ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్ఎస్‌జి స్థాపక దినం సందర్భం లో ఎన్ఎస్‌జి బ్లాక్ క్యాట్స్ సిబ్బందికి, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఎన్ఎస్‌జి బ్లాక్ క్యాట్స్ సిబ్బందికి వారి కుటుంబాలకు ఎన్ఎస్‌జి స్థాపక దినం సందర్భంగా ఇవే శుభాకాంక్షలు. అంటూ ట్విట్టర్ వేదిక ద్వారా తెలియజేశారు. భారతదేశ భద్రత యంత్రాంగంలో ఒక కీలక పాత్రను ఎన్ఎస్‌జి పోషిస్తోంది. అత్యంత ధైర్య సాహసాలతోను, అమిత వృత్తినిపుణత తోను ఎన్ఎస్‌జి పేరు ముడిపడి ఉంది. భారతదేశాన్నిసురక్షితంగా, భద్రంగా ఉంచడంలో ఎన్ఎస్‌జి కృషిని చూసుకొని భారతదేశం గర్వపడుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ముఖ్యమంత్రులు, జెడ్ కేటగిరీ కలిగిన వారికి ఎన్ఎస్ జీ కల్పించే రక్షణ ఎనలేనిది. రెప్పపాటులో ఏం జరిగినా పసిగట్టగల నేర్పు, దానిని ఎదుర్కునే సమయస్పూర్తి ఎన్ఎస్జీ సొంతం...
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఎస్.కె. సైనీ, శనివారం నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఈనెల 20 వరకు పర్యటన కొనసాగుతుంది. రెండు దేశాల సైనిక దళాల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పర్యటన లక్ష్యం. ఇండో-పసిఫిక్ ఆర్మీ కమాండ్ విభాగమైన యూఎస్ ఆర్మీ పసిఫిక్ కమాండ్‌ను లెఫ్టినెంట్ జనరల్ ఎస్.కె. సైనీ సందర్శిస్తారు. సైనిక దళ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. అమెరికా సైనికుల శిక్షణ, ఆయుధ సంపత్తిని పరిశీలిస్తారు. తర్వాత, ఇండో-పసిఫిక్ ఆర్మీ కమాండ్‌కు కూడా వెళతారు. అక్కడ, ఇరు దేశ సైనిక దళాల మధ్య సహకారం, సంబంధాల ప్రోత్సాహంపై చర్చిస్తారు. సైనిక సేకరణలు, తగిన రీతి శిక్షణ, ఉమ్మడి విన్యాసాలు, సామర్థ్యం పెంపు వంటి అంశాలు చర్చకు వస్తాయి. ఇరు దేశ సైన్యాల మధ్య కార్యాచరణ, వ్యూహాత్మక సహకారాన్ని ఈ పర్యటన పెంచుతుంది. కొవిడ్ పరిమితులు ఉన్నా, అమెరికాతో కలిసి రెండు ఉమ్మడి సైనిక విన్యాసాల్లో భారత్ పాల్గొంటుందని ఈ పర్యటన స్పష్టం చేస్తుంది. ఆ రెండు విన్యాసాలు యుద్ధ్ అభ్యాస్ ( ఫిబ్రవరి, 2021), వజ్ర ప్రహార్ (మార్చి, 2021) జరగనుంది..