5న విజయనగరం జెడ్పీ సర్వసభ్య సమావేశం..


Ens Balu
6
Vizianagaram
2022-03-03 12:40:39

విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మార్చి 5వ తేదీ ఉదయం 10-30 గంటలకు విజయనగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందనీ జెడ్పీ సీఈఓ టి వేంకటేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు గురువారం స్థానిక మీడియాకి ప్రకటన విడుదల చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సభ్యులు, అధికారులంతా హాజరు కావాలని మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.