ఎంటర్ ది డ్రాగన్.. డిసిఐ దొంగ డీజీల్ బిల్లుల తుట్టి కదలింది..?!


Ens Balu
9
visakhapatnam
2025-07-16 03:03:03

తాడిని తన్నేవాడు ఒకడుంటే.. వాడి తలదన్నేవాడు ఒకడుంటానే సామెతను డిసిఐలోని కొందరు అవినీతి అధికారులు నిజం చేసి చూపిస్తున్నారు. ఎవరికీ నొక్కేసిన డీజిల్ నకీలి బిల్లుల విషయం తెలియదనుకున్న వారికి.. అసలు ఆ బొక్కడానికి రూట్ మేప్ ఎలా వేస్తారన్న విషయాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనం ద్వారా బయట పెట్టడంతో ఇపుడు అందరూ.. నాలుక కరుచుకుంటున్నారు. ఈ తేడా తంతుపై వాస్తవాలు బయటకు వచ్చేస్తే అసలు విషయం తమకు సంబంధంలేదనే  చెప్పేస్తామని బిల్లుల్లో వాటాలు పంచుకున్న బిపిసీఎల్ బొక్కసం వారే భయపడి విషయాన్ని ఆ ఇద్దరితోనే చెబుతున్నారు( ఒకటి అడిగిన వారికి రెండూ అడగని వారికి)...డిసిఐలో డీజిల్ స్కామ్ ను బయటకు వచ్చిన విచారణ జరిగితే ఉత్తరాంధ్రలో ఆ యువ ఎంపీ పేరు చిస్థాయిగా డిసిఐ భవనంపై చెక్కడం ఖాయంగా కనిపిస్తున్నది..?!

డ్రెజ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(డిసిఐ)లో ఇసుకను తవ్వే డ్రెజ్జింగ్ వెసల్స్ లో వినియోగించే డీజిల్ లో దొంగ బిల్లులు పెట్టి సంస్థను సముద్రంలో ఇసుక పాలు చేసిన అధికారులను బయటకు తీసే పనిలో పడ్డారు ఉత్తరాంధ్రాకి చెందిన ఒక యువ ఎంపీ. స్వతహాగా మంచి సౌండ్ పార్టీ అయిన లంచాలకు, రాయబారాలకు లొంగకుండా డిసిఐని ప్రక్షాళన చేయడానికి నడుంబిగించారు. ఆ ఎంపీ డిసిఐ లో జరుగుతున్న డీజిల్ మాయ కోట్ల రూపాయాల్లో ఉందని.. తెలుసుకొని దానిని సెంట్రల్ షిప్పింగ్ దృష్టికి తీసుకెళ్లడంతో డిసిఐలో ఉన్న తేడా అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయ్ పడినట్టు అయ్యింది. వాస్తవంగా డిసిఐలో డీజిల్ కి,  డ్రెజ్జింగ్ వెసల్ మెయింటినెన్స్ కి బిల్లులు అడ్డగోలుగా ఏ విధంగా పెడతరానే విషయాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనం రూపంలో వెలుగులోకి తీసుకొచ్చినంది. దానితో గాతిక్రింద పంది కొక్కుల్లా దాక్కుండిపోయారు డిసిఐలోని అవినీతి అధికారులు.

 అంతేకాదు కొందరు సమాచార ప్రతినిధులు అండతో సంస్థకి ఎన్నికోట్లు నష్టం వాటిల్లేలా చేసినా, వారికిచ్చే మామూళ్లు ఇచ్చేస్తే ఏమీ కాదనుకున్న వారికి రంగంలోకి దిగిన ఎంపీ వ్యవహారం మింగుడు పడటం లేదు. ఒక్క ఖర్చుకాని డీజిల్ బిల్లులు మాత్రమే కాదు.. డిసిఐని కొనుగోలు చేసుకున్న పోర్టులలో అతిపెద్ద వాటాదారుగా ఉన్న విశాఖపోర్టులోని అధికారులు కూడా డిసిఐలోని కొందరు అవినీతి అధికారులకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాళ్లు బొక్కే నకిలీ డీజిలు బిల్లులో ప్రధాన వాటా కూడా ఇక్కడి అధికారులు వెళుతుందనే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి డిసిఐ మేనేజ్ మెంట్ కార్యకలాపాలన్నీ విశాఖ పోర్టు చూడాల్సి ఉంది. రిక్రూట్ మెంట్ నుంచి మెయింటినెన్స్, బిల్లింగ వరకూ.. కానీ డిసిఐలోకి కొందరు అధికారులు చేస్తున్న రాజకీయం కారణంగా అర్హతలేని వారందరినీ ప్రధాన పోస్టుల్లో కూర్చోబెట్టి ఎవరికీ అనుమానం రాకుండా మొత్తం ఈ కథ డిసిఐలోనే ఆ.. అధికారులు నడిపిస్తున్నారనే విషయాన్ని సదరు ఎంపీ పసిగట్టారు.

 ప్రధానంగా ఈరోజు-ఈఎన్ఎస్ కథనంలోని అంశాలపై పోర్టు అధికారులు, డిసిఐలోని పలువురు ఉద్యోగులతోో ప్రత్యేకంగా మాట్లాడి నివేదిక తయారు చేయించి మరీ కేంద్రం దృష్టికి కూడా తీసుకొని వెళ్లారని సమాచారం అందుతోంది. అయితే ఆ ఉత్తరాంధ్ర ఎంపీ నారా లోకేష్ కి అత్యంత సన్నిహిత బంధువుగా చెబుతున్నారు.  ప్రస్తుతం ప్రభుత్వంలో అవినీతి వ్యవహారాలను నిగ్గు తేల్చే విషయంలో మంత్రి నారాలోకేష్ ఆదేశాలు మాత్రమే చెల్లుబాటు అవుతున్నందున ఈ విషయం ఇటు రాష్ట్ర మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారట సదరు ఎంపీ. విశాఖలో మూడో కంటికి తెలియకుండా వందల కోట్లు కేవలం ఒక్క డిసిఐ నుంచే కొట్టేస్తున్నారనే విషయాన్ని చాలా చక్కగా ప్రభుత్వం దృష్టికి కూడా ఆ ఎంపీ తీసుకెళ్లినట్టు సమాచారం అందుతుంది. ఈ సంస్థ స్వయంప్రతిపత్తి సంస్థే అయినా ఇక్కడ అధికారులు, ఇతర సిబ్బంది పోస్టులన్నీ అడ్డదారిలో వచ్చినవేనని.. ఆపోస్టుల్లోకి రావడానికి లక్షలు ఖర్చు చేసిన వారంతా చేసిన ఖర్చుమొత్తాన్ని ఈ విధంగా కాల్చని సమురు లెక్కల్లో బొక్కల్లో చూపించి ప్రభుత్వాన్ని బురిడి కొట్టిస్తున్నారని.. 

దీనికి ఆదిలోనే అట్డుకట్ట వేయలేకపోతే రానున్నరోజుల్లో మొత్తం డిసిఐనే దివాలా తీయించేసే ఏకంగా ఇక్కడున్న ఆస్తులు కొట్టేయడానికి కూడా మాష్టర్ ప్లాన్ వేశారని కూడా సమాచారం అందుతుంది. అంతేకాదు డిసిఐలో విషయాలను ఎప్పటికప్పుడు కొందరు ఉద్యోగులు కావాలనే బయటకు పంపేస్తున్నారని.. పోస్టు కానీ పోస్టులో ముంబై బదిలీల కూడా చేసేశారు. ఇంకో అధికారిని నకిలీ విద్యార్హత పత్రాలు పెట్టుకొని ఉద్యోగాల్లోకి చేరిన విషయాలపై కూడా సదరు ఎంపీ కూపీ లాగుతున్నట్టు తెలిసింది. అయితే తన ప్రాధమిక నివేదిక తయారు చేయడానికి, పోర్టు అధికారులతో సంభాషించడానికి కారణమైన ఈరోజు-ఈఎన్ఎస్ జర్నలిస్టులకి, మీడియా సంస్తను కొందరు సమాచార ప్రతినిధుల ద్వారానే ప్రలోభపెట్టాలని చూసినా చాకచక్యంగా త్రిప్పికొట్ట గలిగారు. అంతేకాదు. ఆ విషయాన్ని మీ అందరికీ తెలిసే ఇపుడు ఈ వార్తలో కూడా ఉటంకిస్తున్నది.  ఆ యువ ఎంపీ షిప్పింగ్ మంత్రిత్వశాఖకు ఇచ్చిన నివేదికతో పాటు.. 

ఐఓసీఎల్ లోని ఇంటి దొంగలను పసిగట్టే పనిలో పడిన ఈరోజు-ఈఎన్ఎస్ కి డిసిఐలోని తేడా అధికారుల దగ్గర కక్కుర్తి పడిన కొందరు సమాచార ప్రతినిధులు కూడా ఈరోజు-ఈఎన్ఎస్ అసలు విషయం బయటకు తీసుకు వస్తే.. అక్కడయేమీ జరగలేదని ప్రత్యేకంగా వార్తలు రాయించుకోవడానికి  తెగబడ్డారంటే పరిస్థి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. విశాఖలో డిసిఐలోనీ డీజిల్ నకిలీ బిల్లల దొంగల అంశాన్ని ప్రభుత్వం, ఎంపీ దృష్టికి తీసుకెళ్లిన తరువాత మరింత కీలకమైన సమాచారం కూడా అందింది. అయితే ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది.. విచారణ పూర్తయితే మరిన్ని విషయాలను ఈరోజు-ఈఎన్ఎస్ మళ్లీ వెలుగులోనికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం డిసిఐలో రోజూ నివేదిక ఇచ్చిన ఎంపీకోసమే టాపిక్ లు నడుస్తున్నాయి. చూడాలి డీజిల్ ఖర్చుతో నొక్కేసిన మొత్తాల విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు. పోర్టులోనూ డిసిఐకి అనుకూలంగా ఉన్న అధికారులు, సిబ్బందిని ఏం చేస్తారనేది..?!