5 వరకూ బదిలీలకు దరఖాస్తులు చేసుకోవచ్చు..


Ens Balu
5
Kakinada
2022-03-03 12:56:28

ఆరోగ్యశాఖలో ప్రభుత్వం నిర్ధేశించిన బదిలీలకు సంబంధించి దరఖాస్తులు చేసుకు నేందుకు ప్రభుత్వం మరో రెండు రోజులు గడుపు పొడిగించినట్టు  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.మీనాక్షి తెలియజేశారు. ఈ మేరకు కాకినాడలో జిల్లా మీడియాకి ప్రకటన విడుదల చేశారు. హెల్త్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ పొడిగించిన సమయాన్ని ఉద్యోగులు, అధికారులు సద్వినియోగం చేసుకొని బదిలీలకు సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఏమైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే జిల్లా కార్యాలయంలోని సంబంధిత విభాగాల సీనియర్ అసిస్టెంట్లను సంప్రదించాలని మీడియాకి విడుదల చేసిన ప్రకటన ద్వారా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా. మీనాక్షి సూచించారు.