన్నం తింటుందే ఇపుడు అదే పేద వాడు నాటి సంపన్నులను అనుకరిస్తూ.. రోజుల తరబడి ఒకే నూనెలో వండి వండి వార్చిన టిఫిన్లు తిరి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఏటల్ల కాలం సద్దన్నమే తినాలా.. మేమూ టిఫిన్లు చేయగలమని బీరాలు పోయి..ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. పాడైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వేలు, లక్షలు ఖర్చు చేసి మరీ ప్రైవేటు ఆసుపత్రులను పెంచి పోషిస్తున్నారు. మళ్లీ ఇక్కడే అదే సోషల్ మీడియా ప్రభావం, ఇంటర్నెట్ పేదోడిని కూడా ప్రభావితం చేస్తుందని భావించాల్సి వస్తున్నది. సంపన్నులను, బడాబాబులను మార్చిన సోషల్ మీడియా నిరుపేదలను కూడా మారుస్తుందని... మార్చి తీరుతుందని మాత్రం గట్టిగానే నమ్మొచ్చు. కారణం అదే పేద వాడు కూడా ఇపుడు సోషల్ మీడియాకి బానిస కనుక. చద్దన్నం కోసం ఇంత తెలిసిన తరువాత దాని విలువ ఏంటో అర్ధమయ్యే ఉండాలి. మనం డబ్బుని సంపాదించొచ్చు.. జబ్బుని కొనితెచ్చుకోవచ్చు.. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం దానిని పెంచుకోవడం మనచేతుల్లోనే ఉంటుంది. అలాగని చద్దన్నమే తింటే ఆరోగ్యం వస్తుందని కూడా చెప్పడం లేదు. ఏ ఆహారం విలువ దానిది. కాకపోతే ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తీసుకోవడంలో ప్రాధాన్యత ఉండాలనే విషయం అందరికీ అర్ధం కావాలి..!

visakhapatnam

2025-06-01 14:01:30

ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్, డా.లక్ష్మయ్యల పై జాతీయ ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ లో ఆయుష్ వ్యవహారం ఢిల్లీలోని జాతీయ ఎస్సీ కమిషన్ వరకూ వెళ్లింది. విశాఖజోన్-1 లో ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ దళిత వైద్యులను కించపరుస్తూ మాట్లాడటం, కార్యాలయంలోని  దళిత ఉద్యోగినిపై చేయిచేసుకోడం, ఆపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయినా. బాధితులకు న్యాయం జరగకపోవడంతో వీరంతా జాతీయ ఎస్సీ కమిషనకు ఫిర్యాదు చేశారు. దళిత ఉద్యోగులను సదరు ఇన్చార్జి ఆర్డీడి ఏ విధంగా కులం పేరుతో దూషిస్తున్నారని( మాల నాకొడకా.. మాదిగ నాకొడకా..)అనే పద ప్రయోగం.. ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఉద్యోగులను, వైద్యులను అంటరాని వాళ్లగా చూస్తున్న వైనాన్ని కూడా బాధితులు సదరు ఫిర్యాదులో పొందు పరిచారు. అంతేకాకుండా వేధింపులకు గురిచేయడంతోపాటు, తిరిగి ఉద్యోగులపైనే కేసులు పెట్టి మరి బెదిరింపులకు దిగుతున్న విషయాన్ని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంలో  డా.కె.లక్ష్మయ్య( ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకుడు) అనే ప్రైవేటు వ్యక్తి ఇన్చార్జి ఆర్డీడి డా..ఝాన్సీలక్ష్మీభాయ్ విషయంలో బ్రోకర్ గా వ్యవహరిస్తూ.. వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి , ఆయుష్ కమిషనర్ కార్యాలయాలు, ఆరోగ్యశాఖ మంత్రి ఫేషీ, డబ్బులతో  రాష్ట్ర అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేద వ్యక్తం చేశారు. ఇన్చార్జి ఆర్డీడిపై విశాఖపట్నంలోని పీఎంపాలెం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైనా.. పదుల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లినా ప్రభుత్వం వరకూ చేరకుండా.. ఈమెపై చర్యలు పడకుండా డా.కె.లక్ష్మయ్య( గుంటూరు, ఢిల్లీ లలో ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వహించే వ్యక్తి) మొత్తం వ్యవహారాన్ని తప్పుదోప పట్టిస్తున్నారని, అంతేకాకుండా ఫిర్యాదులన్నీ విచారణ వరకూ వెళ్లకుండా అడ్డుకోగలుగుతున్నారని పేర్కొన్నారు.

 గతంలో మూడేళ్ల పాటు విధినిర్వహణ చేయకుండా జీతాలు తీసుకున్న విషయమై, అన్ని పనులకు లంచాలు తీసుకున్న అంశంలోని ఫిర్యాదులపై నేటి వరకూ విచారణ చేయలేదని.. ఈ విషయం అన్ని ప్రింట్, అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో కూడా వచ్చిందని కూడా ఆ ఫిర్యాదులో పొందుపరిచారు. ఈమె విధుల్లోకి 1999లో శ్రీకాకుళం జిల్లాలోని సింగుపురం ఆయుర్వేద డిస్పెన్సనీలో చేరారని అప్పటి నుంచి ప్రతీ సారి ఏదో ఒక్క ప్రజావ్యతిరేక వ్యవహారాలతోనే కాలం గడుపుతూ వచ్చేవారని, డిస్పెన్సరీకి వచ్చిన రోగులకు కనీసం మందులు కూడా సక్రమంగా ఇచ్చేవారని కారని పేర్కొన్నారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈమె సర్వీస్ మొత్తం ప్రజాభియోగాలు, కార్యాలయ ఉద్యోగాభియోలతో నడిచిందని.. ఇలాంటి ప్రజా, ప్రభుత్వ వ్యతిరేక వైద్యాధికారిపై ఆంధ్రప్రదేశ్ లోని వైద్యఆరోగ్యశాఖలోని సర్వీస్ రూల్స్ ను అనుసరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ వ్యవహారాల్లో డా.కె.లక్ష్మయ్య( గుంటూరు, ఢిల్లీ లలో ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వహించే వ్యక్తి) యొక్క వ్యవహారంపై కూడా జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ చేయించి న్యాయం చేయాలని బాధితులందరూ లిఖితపూర్వకంగా జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

 ముఖ్యంగా సదరు ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీ భాయ్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని  కొన్ని డిస్పెన్సరీల వైద్యాధికారులు, సిబ్బందిని టార్గెట్ చేసి.. మీడియా వేదికగా తప్పులను ఎత్తిచూపించే ప్రయత్నం చేస్తున్నారని.. మీడియాను తమపైకి, డిస్పెన్సీలకు విజిటింగ్ లకు పంపిస్తూ.. ఆమెకు అనుకూలంగా వార్తలు రాయిస్తూ.. వాటి ఆధారంగా దళిత వైద్యాధికారులు, సిబ్బందిపై వేదింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేయకుండా.. 

ఆయుష్ లో దళిత వైద్యులు, ఉద్యోగులపై కొనసాగుతున్న వివక్ష,   వేధింపులు నుంచి రక్షించాలని, నిమ్న జాతీయులపై జిల్లా అధికారుల దాడులు, అంటరాని తనాన్ని నిర్మూలించి ఎస్సీ సామాజిక వైద్యులు, ఉద్యోగులకు న్యాయం చేయాలని, ఆయుష్ శాఖలో డా.కె.లక్ష్మయ్య( గుంటూరు, ఢిల్లీ లలో ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వహించే వ్యక్తి)  వ్యవహారాన్ని నియంత్రించి సదరు వ్యక్తిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. బాధితులు జాతీయ ఎస్సీ కమిషన్ కి చేసిన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. 



visakhapatnam

2025-03-10 06:44:44

అరకు పోయినా.. అడగరేం..?! కూటమి ఎంపీలపై ఉత్తరాంధ్ర వాసుల కన్నెర్ర

విశాఖ రైల్వేజోన్ ఉత్తరాంధ్ర ప్రజల సెంటింమెంట్..ఎన్నేళ్ల నుంచో నలుగుతున్న ప్రతిపాదన..భారతీయ రైల్వేకి ఆదాయం తెచ్చే డివిజ న్లలో రెండో అతిపెద్ద డివిజన్ వాల్తేరు మాత్రమే.. అదీ అరకు రూటులోని కెకె లైన్..సుమారు పదివేల కోట్లకు పైనే ఆదాయం ఇపుడు ఒరిస్సా జోన్ లోకి వెళ్లిపోయింది.. ఇంత జరుగుతున్నా కూటమి ఎంపీలు మాత్రం నోరు మెదపడం లేదు.. రైల్వేజోన్ సాధించామని సంబురాలు చేసు కుంటున్నారు తప్పితే.. జోన్ కి తల తీసుకెళ్లిపోయి.. కేవలం మొండెం మాత్రం మిగిల్చారనే విషయాన్ని గుర్తించడం లేదు..అందునా ఉత్త రాంధ్రాలోనే రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వ్యవహరిస్తున్నారు.. ఎంపీలు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే.. మన విశాఖ రైల్వో జోన్ పరిధిలోని అరకు లైన్ మనకి దక్కుతుంది... వైఎస్సార్సీపీ అరకు ఎంపీ తప్పా నేటికీ కూటమి ఎంపీలు ఈ విషయంలో పల్లెత్తు మాట కేంద్రం వద్ద మాట్లాడటం లేదు..!

అలా ఆదాయం వచ్చే కెకె లైన్ ను ఒరిస్సాకి కట్టబెట్టేసిన కేంద్రం.. ఎంగిలి చేత్తో కాకిని కొట్టినట్టు నామ్ కే వాస్తే విశాఖ జోన్ ను ఉత్తరాంధ్రకి విదిల్చింది. అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు. అలాగని అరకు, కెకెలైన్ ఒడిస్సాలోకి పోతున్నా వాల్తేరు డివిజన్ పరిధిలోకి వచ్చే 9 మంది ఎంపీలు నోరు మెదపడం లేదు. విశాఖ జోన్ వచ్చిందే చాలన్నట్టుగా మురిసిపోతున్నారు.  కేంద్రంలో చాలా పట్టువుందని చెప్పుకునే కూటమి ప్రభుత్వం వాల్తేరు రైల్వే డివిజన్ లో ఏడాదికి రూ.10వేల కోట్లు వచ్చే మార్గాన్ని ఒడిస్సాతన్నుకుపోతే నోరు మెదపలేదు. దీనితో ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం తలపెట్టినట్టైంది కేంద్రం. ఇప్పటి వరకూ వాల్తేరు డివిజన్ లో ఉన్న అరకు ఇప్పుడు ఒరిడ్సా లోని రాయగడ డివిజన్ కు వెళ్ళిపోయింది. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోరు మెదరపలేదు సరికదా.. రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న అనకాపల్లి ఎంపీతో కూడా ఒక్క మాట కూడా అడిగించలేదుకపోయింది.

 కానీ వైఎస్సార్సీపీ నుంచి  అరకు ఎంపీగా ఉన్న గుమ్మ తనూజా రాణి మాత్రం కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి.. ఒక వినతి పత్రాన్ని సమర్పించి ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో ఒక్క అడుగు ముందుకి వేశారు. విశాఖ రైల్వే జోన్ పరిధి  ఇపుడు కొత్త వలస వరూ మాత్రమే వుంది.. అక్కడి నుంచి మిగిలిన ప్రాంతం అంటే బచేలీ వరకూ ఉన్న రైల్వే లైను ఒరిస్సాలోని రాయగడ జోను బదిలీ అయిపొయింది. విశాఖలోని వాల్తేరు రైల్వే జోన్ కి  కిరండోల్ లైన్ నిజంగా  గుండెకాయలాంటిదే. జోన్ కి  ఏడాదికి రూ.10 వేల కోట్లకు పైనే ఆదాయం కిరండోల్ లైన్ మీదనే వచ్చే మార్గాన్ని రాయగడజోన్ తన్నుకు పోయింది. విశాఖ రైల్వే జోన్ లో కిరండోల్ లైను లేక పోతే ఉత్త జోన్ తప్పా మరేమీ లేదనే కేంద్రానికి రైల్వే ఆదాయం తెచ్చిపెడుతున్న రికార్డులు చెబుతున్నమాట. 

అత్యంత పెద్ద ఆదాయ వనరు జోన్ నుంచి విడిపోతే ఇలా ఎందుకు జరిగిందనే విషయాన్ని ఇప్పటి వరకూ డివిజన్ పరిధిలో ఉన్న  9 మంది కూటమి  ఎంపీల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. ఆది నుంచి వాల్తేరు రైల్వే డివిజన్ పైనా.. ఆంధ్రప్రదేశ్ ర్వైల్వేల పైనా ఒడిస్సా రాజకీయ నేతలు కేంద్రంలో చక్రం తిప్పుతూ వస్తున్నారు. ఇపుడు కొత్త జోన్ ఏర్పాటులో కూడా సరిగ్గా గురి చూసి దెబ్బ కొట్టడంతో దెబ్బకి ప్రధాన ఆదాయ వనసరు రాయగడ తరలిపోయింది. ఇంత జరుగుతున్నా విశాఖకు జోన్ వచ్చిందనే ఆనందం తప్పా జోన్ కి గుండెకాయలాంటి కెకె లైన్ పోయిందనే బాధ మాత్రం కూటమి ఎంపీల్లో కనిపించకపోవడం విశేషం. కేంద్రంపై కూటమి ఎంపీలు సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఒత్తిడి తెస్తే కెకెలైన్ విశాఖ రైల్వే డివిజన్ కు ఉంచేయడం కేంద్రానికి పెద్ద పనేమీ కాదు. కానీ ఎందుకనో ఆ ప్రయత్నం దిశగా ఎవరూ ఒక్క అడుగు కూడా వేయడం లేదు.

పర్యాటకం పరంగా ఆంధ్రప్రదేశ్ లోని అరకుకు ఎంతో ప్రాధాన్యత వుంది. దేశ, విదేశాల నుంచి పర్యాటకులు నిత్యం వస్తూనే వుంటారు. ఈ విషయాన్ని గుర్తించి ఒడిస్సా ప్రజాప్రతినిధులు దినిని గతంలోనే రాయగడ డివిజన్ కలిపేయాలని పట్టుబడితే హరిబాబు ఎంపీగా ఉన్నసమయంలో గట్టిగా పట్టుబట్టి మరీ దానిని నిలుపుదల చేయించారు. కానీ ఇపుడు కూటమి ఎంపీలు.. అందునా, విశాఖ ఎంపీ శ్రీభరత్, రైల్వే స్టాండింగ్ బోర్డ్ చైర్మన్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ లు సైతం ఈ విషయం ఒక్క మాట కూడా కేంద్రాన్ని అడగకపోవడం, ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  విశాఖ రైల్వే జోన్ లో కెకె లైన్ ను కేవలం మన ఎంపీల అసమర్ధత వలనే కోల్పోవాల్సి వచ్చిందని.. తద్వారా ఉత్తరాంధ్రకి తీవ్ర అన్యాయం జరుగుతుందని వక్తలు ఆవేదన చెందుతున్నారు. 

అయితే విశాఖకు రైల్వే జోన్  మేమే తెచ్చాం అంటూ కూటమి ప్రభుత్వం ప్రచారాలు చేసుకుంటున్నా.. గుండెకాయలాంటి కెకె లైన్ ని ఒడిస్సా కొట్టేస్తే చూస్తూ ఊరుకున్నారని.. అది నిజంగా విశాఖ రైల్వేజోన్ కి ద్రోహమేనని ఉత్తరాంధ్రవాసులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక మహిళా ఎంపీ గుమ్మతనూజా రాణి చేసిన విధంగా 8మంది కూటమి ఎంపీలు చేయలేకపోయారనే అపవాదుని మూటకట్టుకుంటున్నారు. పేరుకి వచ్చే జోన్ కంటే.. పేరుతోపాటు కాసులు తెచ్చే కెకెలైన్ తో కూడి విశాఖ జోన్ తీసుకువస్తే.. కూటమి ఎంపీలకి, ప్రభుత్వానికి మరింత గౌరవం పెరిగి ఉండేదని విశ్లేషకులు బావిస్తున్నారు. చూద్దాం ఇప్పటికైనా వాల్తేరు డివిజన్ లో ఉండే తొమ్మిది మంది ఎంపీలు ఏ మేరకు కోల్పోయిన కెకె లైను విషయంలో ఏ మాత్రం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తారనేది..?!

visakhapatnam

2025-02-10 05:54:08

మన్మోహన్ జీ మణ్ణించు.. అవి ఉత్తుత్తి సంతాపదినాలే..?! ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో న్యూయర్ వేడుకలు

భారతదేశంలో మాజీ ప్రధాని సంతాప దినాలంటే అపహాస్యమే.. పేరుకి సంతాప దినాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకిటించినా.. నేతలు మాత్రం ఆ మధ్యలో వచ్చే నూతన సంవత్సర వేడుకుల మాత్రం తూ..చా.. తప్పకుండా పాటించడానికి ముందుగానే మీడియా ప్రచారాలు చేసుకున్నారు.. అలా చేసుకునేపాలమే అయితే అసలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి తరువాత సంతాప దినాలు ప్రకటించడం దేనికి అంటే.. ఆ ఒక్కటీ అంటున్నారు తేడా రాజనీయనేతలు.. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు లాంటి వారు మాత్రం ముందుగానే ఈ ఏడాది తాను.. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నానని.. ఆరోజు తనను ఎవరూ కలవడానికి రావొద్దని..మాజీ ప్రధాని మృతితో రాష్ట్రంలో సంతాప దినాలు జరుగుతున్నాయని ఎంతో గౌరవంగా ప్రకటించారు..!

రాజకీయ నేతలకు సిగ్గుండదు.. వారి మాటలకు విలువ ఉండదు అంటే ఏమో అనుకుంటారు జనాలు కానీ.. వారే ప్రకటించి.. వారే పాటించని విధానాలు చూసినపుడు మాత్రమే తేడా రాజకీయనేతల గొప్పతనం బయట పడుతుంది. భారతదేశంలో ప్రధాని, రాష్ట్రపతి, తరహా వారు ఎవరైనా మృతి చెందితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదిరోజులు సంతాప దినాలు ప్రకటిస్తాయి. అంటే ఆ పది రోజుల్లో ఎలాంటి వేడుకలు, ఆర్బాటాలు చేయరు. అనూహ్యంగా ఇటీవలే మాజీ భారత ప్రధాని డా.మన్మోహన్ సింగ్ మృతిచెందారు. అప్పుడే కేంద్ర, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు పదిరోజులు సంతాప దినాలు ప్రకటించాయి. 

బహుసా పేరుకి మాత్రమే ప్రకటించాయనుకుంటా.. అందరూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటామని.. కొత్త వేడుకల్లో పాల్గొనడానికి తమ తమ కార్యాలయాల్లో సిద్దంగా ఉంటామని రెండ్రోజులు ముందుగానే మీడియా ప్రకటనలు చేసేశారు. అందులో ఎంపీలు, మంత్రులు, ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీలు, ఇతర కార్పోరేషన్ల చైర్మన్లు కూడా ఉండటం విశేషం. సంతాప దినాలు అంటే బహుసా మీడియాలో గొప్పకి ప్రకటిస్తారు గానీ.. ఎవరూ పాటించరు.. అనుకొని వీరంతా నూతన సంవత్సర ఉత్సవాల్లో పాల్గొంటున్నారో ఏమో తెలీదుగానీ.. పోటా పోటీగా ప్రజాప్రతి నిధులం తా ముందుగా మీడియా ప్రకటనలు ఇచ్చేశారు. అంటే మాజీ ప్రధానుల మృతి.. ఆపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంతాప దినాలు అన్నీ ఉత్తుత్తివేనని వీరే అపహాస్యం చేస్తున్నారు. 

వాస్తవానికి ఈ విషయం ఏ ఒక్క ప్రజాప్రతినిధినో కించపరచడానికి కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంతాప దినాలు అంటే ఎంత మంది ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి, ఇతర కార్పోరేషన్ చైర్మన్లు, అధికారులకు తెలుసు అనేది ప్రజలకు తెలుసుకుంటారని మాత్రమే.  బ్రతికుండగా పార్లమెంటు సాక్షిగా రాజకీయాలు చేసుకున్న వీరే.. కనీసం వారిలో  ఒక మాజీ ప్రజాప్రతినిధి, అందునా ప్రధాని  మృతిచెందిన తరువాతర ఆయనకి గౌరవం ఇవ్వాలని ప్రజప్రతినిధులకు అనిపించలేదు అనడానికి నేడు జరుగుతున్న నూతన సంవత్సర ఉత్సవాల్లో పాల్గొన్న నేతలకే వదిలేయాలి ప్రజలు. 

అంటే కనీస అవగాహన, ప్రభుత్వ విధి విధానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంతాప దినాలు తెలియని.. తేడా ప్రజలు ఎన్నుకున్నారనే విషయం ప్రజలకు తెలియజెప్పడానికే బహుసా వీరంతా సంతాపదినాలు జరుగుతున్న సమయంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటున్నామని ప్రచారం చేసుకోవడం శోచనీయం. అవగాహన లేని ప్రజాప్రతినిధులు ప్రచారం కోసం ఈ విధంగా చేస్తున్నారనుకుంటే.. వారి వద్ద ఉన్న ఉన్నతాధికారులకైనా అవగాహన ఉండాలి కదా అంటే.. ఇలాంటివి ఎవరు పట్టించుకుంటారు లే అన్నట్టుగా ఆ... తేడా ప్రజాప్రతినిధుల వద్ద పనిచేస్తున్న అధికారులు కూడా సిగ్గూ, శరం, మా ప్రధాని మృతి సంతాప దినాలంటే గౌరవం లేనట్టుగా బావించాల్సి వుంటుంది. 

భారతదేశం అన్నా.. ఇక్కడి ప్రభుత్వాలన్నా అందరూ ఎంతో గర్వంగా చెప్పుకుంటారు.. కానీ.. ప్రముఖల మృతి తరువాత వేడుకలు జరుపు కునే నేతలున్న భారతదేశమని, కేంద్రంలో పనిచేస్తున్న ఎంపీలని.. రాష్ట్రప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారని కూడా అంతే తేడా గా చెప్పుకుంటారు.. దివంగత డా.మన్మోహన్ జీ.. మరోలా అనుకోకండి.. మేము తేడా రాజకీయ నేతలం.. మాకు చావులపైనా.. సంతాప దినాల పైనా అవగాహన లేదు.. మీరు ఫీలవకండి.. మేము ఇంతే.. చేతనైతే ఆ పైలోకంలో ఉన్న మీలాంటి మంచివారంతా భూలోకంలోని తేడా ప్రజా ప్రతినిధుల కనీసం సంతాపదినాలు కూడా పాటించడం లేదని మాట్లాడుకోండి.. అవీ కూడా క్రిందనున్న నేతలకు వినిపించవు కదా.. మణ్ణిం చండి.. మణ్ణించండి.. మేమింతే..?!


visakhapatnam

2024-12-31 13:00:27

ఘనంగా సేవా అవార్డుల ప్రధానోత్సవం.. హీరో ఉపేంద్రబాబు సేవలకు ఢిల్లీలో విశేష గౌరవం

భారత దేశ రాజధాని ఢిల్లీలో ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు సేవలకు విశేష గుర్తింపు లభించింది.. సినిమాల్లోనే కాదు.. అన్ని వర్గాల ప్రజలకు విశేషంగా సేవలదిస్తున్న  యువ నటులు, ప్రముఖ సంఘసేవకులు కంచర్ల ఉపేంద్రబాబుకి వచ్చిన సేవా అవార్డుతో ఢిల్లీ స్థాయిలో మరింత గౌరవాన్ని పెంచింది. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించేవారిని ప్రత్యేకంగా గుర్తించి వారిని గౌరవించే  తెలుగు ఎంప్లాయిస్ అసోసియే షన్ (సేవా) 20వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రముఖ సినిమా నిర్మాత, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, టిడిపి నాయకులు, ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు, కళోభోజ, నిశ్వార్ధ సేవకులు డా.కంచర్లత అచ్యుతారవుని ఘనంగా సత్కరించి, సన్మానించడమే కా కుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హోదాలో నిలబెట్టింది. 

విశాఖలో నిరాటంకంగా అన్ని వర్గాల ప్రజలకు పెద్ద ఎత్తున సేవలు చేస్తూ.. అందునా జర్నలిస్టులకు అధిక మొత్తంలో ఆరోగ్య సేవలు ముందడుగు వేస్తూ.. వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న డా. కంచర్ల అచ్యుతరావు, ఆయన తనయుడు యువ హీరో ఉపేంద్రబాబు సేవలు ఇపుడు ఢిల్లీ స్థాయిలో విశేషంగా గౌరవాన్ని పెంచాయి.  తెలుగు ఎంప్లాయిస్ అసోసియేషన్(సేవా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వాహకులు,  అసోసియేషన్ అధ్యక్షులు పి. మురళీ క్రిష్ణ, ఫౌండర్ చైర్మన్ వివి.శేష సాయి, జనరల్ సెక్రటరీ జివిఆర్ మురళి మాట్లాడుతూ, ప్రజలకు అసాధరణ స్థాయిలో సేవలు అందించడం అంటే ప్రస్తుత రోజుల్లో సాధ్యమయ్యే పని కాదని.. కానీ ఎవరికి ఏ కష్టమొచ్చినా మేమున్నామంటూ ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్ డా. కంచర్ల ఆచ్యుతరావు ముందుకి వచ్చి ఇతోదికంగా సేవలు అందిస్తున్నారని నిర్వాహకులు కొనియాడారు. 

ఆయన బాటలోనే ఆయన తనయుడు కంచర్ల ఉపేంద్రబాబు కూడా సేవలు అందిస్తూ.. అందరి వాడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఒకేసారి ఎనిమిది సినిమాల్లో హీరోగా అవకాశం రావడం.. తద్వారా వచ్చిన ఆదాయంలో ప్రజలకు సేవలు చేయాలని నిర్ణయించుకోవడం ఒక చారిత్రక అంశమన్నారు. కేవలం డబ్బు సంపాదన కోసమే సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో సినిమాలు తీస్తూ.. కళాకారులకు ఉపాదిని కల్పిస్తూ.. వాటి ద్వారా ఎన్నో విభాగాల కార్మికులకు ఆదాయా మార్గాలు కల్పించడం నిజంగా  ప్రజలకు నిండు మనసుతో సేవలు చేయాలనుకున్నవారికి మాత్రమే సాధ్య పడుతుందన్నారు. కుటుంబంలో ఎవరో ఒకరు సేవాకార్యక్రమాలు చేస్తుంటారని.. కానీ కంచర్ల అచ్యుతరావు కుటుంబంలో అందరూ వారి జీవితాలను ప్రజా సేవకే అంకితం చేయడం ఒక చారిత్రాత్మకమని కీర్తించారు. 

స్వచ్చంద సంస్థలు, సంపన్నులు, సేవలు చేస్తే అప్పుడప్పుడూ వారికి మంచి అనుకున్నరోజుల్లో సేవలు చేస్తారని.. కానీ ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా శుభ కార్యాలతోపాటు, అనాధ శవాలకు కూడా వారే స్వయంగా తమ ఖర్చులతో అంత్యక్రియలు చేసి.. శాంతి భోజనాలు పెట్టిస్తున్నారంటే వారికి ప్రజా సేవ పట్ల ఎంతటి గౌరవముందో అర్ధం చేసుకోవాలన్నారు. అదేవిధంగా హీరో ఉపేంద్రబాబు అయ్యప్పస్వాములకు పెద్ద ఎత్తున పీఠాలు ఏర్పాటు చేసి స్వామివారి సేవలో తరిస్తున్నారని అన్నారు. సినీ కళాకారులకు కూడా తన సినిమాల ద్వారా ఉపాది అవకాశాలు కల్పిస్తున్నారని ప్రశంసించారు. వీటితోపాటు యువను సన్మార్గంలో ఉంచేందుకు, క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతీ ఏటా ఉపకార్ కప్ పేరిట భారీ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్లు.. జర్నలిస్టులు టోర్నమెంట్లు ఏర్పాటు చేసి అన్ని రకాల సేవా కార్యక్రమాలకు పుట్టినిల్లుగా ఉపకార్ ట్రస్టుని తీర్చి దిద్దారని అన్నారు. 

అలాంటి మంచి వ్యక్తులను గౌరవించుకోవడం అంటే ఢిల్లీలోని తెలుగువారందరినీ సత్కరించినట్టుగానే భావిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం ఉపేంద్రగాడి అడ్డా సినిమాను ప్రదర్శించి.. ఒక రోజంతా అన్ని కుటుంబాలు సరదా గడిపేందుకు కారణమయ్యారని కొనియాడారు..అనంతరం ఏర్పాటు చేసిన సాంస్క్రుతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. సినిమా ప్రదర్శనకు ముందు హీరో ఉపేంద్రబాబుని చూడటానికి పెద్ద ఎత్తున ఢిల్లీలోని తెలుగువారు, ఉద్యోగులు తరలి వచ్చారు. ఆయనలో సరదాగా సెల్ఫీలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పి. మురళీ క్రిష్ణ, ఫౌండర్ చైర్మన్ వివి.శేష సాయి, జనరల్ సెక్రటరీ జివిఆర్ మురళి తదితరులు పాల్గొన్నారు.


సేవా  అవార్డులు పొందిన వారి వివరాలు
సినీ హీరో, నిశ్వార్ధ సేవకులు కంచర్ల ఉపేంద్రబాబు, సిహెచ్ వ్రీనివాసరావు, ఎన్. సత్యన్నారాయణ,వి.రవి, కె.నారాయణరావు, డి.నాగేశ్వర్రావు, ఎస్.ఎన్.సిద్ధి, హితేష్ కుమార్, జి.సీతానాగజ్యోతి, టిఎల్.సీత, కెఎస్ఆర్.చంద్రమూర్తి, మహేష్ సామినేని, పి.రామక్రిష్ణ, సముద్రాలరావన్, టి.సత్యన్నారాయణ, ఎస్.వరప్రసాద్, కెవి.ప్రసాద్, ఆర్.ఎస్.కిరణ్ శర్మ, సుధీర్ చాట్ల, కె.సత్యన్నారాయణ, ఆర్.రవీంద్రబాబు,  ఎం.శివక్రిష్ణ ఉన్నారు. కాగా ఈ అవార్డుల కార్యక్రమానికి ముందు అసోసియేషన్ 20వంతాల వేడుకలు జరిగాయి.. అందులో క్యాలండర్ ను ఆవిష్కరిం చారు. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉపకార్ ట్రస్ట్ చైర్మన్, సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు,  గెస్ట్ ఆఫ్ హానర్ గా శివానీ ఇన్ఫ్రా అధినేత వాసిరెడ్డి శివనారాయణలు వ్యవహరించారు.

new delhi

2024-12-23 10:35:29