ప్రమాదాల నియంత్రణకు కలిసి పనిచేసుకోవాలి..


Ens Balu
2
Kakinada
2022-03-03 10:46:14

తూర్పుగోదావరి, యానాం సరిహద్దు ప్రాంతంలోని బాలయోగి వంతెనకు ఇరువైపులా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు రెండు ప్రభుత్వాల ద్వారా పరస్పర సహకారాలు అంది పుచ్చుకోవాలని యానాం ఎస్పీ పి.బాలచంద్రన్..తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని కోరారు. ఈ మేరకు కాకినాడలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఎం.రవీంధ్రనాద్ బాబుని యానాం ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిసి పలు పోలీసుశాఖ పరమై అంశాలను చర్చించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాద్ బాబుని..యానా ఎస్పీ బాలచంద్రన్  ఘనంగా సత్కరించారు. రెండు ప్రభుత్వాల సమన్వయంతో పనిచేయడానికి సహాయక సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా యానాం ఎస్పీకి  తూ.గో.జి ఎస్పీ  హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రప్రభుత్వాలకు చెందిన ఎస్పీలు కలిసి శాఖాపరమైన అంశాలను చర్చించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.