ఆయుష్ లో దోబూచులాటలు.. బదిలీ చేసినా సీటు వదలని ఇన్చార్జి ఆర్డీడీ..?!


Ens Balu
86
visakhapatnam
2025-07-02 04:51:52

అడ్డదారిలో ఇన్చార్జి పోస్టులోకి వచ్చి ఐదేళ్లు దాటిపోయినా విశాఖలోని సీటు వదలడానికి ఆయుష్ ఆర్డీడీ డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ కి మనసు ఒప్పడం లేదు.. ఎలాగైనా ఇక్కడే ఉండిపోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న సమయంలో కమిషనరేట్ నుంచి కాకినాడకు బదిలీ చేసినా పనిచేస్తున్న జిల్లా నుంచి రిలీవ్ కావడం లేదు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు.. వాస్తవానికి బదిలీల ఉత్తర్వులు వచ్చిన తరువాత స్టేట్ క్యాడర్ పోస్టుల్లో ఉన్నవారు కమిషనర్ ఆదేశాలతో తక్షణమే బదిలీ జరిగిన స్థానానికి రిలీవ్ అయి వెళ్లిపోవాలి. కానీ విశాఖలో ఇన్చార్జి ఆర్డీడీ మాత్రం దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఇన్చార్జి విశాఖ రీజనల్ డిప్యూడీ డైరెక్టర్ కి చెందిన అనుచరులు, ఓ ప్రైవేట్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు రాజధానిలోని కమిషనరేట్ లో బదిలీ నిలుపుదల చేయడానికి పైరవీలు చేస్తున్నందనే ఆ సీటు వదలకుండా కూర్చుండిపోయారని చెబుతున్నారు.

 కమిషనర్ ఆదేశాలు బేఖాతరు చేయడంతో ఉత్తర్వులు పాటించనందుకు చర్యలు తీసుకునేందుకు ఫైల్ సిద్దం చేస్తున్నట్టు చెబుతున్నారు. విశాఖలో ఉన్నంత కాలం పలు విదాలకు ఆర్డీడీ కార్యాలయాన్ని వేదికగా చేసిన ఇన్చార్జి ఆర్డీడీ ఢా.ఝాన్సీ లక్ష్మీభాయ్ పై పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు అయ్యింది. అంతేకాదు యోగాంధ్ర  డ్యూటీ సమయంలో ఓ జిల్లా అధికారిపై అనుచితంగా ప్రవర్తించి, కలెక్టర్ ఆగ్రహానికి కూడా గురయ్యారు. కార్యాలయంలోని దళిత ఉద్యోగిణిపై చేయిచేసుకోవడంతోపాటు, ఒక వైద్యుడి ఫేర్ వెల్ పార్టీకి రీజియన్ పరిధిలోని అన్ని డిస్పెన్సరీలకు ఒక రోజంతా తాళం వేయించన విషయం మీడియాలో రావడంతో వైద్యులను బెదిరించి సంజాయిషి లేఖలు కూడా రాయించుకున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాల్లో ఆయుష్ శాఖకు తలనొప్పిగా మారారు. అన్నింటికంటే కమిషనరేట్ నుంచి వచ్చి ఆదేశాలను బేఖాతరు చేయడంలో ఈమె దిట్ట. 

ఇంతజరిగినా ఈమెపై చర్యలు తీసుకోకపోవడానికి ఓ ప్రైవేటు ఐఏఎస్ శిక్షణా సంస్థ డైరెక్టర్ కారణమని ఆర్డీడీతో వేధింపులకు గురైన వైద్యులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ వైద్యులో ఫిర్యాదులో లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు. వివాదాస్పద ఆయుష్ ఆర్డీడిని ఎట్టకేలకు ఐదేళ్లు సర్వీసు దాటిన తరువాత విశాఖ నుంచి కాకినాడకు బదిలీ చేసినా ఇన్చార్జి ఆర్డీడి ఆ సీటును వదిలిపెట్టకుండా ఇక్కడే ఉండిపోవడం వివేషం. బదిలీ జరిగి, రిలీవ్ కాని విషయాన్ని రూఢీ చేసుకునేందుకు ఇన్చార్జి ఆర్డీడీతో ఈరోజు-ఈఎన్ఎస్ చరవాణిలో సంప్రదించగా తనను కావాలనే బదిలీచేశారని.. ఈ విషయంలో కొందరు పనిగట్టుకొని పనిచేశారని, తన స్పౌజ్ కోటాను కూడా తప్పుగా చూపించి అకారణంగా బదిలీ చేశారని అన్నారు. అయితే తనకు జరిగిన అన్యాయంపై కూడా కమిషనరేట్ లో ఫిర్యాదు చేసినట్టు ఆర్డీడి వివరించారు. ప్రస్తుతం తాను విశాఖ నుంచి రిలీవ్ కాలేదని.. ఏవిషయమూ తేల్చుకున్నాకే రిలీవ్ అవుతానని చెప్పారు. కాగా ఈమె రిలీవ్ అయితే తప్పా.. ఇక్కడికి బదిలీ అయిన ఆర్డీడీ వచ్చి జాయిన్ కావడానికి వీల్లేకుండా పోయింది..!