1 ENS Live Breaking News

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖేర్జీ ఆరోగ్యం మరింత విషమం

బ్రెయిన్ సర్జరీ కారణంగా ఆసుపత్రిలో ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖేర్జీ ఆరోగ్యం మరింత క్షిణించిందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రణబ్‌కు చికిత్స అందిస్తున్నామని వైద్యులు ఈ మేరకు ప్రణబ్‌ ఆరోగ్యంపై మంగళవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. అయితే ఆయన ఆరోగ్యంపై నిపుణుల వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని అన్నారు.  మాజీ రాష్ట్రపతికి సోమవారం బ్రెయిన్‌ సర్జరీ చేసి మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. తరువాత చికిత్స పొందుతున్న ఆయనకు పరిస్థితి విషయమించడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.  

New Delhi

2020-08-11 21:36:52

కరోనా టెస్ట్ నెగిటివ్ అయితేనే అయ్యప్ప దర్శనం...

శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల కోసం దేవస్థానం, అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్పను చూడాటినికి వచ్చే స్వాములు తప్పనిసరిగా కరోనా పరీక్షలు జరిపించుకోవాల్సి ఉంటుందని ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రకటించింది. పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినట్టు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా వెంట తీసుకొని రావాలని పేర్కొంది. కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్‌ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించారు. 2 నెలల దర్శనాల నిమిత్తం ఆలయం నవంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. కరోనా సంక్షోభం, లాక్​డౌన్​ల కారణంగా దాదాపు 5 నెలలపాటు శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయం తెరుచుకోలేదు.

2020-08-11 13:10:08

ఊరూ..వాడా..ఘనంగా శ్రీ క్రిష్ణాష్టమి వేడుకలు..!

శ్రీక్రిష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున క్రిష్ణాష్టమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చిన్నిపిల్లకు గోపికల వేషం వేసి శ్రీక్రిష్ణుడికి పూజలు చేయించారు. వేకువ జామునుంచే శ్రీక్రిష్ణ ఆలయాలన్నీ కిటకిటలాడాయి. చాలాచోట్ల స్వామికి ఇష్టమైన వెన్నను భక్తులు నైవేద్యంగా పెట్టారు. ఉట్టివేడుకలతోపాటు, ప్రత్యేక ఎంటర్ టైన్ మెంట్ యాప్ లు అందుబాటులోకి రావడంతో చిన్నిపిల్లల ఫోటోలను శ్రీక్రిష్ణుడి గెటప్ లో కి మార్చి వాటికి మంచి పాటలను సెట్ చేసి తల్లితండ్రులు, చిన్నపిల్లలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వున్న భక్తులంతా కరోనా వైరస్ ను రూపుమాపాలంటూ  శ్రీక్రిష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Visakhapatnam

2020-08-11 09:47:30

మన కరెన్సీనోట్లు తయారీకి ఎంత ఖర్చుఅవుతుందంటే..

భారతదేశంలో ప్రజలు, ప్రభుత్వం నిత్యం వినియోగించే డబ్బు(కరెన్సీ నోటు) తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? అయితే ఇది మీకోసమే...మనం నిత్యఅవసరాలు, కొనుగోలు, బ్యాంకుల్లో దాచుకునే కరెన్సీ నోట్ల తయారీకి అయ్యే ఖర్చుని ఆర్బీఐ వెల్లడించింది. వరుసగా రూ. 50 నోటుకు 82 పైసలు,రూ. 20 నోటుకు 85 పైసలు,రూ. 10 నోటుకు రూ. 75 పైసలు చొప్పున ఖర్చవుతోందని తెలిపింది. అంతేకాకుండా  1, 2, 5 రూపాయల నోట్ల ముద్రణను సైతం ఆర్బీఐ గత నాలుగేళ్లుగా నిలిపివేసినట్టుగా కూడా చెప్పింది. మొత్తం మీద ఈ నాలుగేళ్లలో రూ. 2,458.57 కోట్ల విలువైన రూ. 500 నోట్లు,రూ. 370.10 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లను ఆర్బీఐ ముద్రించిందిని సవివరంగా వెల్లడింది. అదన్నమాట సంగతి...

Delhi

2020-08-10 12:02:00

రక్షణరంగ ఉత్పత్తులు ఇక దేశీయంగానే..రాజ్ నాథ్

'ఆత్మనిర్భర్  భారత్' లో భాగంగా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుధ సంపత్తి సహా రక్షణ శాఖ ఉత్పత్తులను  దేశీయంగానే తయారు చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీనికోసం 2020-2024  మధ్య వాటి దిగుమతులపై నిషేధం విధించనున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. 101 ఉత్పత్తులను ఎంపిక చేసినట్లు ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తులను దేశీయంగా కొనుగోలు చేసేందుకు 52 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించినట్లు రాజ్‌నాథ్‌ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్ల బడ్జెట్‌ను దేశీయ కొనుగోళ్లు, విదేశీ కొనుగోళ్లుగా విభజిస్తున్నట్లు కూడా రాజ్ నాధ్ స్పష్టం చేశారు.

Delhi

2020-08-09 23:04:26

శ్రీవారి కళ్యాణం కారణంగానే అయోధ్య లైవ్ ఇవ్వలేదు..

ఎస్వీబీసీలో శ్రీవారి కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం కారణంగా అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించలేకపోయామని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్ప‌ష్టం చేశారు. ఆదివారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. కావాలనే ఎస్వీబీసీ ద్వారా రామ మందిరం భూమిపూజ లైవ్ కవరేజీ చేయలేదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. శ్రీవారి కళ్యాణం కారణంగా ఇవ్వలేని లైవ్ ప్రాసారాన్ని ఆ త‌రువాత న్యూస్ బులెటిన్లో ప్ర‌ముఖంగా ప్ర‌సారం చేశామని వివరించారు. ఇందులో ఎలాంటి ఇత‌ర ఉద్దేశాలు లేవన్నారు. కొంత‌మంది దీనిపై అన‌వ‌స‌రంగా విమ‌ర్శ‌లు చేసే ప‌ని ప్రారంభించడం తగదన్నారు. వాస్తవాలు తెలుసుకొన్న తరువాత తప్పుఉంటే మాట్లాడాలని సూచించారు. హిందూధార్మిక కార్యక్రమాలన్నింటినీ ఎస్వీబీసీలో ప్రముఖంగా చూపిస్తున్నట్టు ఈఓ చెప్పారు.

Tirumala

2020-08-09 22:36:34

రిపోర్టు చూపిస్తే..వ్య‌క్త‌గ‌త క్వారంటైన్ మిన‌హాయింపు

విదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం కాస్త సడలించింది. కరోనా సోకలేదని ధ్రువీకరించేలా వ్యాధి నిర్ధారణ పరీక్ష రిపోర్టును సమర్పించేవారికి వ్యవస్థాగత (ఇన్‌స్టిట్యూషనల్‌) క్వారంటైన్‌ నుంచి మినహాయింపునిచ్చింది. ఈ నెల 8 నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని తెలిపింది. భారత్‌కు ప్రయాణం ప్రారంభించడానికి 96 గంటల్లోపు చేసుకున్న పరీక్షకు సంబంధించిన రిపోర్టునే ప్రయాణికులు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. తప్పుడు నివేదికలు సమర్పిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విదేశాల నుంచి వచ్చేవారికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ మేరకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కుటుంబ సభ్యులు చనిపోవడం, తీవ్ర అనారోగ్యం, గర్భం, పదేళ్లలోపు కుమారులు/కుమార్తెలు ఉండటం వంటి తప్పనిసరి కారణాలతో భారత్‌కు వచ్చేవారు ఇకపై 14 రోజుల హోం క్వారంటైన్‌ను ఎంచుకోవచ్చునని కూడా అందులో పేర్కొంది. ఇందుకోసం భారత్‌కు ప్రయాణం ప్రారంభించడానికి కనీసం 72 గంటల ముందు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇన్నాళ్లూ వారు తొలుత ఏడు రోజులు సొంత ఖర్చులతో వ్యవస్థాగత క్వారంటైన్‌లో ఉండి, ఆపై ఏడు రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది.

Delhi

2020-08-03 17:14:23

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు తెచ్చుకునేందుకు అనుమతి..

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వ్యాధిగ్రస్థులు తమ వెంట స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. వీటి సాయంతో వారు వీడియో సమావేశాల రూపంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడుగలుగుతారని, తద్వారా మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందగలుగుతారని తెలిపింది. ఈ మేరకు వైద్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ గర్గ్‌ రాష్ట్రాల వైద్యశాఖల కార్యదర్శులకు లేఖలు రాశారు. ఆరోగ్య పరిస్థితితో పాటు రోగుల మానసిక పరిస్థితి కూడా గమనించేలా వైద్యులకు సూచనలు చేయాలని తెలిపారు. స్మార్ట్‌ ఫోన్లను తీసుకెళ్లడానికి కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు అనుమతి ఇవ్వకపోతుండడంతో ఆయన ఈ లేఖలు రాశారు. ఆసుపత్రుల్లో చేరిన కరోనా రోగుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయడానికి భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)..నేషనల్‌ క్లినికల్‌ రిజిస్ట్రీని ఏర్పాటు చేసింది. దీంతో చికిత్స విధానాలు, ఏ మందు ప్రభావం ఏ వయసు వారిపై ఎలా ఉంది? తదితర అంశాలను సూక్ష్మంగా విశ్లేషించి అధ్యయనం చేయడానికి వీలు కలుగుతుంది. కరోనా లక్షణాలు ఇంకా స్పష్టంగా వెల్లడికానందున ఇలాంటి విశ్లేషణ ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దిల్లీ ఎయిమ్స్‌ సహా దేశంలోని 15 ప్రముఖ వైద్య విద్యా సంస్థలను, వంద ఆసుపత్రులను అనుసంధానం చేస్తూ ఈ రిజిస్ట్రీని నెలకొల్పారు.

Delhi

2020-08-03 17:09:36

భారత అమ్ముల పొదిలోకి రాఫెల్ యుద్ద విమానాలు..

రాఫెల్ రాకతో భారత వైమానికదళం శత్రు దుర్భేద్యం కానుంది. భారత్ అమ్ములపొదలో అత్యాదునిక "రాఫెల్' యుద్ద విమానాలు కొలువుదీరనున్నాయి. గంటకు 2200 కి.మీ ప్రయాణం అత్యంత వేగంగా చేయగల సత్తా రాఫెల్ కలిగివుంది. అలాగే 9000 కేజీల బరువు తీసుకెళ్ళే సామర్థ్యం రాఫెల్ సొంతం. 40 లక్ష్యాలను ఎంచుకొని ఒకేసారి చేధించగల సత్తా కలిగిన రాఫెల్ యుద్ద విమానాలు అవలీలగా చేస్తాయి. అత్యాదునిక రాడార్ సాంకేతిక వ్యవస్థతో ఎలాంటి వాతావరణంలోనైనా క్షిపణి ఫైరింగ్ లో సుదూర ప్రాంతాలలో ఉన్న టార్గెట్ లను  మిస్ కాకుండా చేయగలడంలో రాఫెల్ మేటి. అలాంటి యుద్ధ విమానాలు భారత భూభాగంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈఎన్ఎస్ లైవ్ సాదర స్వాగతం పలుకుతుంది. మరి కసేపట్లో అంబాలా ఎయిర్ బేస్ లో దిగనున్న శుభ తరునంలో భారతీయులుగా మనందరం గర్వపడాలి. ఇదే ఉత్సాహంతో శత్రుదేశాలకు మన సత్తా కూడా రాఫెల్ తోనే తెలియజేయాలని కూడా ఈఎన్ఎస్ లైవ్ సగర్వంగా మనవి చేస్తుంది.

Ambala

2020-07-29 15:17:47

ఇక మానవ వనరులశాఖ కాదు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ

దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నూతన జాతీయ విద్యావిధానానికి ఆమోదం తెలిపింది. ఈమేరకు కేంద్రం మానవ వనరుల శాఖ పేరును విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియల్ చెప్పారు. ఇందులో భాగంగా నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యా విధానం అమలు చేస్తామన్న ఆయన 5+3+3+4 విధానంలో విద్యా విధానం అమలులోకి తీసుకువస్తామన్నారు. 3 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి ఉచిత, నిర్భంద విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్రం నూతన విద్యా విధానంలో మార్పులు చేశామని వివరించారు. వాటికి అనుగుణంగా కొత్త విద్యా విధానంలో సిలబస్ ను మార్పు చేస్తూ, వృత్తి, ఉపాధి లభించే విధంగా నూతన విద్యా విధానం తయారు చేస్తామని చెప్పారు. నూతన విద్యా విధానంలో మొదటి ఐదేళ్లలో ఫౌండేషన్ కోర్సుగా, ఆ తరువాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ మరియు గ్రేడ్ 1, గ్రేడ్ 2గా పరిగణించాలని భావిస్తున్నట్టు మంత్రి వివరించారు. నూతన విద్యా విధానం కోసం ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్రస్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయనున్నారు. 

New Delhi

2020-07-29 15:10:01

రైల్వే డిజిట‌ల్ స‌ర‌ఫ‌రా చెయిన్ ను జిఇఎంతో అనుసంధానం

భార‌త ప్ర‌భుత్వవిభాగాల‌లో, భార‌తీయ రైల్వేలోని ప్రొక్యూర్‌మెంట్ ప్ర‌క్రియ‌ల‌లో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్స‌హించేందుకు తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌పై  రైల్వే, వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పియూష్ గోయ‌ల్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సమావేశం సంద‌ర్భంగా మాట్లాడుతూ ఆయ‌న‌, భార‌తీయ రైల్వేల‌లో అవినీతి ర‌హిత‌, పార‌ద‌ర్శ‌క ప్రొక్యూర్‌మెంట్ విధానం ఉన్నద‌న్న విశ్వాసం ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌లో క‌ల్పించాల‌ని సూచించారు. ప్రోక్యూర్‌మెంట్ ప్ర‌క్రియ‌లో మేక్ ఇన్ ఇండియా ఉత్ప‌త్తు‌లును ప్రోత్స‌హించేందుకు తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌పై స‌మీక్షిస్తూ ఆయ‌న‌, ప్రోక్యూర్ మెంట్ ప్ర‌క్రియ‌లో స్థానిక వెండ‌ర్లు పాల్గొన‌డాన్ని పెంచేలా చూడాల‌ని నొక్కి చెప్పారు. స్థానిక వెండ‌ర్లు, స‌ర‌ఫ‌రా దారుల నుంచి మ‌రిన్ని బిడ్లు వ‌చ్చే విధంగా ప్రొక్యూర్ మెంట్ నిబంధ‌న‌ల‌లో స్థానిక కంటెంట్ క్లాజు ఉండాల‌ని నిర్ణ‌యించారు.ఇది ఆత్మ‌నిర్భ‌ర్‌భార‌త్ మిష‌న్‌కు మ‌రింత ఊపు నివ్వ‌నుంది. ఈ దిశ‌గా భార‌తీయ రైల్వే కృషి చేసేందుకు వీలుగా అవ‌స‌ర‌మైతే  డిపిఐఐటిని విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను స‌మీక్షించాల్సిందిగా కోరి దాని మ‌ద్ద‌తు తీసుకోవాల‌ని అన్నారు.  స్థానికంగా త‌యార‌య్యే వ‌స్తువుల‌ను ఎవ‌రు ఎక్కువ‌గా స‌ర‌ఫ‌రాచేయ‌గ‌లుగుతారో అలాంటి వెండ‌ర్ల‌కు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఈ స‌మావేశంలో అభిప్రాయ‌ప‌డ్డారు.  ప్రొక్యూర్‌మెంట్ ప్ర‌క్రియ‌కు సంబంధించిన వివిధ అంశాల‌పై వెండ‌ర్ల‌కు స్స‌ష్ట‌త వ‌చ్చేందుకు హెల్ప్ లైన్ నెంబ‌ర్‌, త‌ర‌చూ అడిగే ప్ర‌శ్న‌లు, స‌మాధానాల సెక్ష‌న్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కూడా సూచ‌న చేయ‌డం జ‌రిగింది. మేక్ ఇన్ ఇండియాను పెంపొందించ‌డం, జిఇఎం ద్వారా  వివిధ ఉత్ప‌త్తులు సేక‌రించ‌డానికి తీసుకుంటున్న చ‌ర్య‌లు ,ఈ దిశ‌గా జ‌రిగిన పురోగ‌తి త‌దిత‌ర విష‌యాల‌పై రైల్వే బోర్డు మెటీరియ‌ల్స్ మేనేజ్ మెంట్  స‌బ్యుడు స‌వివ‌ర‌మైన ప్రజెంటేష‌న్ ఇచ్చారు. ఈ స‌మీక్షా స‌మావేశానికి  రైల్వేశాఖ స‌హాయ‌మంత్రి శ్రీ సురేష్ సి అంగ‌డి, రైల్వేబోర్డు స‌భ్యులు, సిఇఒ, జిఇఎం, వాణిజ్య మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన  డిపిఐఐటి ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

New Delhi

2020-07-27 08:44:56

ఇండియా గ్లోబల్ వీక్‌ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగం..

భారతదేశ వర్తక, విదేశీ పెట్టుబడులే ప్రధాన అంశంగా ప్రధానమం త్రి నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. ఇండియా గ్లోబల్ వీక్ 2020 గురించి గురువారం ఆన్‌లైన్‌లో ప్రసంగిస్తారు. దీనిని బ్రిటన్ నిర్వహిస్తోంది. కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో దేశం అంది స్తోన్న రాయితీలు, పెట్టుబడులు పెట్టే వారికి అవకాశాల గురించి ప్రస్తావిస్తారు.సమావేశాలు మూడురోజులు జరగుతు న్నాయి. ప్రధాని మోడీతోపాటు కేంద్రమంత్రులు జై శంకర్, పీయూ ష్ గోయల్, హర్దీప్ సింగ్ పురీ, రవిశంకర్ ప్రసాద్, మహేంద్ర నాథ్ పాండే తదితరులు కూడా ప్రసంగిస్తారు. బ్రిటన్ నుంచి ప్రిన్స్ చార్లెస్ ప్రత్యేక ప్రసంగం చేస్తారు. తర్వాత విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్, హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్, ఆరోగ్యశాఖ కార్యదర్శి మాట్ హంకాక్ ఇతరులు మాట్లాడతారు. భారతదే శంతో ద్వైపాక్షిక సంబంధాలు.. బ్రెగ్జిట్ తర్వాత మెరుగైన సంబంధాల గురించి చర్చకొచ్చే అవకాశం ఉంది. హలీవుడ్ నటుడు కునాల్ నాయర్, ఇషా ఫౌండేషన్ ఫౌండర్ సద్దురు, జర్నలిస్ట్ బర్ఖా దత్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ కూడా పాల్గొని.. ప్రసంగిస్తారు. శిఖరాగ్ర సమావేశంలో 250 మంది వ్యాపారవేత్తలు సహా ఇతర రంగాల ప్రముఖులు కూడా పాల్గొంటారు.

PMO

2020-07-08 07:09:24