మొదటి విడతలో 500 గ్రామాల్లో రీ సర్వే..


Ens Balu
2
Vizianagaram
2022-03-03 12:42:45

విజయనగరం జిల్లాలో మొత్తం 1550 గ్రామాల్లో  3 విడతల్లో రీ సర్వే కార్యక్రమం జరుగుతుందని జిల్లా కల్లెక్టర్ ఎ.సూర్య కుమారి తెలిపారు. ఇందులో మొదటి విడత లో  500  గ్రామాల్లో జరుగుతుందని అన్నారు. ప్రతి విడత 6 నెలల గడువు లో పూర్తి చేయాలనీ ఆదేశించారు.  గురువారం సిసిఎల్ఏ అమరావతి నుండి  జిల్లా కల్లెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రీ సర్వే  పురోగతి పై సమీక్షించారు.  ఈ సందర్భంగా పలు సూచనలు జారి చేసారు.   సమావేశం అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ   జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ 1 క్రింద  2 గ్రామాలను ఎంపిక చేసి రీ సర్వే పూర్తి చేయడం జరిగిందని వాటికి ఫైనల్ పబ్లికేషన్ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు.  పైలట్ ప్రాజెక్ట్ 2 క్రింద 11 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని,  ఈ సర్వే త్వరగా పూర్తి చేయాలనీ, ఖచ్చితంగా కొలతలు, సరి హద్దులు ఉండేలా చూడాలని అన్నారు.  రీ సర్వే అయిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్లన్ని ఇక పై గ్రామ సచివాలయాల్లోనే జరపాలని సూచించారు. ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ రెవిన్యూ డా.జి.సి.కిషోర్ కుమార్,  సర్వే ల్యాండ్ రికార్డు ల శాఖ ఏ.డి.  త్రివిక్రమ రావు   పాల్గొన్నారు.