2.35 లక్షల మందికి కోవిడ్ టీకావేసి సేవలందించారామె.. కలెక్టర్ అభినందన..


Ens Balu
2
Madhurawada
2022-03-10 13:41:10

విశాఖజిల్లా వైద్యఆరోగ్యశాఖలో మధురవాడ పీహెచ్సీలో ఎంపీహెచ్ఏ(ఎఫ్)గా పనిచేస్తున్న చిల్లా ఉమామహేశ్వరి కోవిడ్ టీకాలు వేయడంలో అరుదైన రికార్డు నమోదు చేశారు. ఏకంగా 2.35 లక్షల మందికి ఆమె కోవిడ్ టీకా వేసి విశాఖజిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో రెపరెపలాండించారు. ఆమె చేసిన సేవకు గుర్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుక్ ఎల్.మాండవీయ ఘనంగా సత్కరించి మెమెంటోను అందజేశారు. దానిని ఈరోజు జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున ద్రుష్టికి జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి కె.విజయలక్ష్మి తీసుకు వెళ్లగా ఆమెను జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని ప్రోత్సహించారు. సిబ్బందితో మంచి సేవ జాతీయ స్థాయిలో నమోదు చేసే విధంగా క్రుషి చేసినందుకు డిఎంహెచ్ఓను కూడా జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా డిఐఓ డా.ఎస్.జీవన్ రాణి, జిల్లా కార్యాలయ సిబ్బంది ఏంపీహెచ్ఏ ఉమామహేశ్వరికి అభినందనలు తెలియజేశారు.