1 ENS Live Breaking News

యూజీసిలో గీతం భూ ఆక్రమణ ప్రకంపనలు..!

విశాఖకు గీతం వలనే పేరొచ్చింది..గీతం వలనే ఆంధ్రప్రదేశ్ కి గుర్తింపు వచ్చింది.. అసలు ప్రపంచంలోనే గీతం టాప్ డీమ్డ్ టుబీ యూనివర్శిటీల్లో ఒకటి అని తెగ బీరాలు పోయిన గీతం విద్యాసంస్థల యాజమాన్యానికి రాష్ట్రప్రభుత్వం గీతం భూ దురాక్రమణలపై తీసుకుంటున్న చర్యలతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.800 కోట్ల రూపాయల విలువచేసే 40.50 ఎకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా ఖబ్జాచేసిన విషయం రాష్ట్రప్రభుత్వం ఆస్తులను స్వాధీనం చేసుకొని బట్టబయలు చేయడంతో...యూజిసిలో గందర గోళం జరుగుతున్న వేళ ఇప్పటి వరకూ వచ్చిన పేరుని పోకుండా ఉండటానికి తన భజన మీడియా సంస్థలకు ప్రత్యేక ప్రకటనలు టీవీలు, పత్రికల ద్వారా ఇచ్చి విద్యార్ధులను తప్పుదోవ పట్టిస్తోందనే విషయం అందరికీ అర్ధమైపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కేబినెట్ లో జరిగిన ముఖ్యమైన అంశాల్లో గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని తీర్మాణం చేయడం దేశంలోనే సంచనలం కలిగిస్తోంది. ఒక ప్రైవేటు డీమ్డ్ టుబీ యూనివర్శిటీ ప్రభుత్వ ఆస్తులను ఎవరి అండతో ఇంతలా ఖబ్జా చేయగలిగిందనే విషయంలో అనేక చర్చలు జరుగుతున్నాయి. అదేసమయంలో దేశంలోని ప్రైవేటు డీమ్డ్ యూనివర్శిటీలను ఏకంచేసే ప్రయత్నానికి కూడా రాష్ట్రప్రభుత్వ పెద్దలు యూజిసికి రాసిన లేఖ ద్వారా అదికాస్త విఫలమైంది. లేదంటే ఒక ప్రైవేటు డీమ్డ్ యూనివర్శిటీపై రాష్ట్రప్రభుత్వ పెత్తనమనే కోణంలో బలాన్ని కూడగట్టాలని చూసిన తెరచాటు ప్రతినిధులకు ఎంపీ వి.విజయసాయిరెడ్డి యూజీసికి గీతం విద్యాసంస్థలు ఎలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మోసం చేశాయో తెలుపుతూ రాసిన లేఖలు దేశవ్యాప్తంగా డీమ్డ్ టుబీ యూనిర్శిటీల్లో ప్రకంపణలు స్రుష్టిస్తున్నాయి. అదే సమయంలో యూజీసి నుంచి వస్తున్న ఆదరణకు కూడా అడ్డుకట్ట పడిందనే చెప్పాలి. పక్కా ఆధారాలతో రాష్ట్రప్రభుత్వంలోని ఒక రాజ్యసభ సభ్యుడు యూజిసికి లేఖ రాసిన తరువాత దానిని కప్పిపుచ్చాలని చూస్తే దాని యొక్క ప్రభావం మిగతా డీమ్డ్ టుబీ యూనివర్శిటీలపై పడుతుందని గీతం భజన మీడియాకి అర్ధమైపోయింది. దీంతో యూజిసిలో జరుగుతున్న వ్యవహారాలు, విజయసాయిరెడ్డి లేఖపై యూజీసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందనే విషయాలపై ఒక్క కధనం కూడా వెలవరించకుండా వదిలివేయడంతో ఎంజరగబోతుందనే కోణంలో వేచి చూస్తున్నాయి. పైగా గీతం విషయంలో వస్తున్న వ్యతిరేక కధనాలను ఏరికోరి దాచుకొని, అందులోని ఏదైనా ఒక్క తప్పు దొర్లితే వ్యతిరేక వార్తలు రాసేవారిపై కేసులు పెట్టాలని చూస్తున్న గీతం విద్యాసంస్థలకు తాము చేసిందే అతి పెద్ద తప్పని అర్థమైపోయింది. అంతేకాకుండా  ఇటీవల యూజీసి డీమ్డ్ టుబీ యూనివర్శిటీల విషయంలో ఇచ్చిన ఉత్తర్వులను వార్తలుగా ప్రచురించిన మీడియాపై గీతం యాజమాన్యం కేసులు పెట్టడం కూడా గీతం యాజమాన్యం చేసిన తప్పుల్లో మరొక అంశం కూడా. ఇపుడు ఆ విషయంపైనా యూజీసి తక్షణమే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ప్రజా సంఘాల జేఏసి అధ్యక్షులు ఇప్పటికే కేంద్ర, రాష్ట్రప్రభుత్వ సంస్థలకు, పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. అన్ని అంశాలు గీతం విద్యాసంస్థల భూఆక్రమణకు, చేసిన పనులకు వ్యతిరేకంగా ఉండటంతో యూజీసి తీసుకునే నిర్ణయంపైనే ఆదారపడి ఉన్నాయి. ఒక్కసాయి యూజిసి తన నిర్ణయాన్ని ప్రకటిస్తే.. గీతం పని గోవింద...!

Visakhapatnam

2020-11-03 16:30:45

ఈ అర్థరాత్రి నుంచే హైదరాబాద్ బస్సులు..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల మధ్య సోమవారం ఒప్పందం కుదిరింది. మంత్రి పువ్వాడ అజయ్‌ సమక్షంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఇరు రాష్ట్రాల అధికారులు సంతకాలు చేశారు. ఏపీలో తెలంగాణ ఆర్టీసీ 1,61,258 కి.మీ మేర బస్సు సర్వీసులను నడపనుంది. తెలంగాణలో ఏపీఎస్‌ఆర్టీసీ 1,60,999 కి.మీ నడపనుంది. కాగా.. ఏపీలో తెలంగాణ ఆర్టీసీ బస్సులను తిప్పనుంది. ఇక ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణకు 638 బస్సులు నడపనుంది. విజయవాడ రూట్‌లో 273 తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. కర్నూలు- హైదరాబాద్‌ రూట్‌లలో 213 బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడపనుంది. తక్షణమే ఈ ఒప్పందం అమలులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. దీంతో ఈ అర్ధరాత్రి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడవనున్నాయి.

Hyderabad

2020-11-02 19:44:44

హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్‌ ఎన్ కౌంటర్..

జమ్ముకశ్మీర్‌లో ఆదివారం  భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ చీఫ్‌ సైఫుల్లా హతమయ్యాడు. ఈ సందర్భంగా పోలీసులు ఎన్‌కౌంటర్‌ స్థలంలో ఉగ్రవాదుల నుంచి ఏకే-47, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని జమ్మూ కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌కుమార్‌ మీడియాకి తెలిపారు.  శ్రీనగర్‌ సరిహద్దులో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిందన్న ఆయన  మరో ఉగ్రవాది తమ అదుపులో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. శ్రీనగర్‌లోని రంగ్రేత్ ప్రాంతంలోని ఒక ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు శనివారం రాత్రి సమాచారం అందడంతో పోలీసులు, సీఆర్పీఎఫ్‌ జవాన్లు సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారన్నారు. ఉగ్రవాదులు దాగినట్లు అనుమానించిన ప్రాంతానికి చేరగానే మిలిటెంట్లు వారిపై కాల్పులు జరిపారని.. దీంతో భద్రతా దళాలు ప్రతిగా కాల్పులు జరుపగా హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్‌ కమాండర్‌ సైఫుల్లా అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడని చెప్పారు.  పుల్వామా జిల్లాలోని మలంగ్‌పోరాకు చెందిన అతడు 2014 అక్టోబర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరినట్లు తెలిపారు. రియాజ్ నాయకూ అతడ్ని నియమించి ఘాజీ హైదర్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. భద్రతా దళాలు సైఫుల్లాను మట్టుబెట్టడం తమకు గ్రేట్‌ ఎచీవ్‌మెంట్‌ అని ఆయన పేర్కొన్నారు. 

Jammu and Kashmir

2020-11-01 19:21:46

భూ అవినీతి గీతం చుట్టూ చక్రబంధం..

విశాఖలో రూ.800 కోట్ల రూపాయల విలువైన సుమారు 40.50 ఎకరాల భూములు ఆక్రమించేసి దర్జాగా వాడేసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుదారి పట్టించిన గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ చుట్టూ చక్రబంధం అల్లుకుంటోంది. ఇటీవలే గీతం విద్యాసంస్థల్లో ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వ రెవిన్యూ అధికారులు, గీతం ఫౌండర్ ఎంవీవీఎస్ మూర్తి ఎంపీగా ఉన్న సమయంలో ఎంపీలాడ్స్ ఎక్కెడెక్కడ ఖర్చు చేశారనే విషయంపై కూపీ లాగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే యూజీసిని పీహెచ్డీలు, ఇతరత్రా అంశాల్లో తప్పుదోవ పట్టించిన విషయంలో రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి యూజిసికి రాసిన లేఖలో అటు యూజీసి కూడా ఆధారాలు సేకరించే పనిలో పడినట్టు సమాచారం. యూజీసీ ప్రతినిధులు మరికొద్ది రోజుల్లో విశాఖలో పర్యటించి వాస్తవాలు తెలుసుకుంటారని కూడా తెలుస్తుంది. అదే జరిగితే రాజ్యసభ సభ్యులు పేర్కొన్న అంశాలు నిజమని తేలితే గీతం డీమ్డ్ టుబీ యూనిర్శిటీ గుర్తింపు రద్దు అయ్యే అవకాశాలున్నాయి. పైగా గీతం ఆక్రమించిన ఆస్తుల విషయంలో ఏఏ సెక్షన్లు, క్లాజుల ద్వారా నోటీసులు, చర్యలు తీసుకోవాలనే విషయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అక్టోబర్ 30 వరకూ గీతంలో శాస్వత భవనాలపై స్టే ఇచ్చిన హైకోర్టు తరువాత ఇచ్చే తీర్పుని బట్టి రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉంటాయని సమాచారం. ఈలోపుగానే గీతం విషయంలో కోర్టుకి వాస్తవాలు తెలియజేసేందుకు, చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంలో అనుమతిలు కోరుతూ ఇటు ప్రభుత్వం కూడా న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటుంది తెలుస్తుంది. ఇప్పటికే గీతంలో ఆక్రమిత భూమిని కొలతలతో సహా రికార్డు చేసిన రెవిన్యూ అధికారులు, ఇంకా చుట్టుప్రక్కల ఎంత భూమి గీతం ఖబ్జా చేసిందనే విషయంలో పూర్తిస్థాయిలో ఆధాలు సేకరిస్తున్నారు. ఈ విధంగా గీతం చుట్టూ చక్రబంధం ఉచ్చు బిగిస్తున్నా, అటు యాజమాన్యం మాత్రం విద్యార్ధులపై భూ ఆక్రమణల గొడవలు పడకుండా, అన్ని టీవీల్లోనూ, పత్రికల్లోనూ ప్రకటనలు ఇస్తూ రావడం విశేషం..

Visakhapatnam

2020-11-01 17:41:16

ఇంటర్ లాక్ పనుల కారణగా పలు రైళ్లు రద్దు..

సంబల్పూర్ డివిజన్‌లోని తురకేలా రోడ్- హరిశంకర్ రోడ్- టిట్లగర్-రాయ్‌పూర్ విభాగానికి చెందిన లఖ్న మధ్య డబుల్ లైన్ మధ్య జరుగుతున్న అభివ్రుద్ధి పనుల ద్రుష్ట్యా కొన్ని రైళ్లు రద్దు చేసినట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకెత్రిపాఠి తెలియజేశారు. ఆదివారం రైల్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 1. 02.11.2020 నుండి 07.11.2020 వరకు హజ్రత్ నిజాముద్దీన్ నుండి బయలుదేరిన రైలు నెంబర్ 02888 హజ్రత్ నిజాముద్దీన్-విశాఖపట్నం ఫెస్టివల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేస్తున్నామని,  అదేవిధంగా 03.11.2020 నుంచి 08.11.2020 వరకు,  విశాఖపట్నం నుంచి బయలుదేరిన రైలు నెం .02887 విశాఖపట్నం-హజ్రత్ నిజాముద్దీన్ ఫెస్టివల్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేస్తున్నట్టు చెప్పారు. ఈ అసౌకర్యాన్ని ప్రయాణీకులు గమనించాలని ఆయన కోరారు. పనులు పూర్తైన వెంటనే తిరిగి రైళ్లు యదావిధిగా కొనసాగుతాయని ఆయన వివరించారు.

Visakhapatnam

2020-11-01 17:21:29

2020-11-01 11:30:11

2020-10-31 20:47:53

2020-10-31 19:42:30

2020-10-31 14:27:54

గీతంపై సెంట్రల్ ఇంటెలిజెన్స్..

గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ ప్రభుత్వ భూములను దురాక్రమణ చేసిన విషయంలో రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యలు, గీతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు యూజీసి సమర్పించిన నకిలీ సమాచారంపై కేంద్ర నిఘావర్గాలు ద్రుష్టిసారించాయి. ఈ మేరకు గత వారం రోజులుగా గీతం విద్యాసంస్థల విషయంలో కేంద్ర నిఘా సంస్థలు పూర్తి సమాచారం సేకరిస్తుందని తెలిసింది. ఆది నుంచి గీతం విద్యాసంస్థల అక్రమాలపై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ పరిశోధనాత్మక కధనాలు అందిస్తూ వస్తుంది.  రూ.500 కోట్ల దాటి నిర్వహణచేసే సంస్థల విషయంలో ఎప్పుడూ కేంద్ర నిఘా సంస్థలు ఒక కన్నేసి ఉంచుతాయి. అక్కడ జరుగున్న వ్యాపారం గానీ, వ్యవహారం గానీ అక్రమమా, సక్రమమా అనే విషయాలు నిఘా సంస్థలు కేంద్రానికి ఉప్పందించడండ ద్వారా సీబీఐ, ఈడీలు రంగంలోకి దిగుతాయి. అలాంటిది ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.800 కోట్ల రూపాయల విలువచేసే 40.50 ఎకరాల  భూములను ఏకంగా 38 ఏళ్లుగా ఒక్క పైసా కూడా కట్టకుండా అప్పనంగా ఆక్రమంచి, సొంతంగా అభివ్రుద్ధి చేసేసుకొని మరీ వినియోగిస్తున్న తీరుపై సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తుంది. గీతం యాజమాన్యం చెబుతున్నట్టుగా టిడిపి ప్రభుత్వంలో క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్న సమయంలోనే ఎందుకు దానిని అప్పటి ముఖ్యమంత్రి కేబినెట్ ఆమోదించలేదు, ఇపుడు ఏ కారణంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంది, ఆ తరువాత రాజ్యసభ్య సభ్యులు వి.విజయసాయిరెడ్డి పలు అంశాలతో కూడిన ఫిర్యాదును యూజికి ఏ కారణంతో సమర్పించారు, తదితర అంశాలపై ఎప్పటికప్పుడు నిఘావర్గాలు కేంద్రానికి, అటు యూజిసికి, సమాచారం పంపుతున్నట్టు తెలుస్తుంది.  వాస్తవానికి యూనివర్శిటీ ఎస్టాబ్లిస్ మెంట్ యాక్ట్ 1956 ప్రకారం ఒక విద్యా సంస్థ స్వతంత్ర(డీమ్డ్ యూనివర్శిటీ)గా మార్పుచేసే సమయంలో విద్యాసంస్థకు యూజీసి నిబంధనల మేరకు అన్నీ క్లీన్ చిట్ ఆస్తులు, వసతులు, ఆద్యాపకులు, క్రీడామైదానం, ఫస్ట్ ఎయిడ్ సెంటర్, పార్కింగ్, ఇలా చాలానే ఉండాలి. అలా ఉన్నపుడు మాత్రమే యూజీసి సదరు డీమ్డ్ యూనివర్శిటీ, ప్రైవేటు వర్శిటీలకు అనుమతులు మంజూరుచేస్తుంది. కానీ యూనివర్శిటీ స్థాపన సమయానికే అంటే 2013 నాటికే గీతం విద్యాసంస్థలు రాష్ట్రప్రభుత్వానికి చెందిన సుమారు 40.50 ఎకరాల భూమిని ఆక్రమించాయి. ఈ ఆక్రమిత ఎకరాల సంఖ్య అధికంగా ఉన్నా గతం ప్రభుత్వ హయాంలో 70 ఎకరాలకి క్లీన్ చిట్ కొట్టేసింది గీతం యాజమాన్యం. తరువాత వాటికి ఆనుకొని వున్న ఆస్తిని మొత్తం ఆక్రమించేసి, దానిని అభివ్రుద్ధి చేసి, నాక్, యుజిసి,డిఈబిలకు చూపించింది. ఆతరువాత పీహెచ్డీ విద్యార్ధుల సంఖ్యను కూడా తప్పుడుగానే చూపించింది.. అలా చూపించడానికి అప్పట్లో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండటమే. రాష్ట్రప్రభుత్వం అండగా వున్న విద్యాసంస్థకు కేంద్రప్రభుత్వం కూడా లుక లుకలపై ద్రుష్టిపెట్టదనే గుడ్డినమ్మకంతో గీతం విద్యాసంస్థ తమ డీమ్డ్ టుబి యూనివర్శిటీగా యూజీసితో అనుమతులు మంజూరు చేయించుకుంది. తరువాత గీతం విద్యాసంస్థల ఫౌండర్, అప్పటి ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి అధికారంలో ఉండగా వచ్చిన నిధులన్నీ యూనివర్శిటీ ప్రాంతంలోనే అభివ్రుద్ధికి కేటాయించారనే విషయమై వస్తున్న ఆరోపణలపై కేంద్రం నిఘా వ్యవస్థ ప్రస్తుతం వివరాలు రాబట్టే పనిలో ఉందని సమాచారం. ఇలా గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ క్యాంపస్ మొత్తం ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన విషయం, రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమణలు స్వాధీనం చేసుకున్నత తర్వాత గానీ బయటకు రానీయకుండా దాచగలిగారు. అదే సమయంలో తమ విద్యాసంస్థకు బాకా కొట్టే భజన మీడియాను ఏర్పాటు చేసుకొని అవినీతి వ్యవహరాలు, నిధులు, ఇతర అక్రమాలు బయటకు రాకుండా ఇన్నేళ్లు వారికి ప్రత్యేక ప్రకటన ప్యాకేజీలు ఇస్తూ.. దాచుకోగలిగారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులోకి వచ్చిన తరువాత ఆక్రమణలు గుర్తించడంతో అసలు విషయం బయటకు రావడం, దీనిపై రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత నేరుగా ద్రుష్టిసారించడంతోపాటు గీతంలో విద్యార్ధులకు అన్యాయం జరగకుండా ఏయూకి అటాచ్ చేస్తామని చేసిన ప్రకటనపై కేంద్ర నిఘా సంస్థలు తమ విచారణకు పనిచెప్పాయని.. అందులోకూడా అక్రమాలే కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. ఎటు వెళ్లినా గీతం విద్యాసంస్థలు, గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ అక్రమాలు కేంద్ర నిఘా సంస్థల విచారణలోకూడా అక్రమమేనని తేలినట్టు సమాచారం. ఈ విషయంలో యూజీసి, డిఈబి, ఏఐటిఈసి గీతం గుర్తింపు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని అటు యాజమాన్యంతోపాటు, విద్యార్ధులు కూడా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమిత ఆస్తులను స్వాధీనం చేసుకున్ననాటి నుంచి నేటి వరకూ గీతం ఇదంతా సక్రమమేనని చెప్పే ప్రయత్నం చేయకపోవడం కూడా ఇటు విద్యార్ధుల్లో సైతం ఇదంతా పెద్ద ల్యాండ్ స్కామ్ లా కనిపిస్తుందనే భావన ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది.

Visakhapatnam

2020-10-31 12:25:21

మహా ప్రవక్త ముహమ్మద్(స)..

నేటికి పదిహేను వందల సంవత్సరాల క్రితం అరేబియా ప్రాంతం హింసకు,దౌర్జన్యాలకు,వ్యసనాలకు, మూఢాచారాలు,మూఢనమ్మకాలకు ఆలవాలమై ఉండేది. ఎటుచూసినా అరేబియా ధనిక భూస్వాముల పీడన,అణచివేతల బారిన పడ్డ పీడిత జనం హాహాకారాలే విన్పించేవి.నల్లజాతికి చెందిన ప్రజల్ని బానిసలుగా చేసుకున్న అరబ్బు అసమసమాజం స్త్రీలను పశువుల కన్నా హీనంగా చూసేది.సరిగ్గా అదే కాలంలో యావత్ ప్రపంచం ఇలాంటి అవలక్షణాలతో అంధకారంలో ఉండేది. ఇలాంటి సమయంలో అరేబియాలోని మక్కాలో వీటిని నిరసిస్తూ ఓ విప్లవ స్వరం విన్పించింది.ఆ స్వరమే ఇస్లాం ప్రవక్త ముహమ్మద్(స). ఆయన తన ప్రగతిశీల భావాలతో యావత్ సమాజాన్ని మేల్కొలిపారు.నాటి సమాజంలోని పేదలు,దళితులు, పీడితులు ఆయన్ని అనుసరించారు.పుట్టుకరీత్యా మనుషుల్లో అధికులు,అల్పులు లేరు.తెల్లజాతి వారికి నల్లజాతి వారిపై ,నల్లజాతి వారికి తెల్లజాతి వారిపై,అరబ్బులకు అరబ్బేతరులకు,అరబ్బేతరులకు అరబ్బులపై కాని ఎలాంటి ఆధిక్యత లేదు.అల్లాహ్ దృష్టిలో మానవులంతా సమానులే. నేను మొత్తం మానవజాతికి సన్మార్గం చూపేందుకు,హితోపదేశం గరిపేందుకు వచ్చిన అంతిమ దైవప్రవక్తను. మనిషి తలవంచాల్సింది ఆ సృష్టికర్తకే తప్ప సృష్టితాలకో,ధనికులకో,పెత్తందార్లకో కాదు అంటూ ఏకేశ్వరత్వానికి, సామాజిక సమానత్వంకై ప్రవక్త ముహమ్మద్(స)ఇచ్చిన పిలుపు అరబ్బు ధనిక సర్దార్లకు ఆగ్రహం తెప్పించింది.అప్పటినుండి ఆయనపై భౌతిక, మానసిక దాడులు మొదలయ్యాయి. ఆయన వేటికీ వెరవలేదు.ఒక్కోసారి బహుదైవారాధకులు విసిరిన రాళ్ల దెబ్బలతో శరీరం రక్తసిక్తమయ్యేది.ఒంటె పేగులు తెచ్చి ఆయన మెడలో వేసి లాగేవారు.కానీ ఆయన ఎవ్వరినీ శపించేవారు కాదు.చివరికి ఆయన వారిపై చూపిన ప్రేమ ముందు కఠినాతికఠినమైన అరబ్బు సమాజం తలవంచక తప్పలేదు.క్రమంగా మొత్తం అరేబియా సమాజం ఆయన అనుసరణీయ సమాజమైంది. అప్పటినుండి ఇస్లాం ప్రవక్త సాధించిన సామాజిక సమానత్వం మొత్తం ప్రపంచాన్ని నివ్వెరపర్చింది.అప్పటివరకూ బానిసలుగా పరిగణించబడ్డ నీగ్రోజాతి ప్రజలు అరబ్బులకు సమానమయ్యారు.అత్యంత పవిత్రమైన కాబా మస్జిద్ పైకప్పుపై నల్లజాతికి చెందిన బిలాల్(ర)ను ఎక్కి తొలి అజాన్ ఇవ్వమని ప్రవక్త ఆదేశించారు. హజ్రత్ బిలాల్ కళ్లు అశ్రుపూరితాలయ్యాయి.ఎంతో ఉద్వేగంతో ఆయన అజాన్ ఇస్తుంటే అగ్రవర్ణ భావజాలం కల అరబ్బులలో కలకలం రేగింది.అప్పుడు ప్రవక్త వారిని ఉద్దేశించి 'మనం అల్లాహ్ కు కృతజ్ఞతలు తెల్పుకోవాలి.ఆయన మిమ్మల్ని అజ్ఞాన కాలపు చెడుల నుండి,అహంకారాల నుండి రక్షించాడు అని పలకగా అరబ్బుల హృదయాలు పశ్చాత్తాపంతో కరిగిపోయాయి క్షమాపణ కోరారు.అప్పటినుండి అరబ్బులు నీగ్రో ప్రజల ముందు నిలబడి ఓ నా ప్రియమైన సోదరా!అంటూ గౌరవించేవారు.అంతేకాక తమ కుమార్తెలను నీగ్రోలకు ఇచ్చి వివాహాలు చేసేవారు.కనుకే ప్రఖ్యాత యూరోపియన్ చరిత్రకారుడు లామర్టైన్ తన 'హిస్టరీ డిలా టర్క్'లో ప్రవక్త ముహమ్మద్(స)ను ఇలా ప్రస్తుతించాడు."ప్రపంచంలో ప్రతిభావంతులైన వారు ఆయుధాలు సృష్టించారు.చట్టాలు చేసారు.రాజ్యాలు స్థాపించారు.అవన్నీ భౌతిక శక్తియుక్తులకు సంబంధించినటువంటివి కనుకనే అవన్నీ అనతికాలంలోనే కూలిపోయాయి.కాని ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ తన నైతికశక్తితో మహాసైన్యాల పునాదులు కదిలించడమే గాక లక్షలాది మనుషుల్ని చలింపజేశాడు.అన్నిటికంటే ముఖ్యంగా బలిపీఠాల్ని,దేవతలను,మతాలను,భావాలను,నమ్మకాలను,ఆత్మలను స్థానభ్రంశం చేశాడు". మొత్తం పరిస్థితులు మారిపోయి యావత్ అరేబియా సమాజం ఆయన జీవించి ఉన్న కాలంలోనే ఆయన వెనుక నడుస్తున్నా అంతిమ ప్రవక్త ముహమ్మద్(స) నిరాడంబరత,స్వచ్ఛత మారలేదు.పగలంతా పరిశ్రమించి మెత్తటి పరుపులపై గాక ఖర్జూరపు చాపపై పడుకునేవారు.స్త్రీలు మన తల్లులు,చెల్లెళ్లు,కూతుర్లు అంటూ స్త్రీల హక్కుల గురించి మాట్లాడేవారు.ధర్మం ప్రకారం పురుషులకు కల అన్ని హక్కులు స్త్రీలకూ ఉన్నాయని చెప్పి అరబ్బు పురుష సమాజాన్ని సంస్కరించారు.ప్రతి పురుషుడు తన గృహంలో ప్రవేశించే ముందు తన భార్యకు సలాం చేసి మరీ వెళ్లాలని చెప్పి పురుషాహంకారాన్ని తుత్తునియలు చేశారు.బాల్యంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఓ అనాధ బాలునిగా మొదలైన ఆయన జీవితం ప్రవక్తగా మక్కా నుండి బహిష్కరించబడి ఓ వలసవాసిగా సాగి మానవ జీవన మూలాలకు సంబంధించిన అత్యున్నత సత్యాలను కనుగొన్నది.తన జీవితపర్యంతం దుర్మార్గుల హింసకు గురౌతూ కూడా శాంతి,ప్రేమ,కరుణలతో తన జీవితకాలంలోనే తన చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చిన ధీరోదాత్త ప్రవక్త ముహమ్మద్(స).ఆయన సత్యసంధతను,కరుణను ప్రత్యక్షంగా పొందిన ఆయన అనుచరులు తమపై అరబ్బు సర్దార్ల నుండి ఎన్ని విపత్తులు వచ్చినా ,చివరికి ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించారే తప్ప ప్రవక్తను వీడలేదు.అరేబియా సర్దార్లు ఖబ్బాబ్ బిన్ అర్త్ అనే ప్రవక్త సహచరుడ్ని కణకణలాడే నిప్పు కణాలపై నిలబెట్టి అతని శరీరం లోని కండరాలను క్రూరంగా కోస్తూ ఇప్పుడు నీకేమనిపిస్తుంది?నీ స్థానంలో ముహమ్మద్ ఉండి నీకు నీ పిల్లాజెల్లలతో సుఖంగా ఉండాలని లేదా?అంటూ అవహేళన చేస్తుంటే అతను -నేనే కాదు యావత్ నా కుటుంబాన్ని ముహమ్మద్(స)చూపిన మార్గంలో ధారపోసేందుకు సిద్ధమే తప్ప తన ప్రవక్తకు చిన్న ముల్లు గుచ్చుకున్నా సహించలేనని బదులిస్తాడు.అందుకే ప్రసిద్ధ భారతీయ రచయిత దివాన్ చంద్ శర్మ తన"పాఫెట్స్ ఆఫ ది ఈస్ట్"లో "ముహమ్మద్ దయాస్వరూపుడు.ఆయన ప్రభావాన్ని ఆయన చుట్టూ ఉండే వారు గ్రహించారు.మరెప్పుడూ దాన్ని మరువలేకపోయారు"అంటాడు. ప్రపంచానికి మానవీయ,ఆర్థిక, సామాజిక, రాజకీయ,సాంస్కృతిక,నైతిక విలువలను బోధించిన అంతిమ దైవప్రవక్త తుదిశ్వాస విడిచే సమయంలో ఆయన ఒంటిపై ఉన్న బట్టలకు ఎన్నో అతుకులు.ఇంట్లో దీపం వెలిగించేందుకు నూనె లేని పరిస్థితి. కానీ ఆయన వెలిగించిన జ్ఞానజ్యోతి భూమి మూలమూలల్లోకీ ప్రసరించడం మానవజాతి చరిత్రలోనే ఓ మహాద్భుతం.

Visakhapatnam

2020-10-30 08:53:38